తాజా వార్తలు

తాజా వార్తలు

చలో అసెంబ్లీ.. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు నోటీసులు

సోమవారం అసెంబ్లీ ముట్టడిపై పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు నోటీసులు ఇచ్చారు. కేశినేని నాని, అచ్చెన్నాయుడు, గద్దె రామ్మోహన్‌లకు నోటీసులు అందజేశారు. మాజీ ఎమ్మెల్యేలు, జేఏసీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు. నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు.  

స్త్రీలను క్షోభపెట్టిన రాజులు.. చరిత్రలో కలిసిపోయారు : రాజధాని మహిళలు

అదే పట్టుదల.. అదే ఆశయం.. 33 రోజులైనా రాజధాని రైతుల పోరాటం సడలలేదు. నెలరోజులకుపైగా దీక్షలు, నిరసనలు, ర్యాలీ చేస్తోన్న మహిళలు.. ఆదివారం మందడం, వెలగపూడి నుంచి దుర్గ గుడి వరకు పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలిపోకుండా చూడాలంటూ బెజవాడ కనక దుర్గమ్మకు ముడుపులు చెల్లించుకోనున్నారు. మందడం నుంచి 13 కిలోమీటర్లు పాదయాత్రలో.. యువతులతో పాటు 70 ఏళ్లకు పైబడిన […]

సీఎం జగన్‌ రాష్ట్రాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారు : జేసీ

సీఎం జగన్‌ రాష్ట్రాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. ఒక సామాజిక వర్గంపై ద్వేషం పెంచాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు నీతినిజాయితీగా పనిచేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా అని నిలదీశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరిన జగన్‌.. దుర్మార్గ పాలన అందిస్తున్నాడని నిప్పులు చెరిగారు. ఇలాంటి పరిపాలన ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు.  

ఉధృతంగా సాగుతోన్న అమరావతి రైతుల ఆందోళన

అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు తారా స్థాయికి చేరాయి. మహాధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలతో రాజధాని ప్రాంతం అట్టుడుకుతోంది. ఇవాల్టితో రాజధాని రైతుల ఆందోళన 33వ రోజుకు చేరింది. ఇవాళ దుర్గగుడి వరకు పొంగళ్లుపెట్టుకుని రైతుల పాదయాత్ర యాత్ర చేయనున్నారు. ప్రధానంగా మందడం, వెలగపూడి రైతులు ఈ పాదయాత్రలో పాల్గొనున్నారు. అటు.. తుళ్లూరులోనూ ఇవాళ మహాధర్నా, వంటావార్పు నిర్వహించనున్నారు. నెల రోజులకుపైగా […]

టీఆర్‌ఎస్ పార్టీలోకి వారిని ఎట్టిపరిస్థితుల్లో తీసుకునేది లేదు : కేటీఆర్‌

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకెళుతోంది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రచారంతో హోరెత్తిస్తోంది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ వేములవాడ, సిరిసిల్ల మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికంగా రోడ్‌ షోలో పాల్గొన్నారు. వేములవాడలో పర్యటించిన కేటీఆర్.. రాజన్న పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామనీ హామీ ఇచ్చారు. 400కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. కాంగ్రెస్, […]

ప్రజా బ్యాలెట్‌లో అమరావతికే ప్రజలు పట్టం

రాజధాని కోసం అమరావతి రైతులు ఉధ్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. ర్యాలీలు, దీక్షలు, మహా ధర్నాలతో తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు.అమరాతి రైతుల పోరాటానికి ప్రజల నుంచి కూడా మద్దతు పెరుగుతోంది. ఉండవల్లిలో నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లో రైతులతో పాటు..పెద్ద ఎత్తున అమరావతి ప్రజలు పాల్గొన్నారు. అమరావతికి మద్దతుగా ఓటు వేశారు. జేఏసీ నిర్వహించిన ప్రజా బ్యాలెట్‌లో మొత్తం 1635 పాల్గొంటే..అందులో అమరావతికి […]

భారత మాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

భారత మాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్‌లో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ వేడుకలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి హాజరయ్యారు. 26న రిపబ్లిక్‌డే నాడు హైదరాబాద్‌లో జరిగే భారత్‌ మాత మహాహారతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలన్నారు కిషన్‌రెడ్డి. దేశ సమైక్యత జాతీయ భావం పెంపొందించేలా అందరూ పాల్గొనాలన్నారాయన.

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర

అమరావతి పరిరక్షణ కోసం అందరిలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్ర చేపట్టారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించారు. అమరావతి కోసం పోరాడుతున్న చంద్రబాబు నారాయణపురం, గణపవరం, ఉండి, భీమవరం, పాలకొల్లు, మాటేరులో పర్యటించారు. నారాయణపురంలో చంద్రబాబు నాయుడు కొంతదూరం పాదయాత్ర చేస్తూ జోలెపట్టి విరాళాలు సేకరించారు. గణపవరంలో టీడీపీ కార్యకర్తలతో కలిసి […]

అగ్రస్థానంలో హైదరాబాద్‌

పంచంలోనే అత్యంత క్రియాశీల నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. శుక్రవారం రాత్రి తాజ్‌ డెక్కన్‌లో జరిగిన కార్యక్రమంలో జేఎల్‌ఎల్‌ సిటీ మొమెంటమ్‌ ఇండెక్స్‌ 2020ను తెలంగాణ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జేఎల్ఎల్‌ కంట్రీ హెడ్‌, సీఈఓ రమేశ్‌ నాయర్‌, తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, జేఎల్‌ఎల్‌ ఇండియా చీఫ్‌ ఎకనామిస్ట్‌ సమంతక్‌ దాస్‌, […]

ఢిల్లీలో జోరందుకున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. భారతీయ జనతాపార్టీ భారీ స్థాయిలో ప్రచారానికి సిద్ధమైంది. 20 రోజుల్లో సుమారు 5 వేల సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సభలన్నీ కూడా స్థానికంగా జరిగేవే. స్థానిక ప్రజలతో మమేకమయ్యేలా కార్యక్రమాలు ఉండాలని బీజేపీ నాయకత్వం సూచించింది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో రోజుకు 3 లేదా 4 బహిరంగ సభలు నిర్వ హించనున్నారు. అంటే […]