రెండోసారి అధికారాన్ని చేపట్టిన మోదీ ప్రభుత్వం… 17వ లోక్‌సభ సమావేశాలకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంట్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ మేరకు తొలి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ప్రారంభమైన మొదటి రోజున ప్రోటెం స్పీకర్‌ నియామకం జరుగుతుంది. ప్రోటెం స్పీకర్‌గా అత్యంత సీనియర్‌ అయిన మేనకాగాంధీ ఎంపికయ్యే అవకాశం ఉంది. తొలి రెండురోజులు సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం […]

ఏపీ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగనుంది. ఈ నెల 13 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్టు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ దామోదర్‌ తెలిపారు. ఇందుకు సంబందించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడలోని జేఏసీ కార్యాలయంలో వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. తమ సమస్యలు, డిమాండ్లపై కొత్త ప్రభుత్వం స్పందించాలన్నారు. సంస్థ నష్టాలను ప్రభుత్వమే భరించాలని.. సిబ్బంది కుదింపు ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర సమయంలో తమకు ఇచ్చిన హామీల్ని.. […]

రాష్ట్రంలో వ‌రుస ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌టంతో ఇప్పటివరకు పూర్తి స్థాయి విస్త‌ర‌ణ చేపట్టలేకపోయారు సీఎం కేసీఆర్‌. అయితే.. ప్రస్తుతం దాదాపుగా అన్ని ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గవిస్తరణపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మిగిలిన 6 మంత్రి ప‌ద‌వుల్ని జెడ్పిటిసి,ఎంపిటిసి ఫలితాలు వెలువ‌డిన కొద్ది రోజుల‌కే భర్తీ చేసే అవకాశాలున్నాయి. దీనిపై ఇప్పటికే కేసిఆర్ క‌స‌ర‌త్తు చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆరు స్ధానాల్లో ఎవ‌రెవ‌రికి ఛాన్స్ ద‌క్కుతుంద‌న్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా […]

కేంద్రంలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు.. తొలి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సాయంత్రం మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో… హోంమంత్రి అమిత్‌షా తో 24 మంది క్యాబినెట్‌ మంత్రులు, 9 మంది స్వతంత్రహోదా మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయరంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలోని రైతులందరికీ ప్రధాన మంత్రి కిసాన్‌ యోజన పథకం అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో అదనంగా రెండు […]

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలో దారుణ హత్య జరిగింది. పట్టపగలే ఓ వ్యక్తిని వెంబడించిన దుండగులు, జాతీయ రహదారిపై వేటకొడవళ్లతో నరికి చంపారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. దుండగులు హత్య చేస్తుంటే ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. హత్య అనంతరం నిందితులు బైక్‌పై పరారయ్యారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న వాహనదారులు సెల్‌ ఫోన్లో రికార్డు చేశారు. హత్య విషయం తెలుసుకొని పోలీసులు సంఘటనా స్థలాన్ని […]

ఆంధ్రప్రదేశ్‌‌ క్యాబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 8వ తేదీన మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. అమరావతి సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో ఆ రోజు ఉదయం 9 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆ వెంటనే 11 గంటల 49 నిమిషాలకు జగన్ కేబినెట్ తొలి సమావేశం అవుతుంది. అయితే.. కేబినెట్‌లోకి ఎంతమందిని తీసుకుంటారు, ఎవరెవరిని తీసుకుంటారనేది సస్పెన్స్‌గా […]

పచ్చటి కాపురంలో తాగుడు చిచ్చుపెట్టింది. భర్త ప్రతి రోజు తాగి వచ్చి హింసిస్తుండడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. తాగుడు మానేసేదాకా రానని ఆమె తెగేసి చెప్పేసింది. ఇక భార్య కాపురానికి రావడం లేదన్న మనస్థాపంతో భర్త బ్లేడ్‌తో పీక కోసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఏలూరు రూరల్‌ జూలిపూడిలో ముత్యాలు.. చేపల చెరువుపై కాపాల కాస్తుంటాడు. కొంతకాలంగా ముత్యాలుకు అతని భార్య రత్నాలుకు గొడవలు జరుగుతున్నాయి. భర్త తాగి వచ్చి […]

ఏలూరులో మహిళా పోలీస్‌ స్టేషన్‌ వద్ద దారుణం జరిగింది… భార్య కాపురనికి రావట్లేదంటూ భర్త ముత్యాలు బ్లేడుతో పీక కోసుకున్నాడు… తీవ్ర రక్తస్రావం అయి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు… వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు… ఏలూరు రూరల్‌ జాలిపూడిలో చేపల చెరువుకు కాపలా కాసే ముత్యాలుకు భార్య రత్నాలుకు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది… రత్నాలు తన ఇద్దరు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది… […]

తెలంగాణలో ఖాళీ అయిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్‌ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగిన ఈ పోలింగ్‌లో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మూడు ఎమ్మెల్సీల పరిధిలో 2799 మంది ఓటర్లు ఉండగా.. 25 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ పారదర్శకత కోసం వీడియోగ్రఫీ, వెబ్ […]

కేంద్రంలో మోదీ సర్కారు రెండో విడత పాలన మొదలైంది. పలువురు కేంద్ర మంత్రులు తొలిరోజే బాధ్యతలు స్వీకరించారు. ఉదయమే తమ శాఖల కార్యాలయాలకు చేరుకున్న మంత్రులు నిరాండంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వీరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు… కిరణ్‌ రిజిజు, పీయూష్‌ గోయల్‌, జితేంద్ర సింగ్‌, ప్రహ్లాద్‌ జోషి, శ్రీపాద యశోనాయక్, ప్రకాశ్‌ జావ్డేకర్‌, రమేష్‌ పోక్రియాల్‌ ఉన్నారు.