భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మైనర్‌ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కామాంధుడు. తల్లి కూలి పని కోసం వెళ్లినప్పుడు.. ఇంట్లో ఉన్న ఏడేళ్ల బాలికపై.. పక్కింటి యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని.. పైశాచికత్వం ప్రదర్శించాడు. బాలిక ఏడుస్తుండడంతో గ్రామస్తులు విషయం అడిగారు. ఆ వెంటనే.. చిన్నారి తల్లికి సమాచారం ఇచ్చారు. కామాంధుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. బాధితురాలి తల్లి అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో.. […]

ఈ మధ్యకాలంలో కుర్రకారును ఉర్రుతలూగిస్తున్న హీరోయిన్ ఎవరంటే.. టక్కున గుర్తుకు వచ్చేది నభా నటేష్. తాజాగా ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తో మాంచి ఊపుమీదున్న నభా కెరియర్ కి టాప్ గేర్ కి పడింది. “నన్నుదోచుకుండువటే”లో సిరి , ” ఇస్మార్ట్ శంకర్ “సినిమాలతో అలరించింది. దీంతో నభా ఇప్పుడు తెలుగు పరిశ్రమలో ట్రేడింగ్ హీరోయిన్ గా మారిపోయింది. సాయిధరమ్ తేజ్ తో “సోలో బ్రతుకే సో బెటర్” […]

సోమవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సీపీఐ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. టీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చింది. హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఆ పార్టీకి మద్దతు ఉపసంహరించుకున్నట్టు వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించని కారణంగా మద్దతు ఉపసంహరించుకున్నట్టు స్పష్టం చేసింది. మంగళవారం నుంచి ఆర్టీసీ సమ్మెలో ఉదృతంగా పాల్గొనాలని సీపీఐ నిర్ణయించింది. మరోవైపు ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలో హుజూర్ నగర్ లో సభ పెట్టి […]

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకు ఉద్ధృమవుతోంది. మరోవైపు… ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా ఫలితం కనిపించడం లేదు. పైగా… తాత్కాలిక డ్రైవర్లు… వరుస ప్రమాదాలతో ప్రజల్ని మరింత బేంబేలెత్తిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివనగర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-ఆటో ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ఇద్దరు మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. […]

రైతుకు పెట్టుబడి సాయం అందించే భరోసా పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడి సాయాన్ని 12 వేల 5 వందల నుంచి 13 వేల 5 వందలకు పెంచింది. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి అందిస్తుండడంతో.. పథకానికి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనగా నామకరణం చేశారు. నెల్లూరు సమీపంలోని కాకుటూరులో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి‌. రాష్ట్ర ప్రభుత్వం […]

చిత్తూరు జిల్లా యాదమరి మండలం మొర్దానపల్లె ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. కోట్లాది రూపాయలు విలువ చేసే 12 కిలోల బంగారు ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయి. బ్యాంక్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరుగుతోంది. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ చోరీకి సంబంధించిన ఆధారాలు సేకరించారు. బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరాలో ఫూటేజ్‌ రికార్డు కాకుండా హార్డ్‌ డిస్క్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే బ్యాంక్‌లో ఆభరణాలను కుదవపెట్టిన వివరాలు […]

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు వెళ్లారు. నాయుడుపేట, గూడూరు, నెల్లూరులో ఘన స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలు. జాతీయ రహదారి నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం టీడీపీ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు… నెల్లూరు జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు తన ప్రసంగంతో కార్యకర్తల్లో జోష్ నింపారు. వైసీపీ సర్కారు తీరును ఎండగట్టారు. జగన్ పంచాయితీ పులివెందులలో […]

ఏపీ సీఎం జగన్‌ కలిశారు మెగాస్టార్‌ చిరంజీవి. స్పెషల్‌ ఫ్లైట్‌లో హైదరాబాద్‌ నుంచి తాడేపల్లికి వచ్చిన చిరంజీవి దంపతులు… జగన్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు చిరంజీవి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువతో సత్కరించారు. చిరంజీవి సతీమణి సురేఖకు చీరను బహుకరించారు జగన్‌ సతీమణి భారతి. ఇది మర్యాద పూర్వక భేటీయేనని చెప్తున్నా.. ఈ ఇద్దరి సమావేశం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. సైరా సినిమా చూడాలంటూ జగన్‌ను ఆహ్వానించారు […]

పుట్టిన కొద్ది నిమిషాలకే మరణించిన తన సొంత కుమార్తెను పాతిపెట్టడానికి వెళ్లిన ఓ తండ్రికి మట్టికుండలో పాతిపెట్టిన నవజాత శిశువు దొరికింది. హితేష్ కుమార్ సిరోహి అనే వ్యాపారి ఆ నవజాత బాలికను రక్షించి, శిశువుకు పాలను పట్టి.. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బరేలీ సూపరింటెండెంట్ అఫ్ పోలీసు అభినందన్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, సిరోహి భార్య వైశాలి ప్రసవ […]

మరణం అంచుల వరకు వెళ్లి.. తిరిగి వచ్చే అదృష్టం ఎవరికో దక్కుతుంది. అటువంటి అవకాశం ఒడిశాకు చెందిన సిమాంచల్ మల్లిక్ అనే వ్యక్తికి దక్కింది. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా సోరాడా బ్లాక్ పరిధిలోని హరిపూర్ గ్రామానికి చెందిన సిమంచల్(74) చనిపోయినట్లు భావించబడ్డాడు.. దాంతో ఆదివారం అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అతన్ని కాల్చడం కోసం చితిమీద పడుకోబెట్టారు.. హఠాత్తుగా అతను పైకి లేచి కూర్చున్నాడు. సిమాంచల్ మల్లిక్ శనివారం […]