తాజా వార్తలు

తాజా వార్తలు

బిల్డింగ్‌ ఎక్కిన రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ బిల్డింగ్‌ ఎక్కిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు గంటలకు పైగా రైతులు భవనంపై నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని… వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. రాజధానిపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే వరకు దీక్ష విరమించబోమని చెప్పారు.. కొద్ది సేపటి తర్వాత పోలీసులు […]

అమరావతి కోసం మేము సైతం అంటూ గళమెత్తుతున్న ఎన్నారైలు

ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. నినాదం మార్మోగుతోంది. NRIలు కూడా అమరావతి కోసం మేము సైతం అంటూ గళమెత్తుతున్నారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలన్నదే తమ లక్ష్యమంటున్నారు. రైతుల పట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. బోస్టన్‌లో ఉన్న ఆంధ్రులంతా ఒకచోట సమావేశమై రాజధాని అంశంపై చర్చించారు. రాజధాని పోరాటానికి అంతా అండగా ఉంటామని తీర్మానించారు.

అమరావతి మంటలతో చలికాచుకుంటోన్న తెలంగాణ ప్రభుత్వం : ధూళిపాళ్ల నరేంద్ర

అమరావతి మంటలతో తెలంగాణ ప్రభుత్వం చలికాచుకుంటోందంటూ ఘాటుగా విమర్శించారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. జగన్‌- కేసీఆర్‌తో 6 గంటల ఏకాంత సమావేశంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారాయన. ఏపీ నిర్ణయాల వల్ల తెలంగాణ రాష్ట్రమే బాగుపడుతోందన్నారు. జగన్‌ను శభాష్‌ అని భుజం తట్టిన కేసీఆర్…. హైదరాబాద్‌లో ఉన్న పరిపాలన భవనాలను విభజించేందుకు ఇష్టపడుతున్నారా అని ప్రశ్నించారు. ఉత్తర దక్షిణ, మధ్య […]

రాజధాని అమరావతిపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాబ్యాలెట్‌

రాజధాని అమరావతిపై కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ప్రజాబ్యాలెట్‌ నిర్వహించారు టీడీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా రాజధాని – ప్రజా తీర్పు పేరుతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఓటింగ్‌ నిర్వహించారు. అమరావతి, విశాఖపట్నంపై 15 వేలమందికి ఓటింగ్‌ నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

రాయపూడిలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ బిల్డింగ్‌ ఎక్కిన రాజధాని రైతులు

అమరావతిని రాజధానిగా ప్రకటించాలంటూ రాయపూడిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో 8వ అంతస్థుకు ఎక్కి నినాదాలు చేశారు రాజధాని రైతులు. ముగ్గురు రైతులు బిల్డింగ్‌పై ఎక్కి నినాదాలు చేశారు. రాజధానిగా అమరావతిని ప్రకటించకపోతే.. బిల్డింగ్‌ను దూకుతామంటూ హెచ్చరించారు. ప్రాణాలైనా అర్పించి.. రాజధానిని సాధించుకుంటామన్నారు అమరావతి రైతులు.  

బీజేపీ గెలిస్తే ఈఎస్‌ఐ ఆసుపత్రిని తీసుకొస్తా – కిషన్‌రెడ్డి

కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి.. . కోకాపేట, తుక్కుగూడలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. బీజేపీకి ఆత్మగౌరవంతో ఓటువేయాలని కోరారు. బీజేపీ గెలిస్తే ఈఎస్‌ఐ ఆసుపత్రిని తీసుకొస్తామన్నారు. ‌ఒవైసీపీ, కల్వకుంట్ల కుటుంబాలనుంచి తెలంగాణకు విముక్తి కలిగించాలని ఓటర్లను కోరారు కిషన్‌రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్షమంది ఒవైసీలు అడ్డుకున్నా తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని, బీజేపీ […]

సీఆర్‌డీఏ చట్టం రద్దు మనీబిల్లుగా ఎలా తీసుకొస్తారు? – యనమల

సీఆర్‌డీఏ చట్టం రద్దు విషయంలో మనీబిల్లుగా ఎలా తీసుకొస్తారన్నారు టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు. సీఆర్‌డీఏ చట్టం మనీబిల్లు కిందకు రాదన్నారు. అది ప్రత్యేక చట్టమన్నారు. ప్రభుత్వం దీనిపై ఎలా ముందుకు వస్తుందో చూసి.. తాము కౌంటర్‌ ఇస్తామన్నారాయన. వికేంద్రీకరణతో అభివృద్ధి చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదని, కానీ రాజధానిని మార్చాలన్న దానిపైనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారాయన.  

చలో అసెంబ్లీ.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు నోటీసులు

సోమవారం అసెంబ్లీ ముట్టడిపై పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చారు. కేశినేని నాని, అచ్చెన్నాయుడు, గద్దె రామ్మోహన్‌లకు నోటీసులు అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు, జేఏసీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.  

స్త్రీలను క్షోభపెట్టిన రాజులు.. చరిత్రలో కలిసిపోయారు : రాజధాని మహిళలు

అదే పట్టుదల.. అదే ఆశయం.. 33 రోజులైనా రాజధాని రైతుల పోరాటం సడలలేదు. నెలరోజులకుపైగా దీక్షలు, నిరసనలు, ర్యాలీ చేస్తోన్న మహిళలు.. ఆదివారం మందడం, వెలగపూడి నుంచి దుర్గ గుడి వరకు పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా చూడాలంటూ బెజవాడ కనక దుర్గమ్మకు ముడుపులు చెల్లించుకోనున్నారు. మందడం నుంచి 13 కిలోమీటర్లు పాదయాత్రలో.. యువతులతో పాటు 70 ఏళ్లకు పైబడిన […]

సీఎం జగన్‌ రాష్ట్రాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారు : జేసీ

సీఎం జగన్‌ రాష్ట్రాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. ఒక సామాజిక వర్గంపై ద్వేషం పెంచాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు నీతినిజాయితీగా పనిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా అని నిలదీశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరిన జగన్‌.. దుర్మార్గ పాలన అందిస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఇలాంటి పరిపాలన ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు.