నియోజ‌వ‌ర్గాల పునర్విభ‌జ‌న‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ క‌దలిక మొద‌లైందా..? ఈ విషయంలో కేంద్రంపై మళ్లీ ఒత్తిడి తేనున్నారా… అధినేత‌లు ఇస్తున్న సంకేతాల‌తో నేత‌ల్లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోందా… తాజా ప‌రిణామాలు చూస్తే అవుననే చెప్పాలి.. బంప‌ర్ మెజారీటి సాధించిన టిఆరెస్, వైసీపీలు.. ఇకపై పున‌ర్వివిభ‌న‌ పైనే ఫోక‌స్ పెట్ట‌నున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి …నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంది. రాష్ట్ర విభ‌జ‌నతో పాటే అసెంబ్లీ […]

రాహుల్‌ గాంధీ వయనాడ్‌ నియోజకవర్గ పర్యటనలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రిటైర్డ్‌ నర్సు రాజమ్మను ఆయన కలుసుకున్నారు. 1970 జూన్‌ 19 న ఢిల్లీ ఆస్పత్రిలో రాహుల్‌ గాంధీ పుట్టినప్పుడు… సోనియాకు పురుడు పోసిన నర్సు.. రాజమ్మే కావడం విశేషం. అలా మొదటిసారి రాహుల్‌ను ఎత్తుకున్నది తనేనని రాజమ్మ.. ఇటీవల రాహుల్‌ వయనాడ్‌ నుంచి ఎన్నికల బరిలో నిలిచినప్పుడు వెల్లడించారు. వయనాడ్‌కు వచ్చినప్పుడు రాహుల్‌ను తప్పకుండా కలుస్తానన్న రాజమ్మను… స్వయంగా […]

మంత్రి వర్గ విస్తరణతో సంకీర్ణంలో చిచ్చు చల్లారుతుందా? కేబినెట్‌ విస్తరణతో సీనియర్లు దారికొస్తారా? మరోవైపు ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్న ఆపరేషన్‌ కమల అస్త్రాన్ని.. బీజేపీ మరోసారి ప్రయోగించబోతోందా? వచ్చే రోజుల్లో కన్నడ రాజకీయం ఎలా ఉండబోతోంది. కూటమిలో అసంతృప్త నేతలు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు ఓ కాంగ్రెస్‌ సీనియర్‌ను మంత్రి వర్గంలోకి తీసుకోవాలని సంకీర్ణ ప్రభుత్వం […]

బిహార్‌ లోని ముజఫర్ పూర్ లో చిన్నారుల మృత్యుఘోష కనిపిస్తోంది. మెదడువాపు వ్యాధితో 19 చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ వ్యాధితో డజన్ల కొద్దీ పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకృష్ణ మెమోరియల్ కాలేజ్ హాస్పిటల్ లో 38 పిల్లలు చేరగా 15 మంది చిన్నపిల్లలు చనిపోయారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో నలుగురు పిల్లలు మరణించారు. అధిక వేడి, వాతావరణంలో తేమ […]

వారిద్దరిది ఒకే మాట .. ఒకే బాట. బీజేపీని రెండో సారి అధికారంలోకి తీసుకురావడంతో వారికి వారే సాటి. దేశరాజకీయాల్లో చక్రం తిప్పుతున్న ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్ష్యుడు అమిత్‌ షాలది విడదీయరాని బంధం. ఇద్దరి మధ్య పలు అంశాల్లో పోలికలు ఉన్నాయి. ప్రభుత్వంలోనూ , పార్టీలోనూ వారిదే తుది నిర్ణయాధికారం. ఆరెస్సెస్‌తో సుదీర్గ అనుబంధం, దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులను అనుసంధానం చేయడంలోనూ, పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దటంలో […]

రుతురాగం వినిపించింది. తొలకరి జల్లు కురిసింది. ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేళకు దేశంలో ప్రవేశించాయి. వారం రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. భారత వాతావరణ శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. మాల్దీవులు, కోమోరిన్, దక్షిణ తమిళనాడు, దక్షిణ అరే బియా సముద్రం, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. తెలంగాణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాలలో ఒకటిన్నర కిలోమీటర్ వరకు ఉపరితల ఆవ […]

చిన్నారులు చేసే పనులు ఒక్కోసారి ముచ్చటేస్తాయి. ఒక్కోసారి కంటతడి పెట్టిస్తాయి. మరోసారి ఆలోచింపజేస్తాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సత్యజిత్‌ విజయ్‌ త్రిపాఠి కుమారుడు చేసిన పని కూడా చాలా మందిని కదిలించింది. మా నాన్నకు జాబ్ ఇప్పించరూ.. ప్లీజ్.. అంటూ ప్రధాని మోదీకి ఆ పిల్లాడు రాసిన లేఖ వైరల్‌గా మారింది. సత్యజిత్ త్రిపాఠీ యూపీ స్టాక్ ఎక్స్చేంజీలో పని చేసేవారు. అనూహ్యంగా 2016లో ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయారు. దాంతో […]

చరిత్రలోనే తొలిసారిగా ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే కొత్త సేవకు సిద్ధమైంది. రైళ్లలో ఇకపై ప్రయాణికులకు మసాజ్ సర్వీసు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందోర్ నుంచి వెళ్లే 39 రైళ్లలో మసాజ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. వెస్టన్ రైల్వే జోన్ పరిధిలోని రత్లం డివిజన్ నుంచి ఈ ప్రతిపాదన వచ్చినట్టు అధికారులు తెలిపారు. గోల్డ్, డైమండ్, ప్లాటినమ్ కేటగిరీల్లో వంద నుంచి 3 వందల రూపాయలుగా మసాజ్ చార్జీలు నిర్ణయించారు. 15 […]

అత్తపై ఓ కోడలు కర్కశత్వం ప్రదర్శించింది. వృద్ధురాలు అని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టింది. ఇష్టం వచ్చినట్లుగా ఆమెను కొడుతూ పైశాచికంగా ప్రవర్తించింది. మంచంపై పడుకున్న అత్తను పట్టుకొని బూతులు తిడుతూ, చితకబాదింది. హర్యానాలోని మహేంద్రఘడ్ జిల్లా నైవాజ్‌ నగర్‌కు చెందిన చాంద్ బాయి ఉదంతం ఇది. వయోభారంతో బాధపడుతూ, తన మానాన తాను మంచంపై పడుకున్న చాంద్‌ బాయిపై ఆమె కోడలు అమానుషంగా దాడి చేసింది. ఈ ఉదంతాన్ని […]

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అఖండ మెజారిటీ సాధించిపెట్టడంలో అమిత్ షా పాత్ర ఎంతో కీలకం. చేపట్టే ఏ పనైనా అంతఃకరణ శుద్ధితో పూర్తి చేయడం ఆయన స్టైల్. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తనదైన మార్క్ తో హోం శాఖను పరుగులు పెట్టిస్తున్నారు. ఒక్కసారి కేంద్రమంత్రి అయితే షెడ్యూల్డ్ చాలా బిజీ. రోజంతా తీరికలేని పనులు. రాష్ట్రాల్లో పర్యటనలు, కేంద్రమంత్రులతో భేటీలు. ఇలా ఒకటేమిటి క్షణక్షణం అంతా టైట్ షెడ్యూల్. […]