పిల్లల కోసం పెద్దవాళ్లుగా మనం చేయాల్సినవన్నీ చేయాలి. ముఖ్యంగా వారి మంచి చదువులు చెప్పించడం కోసం ఆర్థికంగా అండగా ఉన్న మంచి పాలసీలను ఎంచుకోవాలి. పిల్లలకు సంబంధించిన పాలసీలు తీసుకున్నప్పుడు వారి పేరుతో పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. పాలసీ నిబంధనల ప్రకారం బీమా సంస్థే సొంతంగా ప్రీమియంని చెల్లించుకుంటుంది. వారి చదువులకు, వారి వివాహానికి, సొంతంగా ఏదైనా సంస్థను ప్రారంభించడంలాంటి సందర్భాల్లో అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు బీమా […]

ఉత్తరప్రదేశ్‌లోని మవు జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ పేలి 2అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య […]

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని టీఆర్ఎస్‌ ఎంపీ కేశవరావు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి చేయిదాటకముందే యూనియన్లు సమ్మె విరమించి చర్చలకు రావాలన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు తనను ఎంతో బాధించాయన్నారు. పరిస్థితులు చేయి దాటక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలు చర్చలకు రావాలని, ఆర్టీసీ విలీనం తప్ప మిగతా డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. TRS ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను గతంలో గొప్పగా పరిష్కరించిందని కేకే గుర్తు […]

గన్నవరం గాంధీబొమ్మ సెంటర్‌ వద్ద పండ్ల వ్యాపారులు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో కిషోర్‌ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరి మధ్య వ్యాపారలావాదేవీల్లో తలెత్తిన వివాదమే ఘర్షణకు కారణమని తెలుస్తోంది. ఒంటిపై గాయాలతో పోలీస్‌స్టేషన్‌‌కు వెళ్లిన కిషోర్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

అతడే తన సర్వస్వమనుకుంది.. అన్నీ అర్పించుకుంది. మనసైన వాడినే మనువాడాలనుకుంది. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు.. ప్రేమించిన ప్రియుడితో జీవితాన్ని పంచుకోవాలనుకున్న ప్రియురాలి ఆశలు అడియాశలయ్యాయి. భ్రిటన్‌లోని పిలేగ్ ప్రాంతానికి చెందిన హారిసన్, లిజ్‌లు టినేజ్ నుంచి ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను పెద్దలు కూడా అంగీకరించడంతో పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ అంతలోనే వారి జీవితాల్లో విషాదం చోటు చేసుకుంది. హరిసన్‌కు బ్రెయిన ట్యూమర్ వచ్చింది. ఎన్ని మందులు వాడినా […]

విజయవాడలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చి షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గూడ్స్ ఆటోలు, బైక్‌లు ధ్వంసమయ్యాయి. జనం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఐతే.. మైనర్ డ్రైవింగ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీతారామ్‌పురం లాల్‌ బహుదూర్‌ శాస్త్రి వీధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఉత్తరప్రదేశ్‌లో ఆకతాయిలు రెచ్చిపోయారు. భవానీ గంజ్‌లో యువకుడిపై మూకదాడికి పాల్పడ్డారు. చెట్టుకు కట్టేసి మరీ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. దెబ్బలకు యువకుడు సొమ్మసిల్లి పడిపోయినా అతి కిరాతకంగా ప్రవర్తించారు పోకిరీలు. అంతటితో ఆగక యువకుడికి గుండు కూడా కొట్టించారు. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది. విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎందుకు యువకుడిపై ఆకతాయిలు దాడికి తెగబడ్డారో విచారిస్తున్నారు. మరోవైపు యువకుడి పరిస్థితి విషమంగా […]

ఏపీలో కొత్త మున్సిపాలిటీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో భాగంగా అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. 50 గ్రామ పంచాయితీలు, నగర పంచాయితీలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు గల అవకాశాలను పరిశీలించి వెంటనే ప్రతిపాదనలు పంపాలని కోరింది. మొత్తం 13 జిల్లాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. గతంలో ప్రతిపాదనలు పంపాలని కోరినా.. ఎలాంటి స్పందన లేదని ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున నగర, గ్రామ పంచాయితీలను పురపాలక సంఘాలుగా మార్చేందుకు గల అవకాశాలను […]

షార్ట్స్ వేసుకోవట్లేదు.. మందు షేర్ చేసుకోవట్లేదు.. నాకొద్దీ పాత చింత కాయ పచ్చడి అంటూ భార్యని బయటకు పంపించేశాడు ఈ మోడ్రన్ మహాశయుడు. మూడు సార్లు తలాక్ చెప్పి బయటకు గెంటేశాడు. ట్రిపుల్ తలాక్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా అక్కడక్కడా కొన్ని కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన నూరి ఫాతిమాకు 2015లో ఇమ్రాన్ ముస్తఫా అనే వ్యక్తితో వివాహమైంది. గత కొంత కాలం […]

సోమవారం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మధ్యాహ్నం లంచ్‌ మీటింగ్‌ కోసం చిరు హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వెళ్తున్నారు. తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి ఆయన జగన్ ఇంటికి వెళ్తున్నారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీయేనని చెప్తున్నా.. ఈ ఇద్దరు ప్రముఖుల భేటీ అందర్లో ఆసక్తిరేపుతోంది. సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలంటూ జగన్‌ను ఆహ్వానించనున్నారు చిరు. సీఎం వీలును బట్టి స్పెషల్ షో వేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు […]