తాజా వార్తలు

తాజా వార్తలు

నిత్యానందపై బ్లూకార్నర్ నోటీసులు జారీ చేసిన ఇంటర్ పోల్

వివాదాస్పద స్వామి నిత్యానందపై ఇంటర్‌పోల్ నోటీస్ జారీ అయ్యింది. నిత్యానంద ఆచూకీ చెప్పాలని ప్రపంచ దేశాలను ఇంటర్ పోల్ కోరింది. నిత్యానంద ఆచూకీ తెలుసుకోవడానికి సహకరించాలంటూ గుజరాత్ పోలీసులు ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించారు. స్పందించిన ఇంటర్‌పోల్, నిత్యానందపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసింది. అమ్మాయిలను లైంగికంగా వేధించాడని నిత్యానందపై ఆరోపణలున్నాయి. గుజరాత్‌లోని ఆశ్రమంలో బాలికలను అక్రమంగా నిర్బంధించారని అభియోగాలు నమోదయ్యాయి. కేసుల నేపథ్యంలో […]

సీఏఏ అంశంలో విపక్షాలకు బిగ్ షాక్.. స్టే ఇవ్వడానికి అంగీకరించని సుప్రీం కోర్టు

పౌరసత్వ సవరణ చట్టంపై మోదీ సర్కారుకు బిగ్ రిలీఫ్ లభించింది. పౌరచట్టంపై స్టే ఇవ్వడానికి సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. CAA ప్రక్రియను నిలిపివేయడానికి కూడా సుప్రీంకోర్టు ఒప్పు కోలేదు. ఈ చట్టంపై కేంద్రప్రభుత్వం 4 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అప్పటిలోపు హైకోర్టులు ఎలాంటి విచారణలు చేపట్టవద్దని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే […]

మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ.. మరోసారి కశ్మీర్ అంశంపై స్పందించిన ట్రంప్

వద్దన్న పని చేయడం అమెరికా అధ్యక్షునికి అలవాటుగా ఉన్నట్లుంది. మీ జోక్యమే వద్దు అని భారతదేశం పదే పదే చెబుతున్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్‌ పట్టించుకోవడం లేదు. తాజాగా మరోసారి అదే మాట మాట్లాడారు. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. కశ్మీర్‌ అంశాన్ని తాము జాగ్రత్తగా గమనిస్తున్నామని ట్రంప్ తెలిపారు. కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని మోదీ ప్రభుత్వం రద్దు […]

గగన్‌యాన్ ప్రయోగానికి శరవేగంగా ఏర్పాట్లు

ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్‌ ప్రయోగానికి కూడా ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గగన్‌యాన్ మిషన్‌కు ఎంపికైన నలుగురు వ్యోమగాములు ఈ నెల చివర్లో రష్యాకు వెళ్లనున్నారు. అక్కడ వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. 1984లో స్క్వాడ్రన్ లీడర్ రాకేష్‌ శర్మ రష్యన్‌ మాడ్యూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లగా, ఈసారి భారతీయ వ్యోమగాములు స్వదేశీ మాడ్యూల్‌ లోనే రోదసీలోకి వెళ్లనున్నారు. అంతరిక్షంలోని మానవులను పంపడమే […]

శాసనమండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం

  మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై మండలిలో ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతోంది. బిల్లును ప్రవేశపెట్టే ముందే సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కోరాల్సిందన్న మంత్రి బొత్స వాదనను టీడీపీ ఎమ్మెల్సీలు తప్పుబడుతున్నారు. రాజధాని విభజన బిల్లును బుధవారం సాయంత్రం 6 గంటలకు మండలిలో ప్రవేశపెడితే.. బుధవారం ఉదయమే బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపాలని నోటీసిచ్చామని టీడీపీ సభ్యులు చెబుతున్నారు. రాజధాని విభజన బిల్లుపై ఓటింగ్ […]

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన పిరమాల్ గ్రూప్

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కంపెనీ పిరమాల్ గ్రూప్ సిద్ధమైంది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రానున్న మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో 500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు తెలుస్తోంది. పిరమాల్ గ్రూప్‌కు ప్రస్తుతం తెలంగాణలో 1400 మంది ఉద్యోగులున్నారు. ఈ పెట్టుబడులతో అదనంగా మరో 600 మందికి ఉపాధి […]

తెలంగాణలో ప్రశాంతంగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. చాలాచోట్ల  బుధవారం కూడా  డబ్బుల పంపిణీ చేయడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మేడ్చల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో పలు పోలింగ్‌ బూత్‌ల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. ఓ వైపు పోలింగ్‌ జరుగుతుంటే మరోవైపు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్‌ -టిఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. మరికొందరు తమ ఓట్లు గల్లంతయ్యాయని, తమ […]

అర్థరాత్రి 12 దాటినా హ్యాపీగా షాపింగ్.. 24 అవర్స్ ఓపెన్ మరి..

వర్షం పడుతుంటే ఐస్‌క్రీం.. నగర మంతా నిద్రపోతుంటే హ్యాపీగా షాపింగ్ చేస్తుంటే ఎంత బావుంటుంది. మరి ఇప్పటి యూత్‌కి ఇదే కావాలి. అందుకే మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే పర్మిషన్ ఇచ్చేశారు. ముంబైలోని కొన్ని ప్రాంతాలు బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారీమన్ పాయింట్ లాంటి ఏరియాల్లో అర్థరాత్రి వరకే కాదు తెల్లవార్లు షాపులు తెరుచుకునే ఉండొచ్చని ప్రకటించారు. ఇక్కడ మాల్స్, […]

మా నాన్న గురించి నేనేం రాయను.. మంత్రిని కదిలించిన చిన్నారి వ్యాసం

‘నేను రెండో తరగతిలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా మానేయకుండా రోజూ స్కూలుకు వెళుతుంటే మా నాన్న చాలా సంతోషించేవాడు.. బాగా చదువుకుని పెద్ద ఆఫీసరవు కావాలిరా అనే వాడు.. కానీ నేను మూడో తరగతికి వచ్చేసరికి నాన్నకి టీబీ వచ్చి అమ్మని, నన్ను, నా ఇద్దరు చెల్లెళ్లను వదిలేసి వెళ్లిపోయాడు. జబ్బు తగ్గించుకోవడానికి డబ్బులు లేక నాన్నని కోల్పోయామని అమ్మ రోజూ […]

స్పీకర్ రూలింగ్ లేకుండా మార్షల్స్ రావటం ఏంటి?: చినరాజప్ప

అసెంబ్లీలో ప్రభుత్వ వ్యవహార శైలిపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ రూలింగ్ లేకుండానే.. సీఎం ఆదేశాల మేరకు మార్షల్‌ రావడం ఏంటని సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ప్రశ్నించారు. ఇలాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదని అన్నారాయన. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చినరాజప్ప తెలిపారు.