చిత్తూరు జిల్లా యాదమరి మండలం మొర్దానపల్లె ఆంధ్రాబ్యాంక్‌లో భారీ చోరీ జరిగింది. కోట్లాది రూపాయలు విలువ చేసే 12 కిలోల బంగారు ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయి. బ్యాంక్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు జరుగుతోంది. డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ చోరీకి సంబంధించిన ఆధారాలు సేకరించారు. బ్యాంక్‌లో ఉన్న సీసీ కెమెరాలో ఫూటేజ్‌ రికార్డు కాకుండా హార్డ్‌ డిస్క్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే బ్యాంక్‌లో ఆభరణాలను కుదవపెట్టిన వివరాలు […]

క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకు వెళ్లారు. నాయుడుపేట, గూడూరు, నెల్లూరులో ఘన స్వాగతం పలికారు పార్టీ నేతలు, కార్యకర్తలు. జాతీయ రహదారి నుంచి భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం టీడీపీ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు… నెల్లూరు జిల్లా టీడీపీ సర్వసభ్య సమావేశంలో చంద్రబాబు తన ప్రసంగంతో కార్యకర్తల్లో జోష్ నింపారు. వైసీపీ సర్కారు తీరును ఎండగట్టారు. జగన్ పంచాయితీ పులివెందులలో […]

ఏపీ సీఎం జగన్‌ కలిశారు మెగాస్టార్‌ చిరంజీవి. స్పెషల్‌ ఫ్లైట్‌లో హైదరాబాద్‌ నుంచి తాడేపల్లికి వచ్చిన చిరంజీవి దంపతులు… జగన్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు చిరంజీవి పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువతో సత్కరించారు. చిరంజీవి సతీమణి సురేఖకు చీరను బహుకరించారు జగన్‌ సతీమణి భారతి. ఇది మర్యాద పూర్వక భేటీయేనని చెప్తున్నా.. ఈ ఇద్దరి సమావేశం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. సైరా సినిమా చూడాలంటూ జగన్‌ను ఆహ్వానించారు […]

పుట్టిన కొద్ది నిమిషాలకే మరణించిన తన సొంత కుమార్తెను పాతిపెట్టడానికి వెళ్లిన ఓ తండ్రికి మట్టికుండలో పాతిపెట్టిన నవజాత శిశువు దొరికింది. హితేష్ కుమార్ సిరోహి అనే వ్యాపారి ఆ నవజాత బాలికను రక్షించి, శిశువుకు పాలను పట్టి.. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. బరేలీ సూపరింటెండెంట్ అఫ్ పోలీసు అభినందన్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, సిరోహి భార్య వైశాలి ప్రసవ […]

మరణం అంచుల వరకు వెళ్లి.. తిరిగి వచ్చే అదృష్టం ఎవరికో దక్కుతుంది. అటువంటి అవకాశం ఒడిశాకు చెందిన సిమాంచల్ మల్లిక్ అనే వ్యక్తికి దక్కింది. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా సోరాడా బ్లాక్ పరిధిలోని హరిపూర్ గ్రామానికి చెందిన సిమంచల్(74) చనిపోయినట్లు భావించబడ్డాడు.. దాంతో ఆదివారం అతని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అతన్ని కాల్చడం కోసం చితిమీద పడుకోబెట్టారు.. హఠాత్తుగా అతను పైకి లేచి కూర్చున్నాడు. సిమాంచల్ మల్లిక్ శనివారం […]

రాముడు, లక్ష్మణుడు, సీత.. రామాయణ గాథలోని ముఖ్య పాత్రలు. భర్త రాముడి మనసెరిగిన భార్య సీత.. అన్న అడుగు జాడల్లో నడుచుకునే తమ్ముడు లక్ష్మణుడు. పినతల్లి ఆజ్ఞానుసారం 14 సంవత్సరాలు అరణ్యవాసానికి బయలు దేరిన రామునితో అర్ధాంగి సీత, తమ్ముడు లక్ష్మణుడు బయలుదేరి వెళతారు. అణకువగా ఉండే సీత అరణ్యంలో కంద మూలాలు తింటూ భర్తకు సపర్యలు చేస్తూ, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పరవశించి పోతుంది. అయిన వారు పక్కనే […]

రైతు భరోసా పథకం గందరగోళంగా మారిందన్నారు టీడీపీ నేతలు. ఇంతవరకూ పూర్తిస్థాయిలో అర్హులను ప్రకటించలేదని… నిజమైన అర్హులకు కూడా జాబితాలో చోటు దక్కలేదన్నారు. ఆన్‌ లైన్‌ లో సరైన వివరాలు లేకపోవడంతో రైతులకు సాయం అందే పరిస్థితి లేదంటున్నారు టీడీపీ నేతలు. ప్రభుత్వ అస్తవ్యస్త నిర్ణయాలే ఇందుకు కారణమన్నారు టీడీపీ ఎమ్మెల్సీలు. అటు కౌలు రైతుల విషయంలో కూడా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలంటున్నారు. మొత్తం 14 లక్షల […]

TSRTC కార్మికులు చేస్తున్న సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిశీలించాలన్నారు. ఒకేసారి వేల మంది ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు. ఈ నెల 19న ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన బంద్‌కు జనసేన మద్దతిస్తోందన్నారు పవన్‌ కళ్యాణ్‌.

చూస్తేనే చెప్పేస్తారు.. హే! ఈ అమ్మాయి.. ఆ యాడ్ లో కనిపించింది కదా అని! అంతలా జనాన్ని అట్రాక్ట్ చేసింది సాషా. యూత్ అయితే ఆమెలా హెయిర్ స్టైల్ పెంచుకోవాలని, ఆమె మేనరిజన్స్ ని ఫాలో అవ్వాలని తెగ ట్రై చేసింది. అంతలా పాపులర్ అయ్యింది సాషా. ఒకే కంపెనీ యాడ్ లో పదే పదే కనిపించడంతో తెలుగునాట కూడా బాగా రిజిస్టర్ అయ్యింది. అందుకే ఎంతోమంది కుర్రకారు.. తమ […]

కర్నూలు జిల్లాలో జరిగిన ఆటో ప్రమాదం ఓ విద్యార్థి ఉసురు తీసింది. మంత్రాలయం మండలం మాలపల్లి గ్రామ సమీపంలో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో చౌళహల్లి గ్రామానికి చెందిన గౌస్‌ అనే 7వ తరగతి విద్యార్థి చనిపోయాడు. మరో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.