ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్‌ తొలిసారి హైదరాబాద్‌లో గవర్నర్‌ సమక్షంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న జగన్‌ ఇఫ్తార్‌ విందుకు హాజరయ్యేందుకు నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకోగా.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా అక్కడికి చేరుకొని గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఇఫ్తార్‌కు రెండు గంటల ముందే గవర్నర్ దగ్గరికి వెళ్లిన ముఖ్యమంత్రులు ఇద్దరు విభజన అంశాలపైనే ఫోకస్‌ చేసినట్టు […]

ఇవాళ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది. అన్ని జిల్లాల్లోనూ ఈ వేడుకను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు.. పబ్లిక్ గార్డెన్ లో సీఎం కేసీఆర్ జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు.. జిల్లాల్లో జరిగే ఉత్సవాలకు మంత్రులు హాజరవుతారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోడ్ ఉన్నందున కొత్త పథకాల ప్రకటన ఉండకపోవచ్చు.. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు […]

లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేందుకు పట్టుబడుతున్న రాహుల్‌ గాంధీ ఎట్టకేలకు మౌనాన్ని వీడారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో ఎప్పటిలాగే తనదైన శైలిలో బీజేపీపై, నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీపై ప్రతిరోజూ పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వవైభవాన్ని సాధించాల్సిన అవసరముందని, దానిని మనం సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు లోక్‌సభలో […]

కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్‌ షా.. దేశ భద్రతకే పెద్ద పీట వేస్తామని చెప్పారు. మోదీ ప్రభుత్వానికి దేశ భద్రత, ప్రజా సంక్షేమమే కీలక ప్రాథమ్యాలని తెలిపారు. వీటిని అమలు చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్తూ ట్వీట్‌ చేశారు. హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమిత్‌ షా.. కార్యచరణలోకి దిగిపోయారు. […]

వరల్డ్‌ కప్‌ను ఆసీస్‌ ఘనంగా ప్రారంభించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. డేవిడ్ ‌వార్నర్‌ 89, ఆరోన్‌ఫించ్‌ 66 పరుగులతో చెలరేగారు. దీంతో అఫ్గాన్‌ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 34.5 ఓవర్లలోనే ఛేదించింది. ఫించ్‌, వార్నర్‌లు తొలి వికెట్‌కు 96 పరుగులతో శుభారంభాన్ని అందించారు. మొదట ఫించ్‌ ఔటవ్వగా ఉస్మాన్‌ ఖవాజా15, స్టీవ్‌స్మిత్‌ 18తో కలిసి వార్నర్‌ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. […]

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 3 శాతం డీఏ పెరగనుంది. పెరిగిన డీఏ 2018 జులై 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో జారీ చేసింది. మరోవైపు 2019-20 సంవత్సరానికి రైతుబంధు పథకం కొనసాగింపు కోసం మార్గదర్శకాలు […]

నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ-2019 డ్రాఫ్ట్ పై నిప్పు రాజుకుంది. ట‌్రై లాంగ్వేజ్ పాలసీపై తమిళనాడు భగ్గుమంటోంది. హిందీని బలవంతంగా తమపై రుద్దొద్దని మండిపడుతోంది. కొత్త పాలసీ ప్రకారం విద్యార్థులకు ౩ భాషలు భోదించాల్సి ఉంటుంది. మాతృభాషతోపాటు ఇంగ్లిష్, హిందీ కూడా ఉంటాయి. 8 వ తరగతి వరకు ఈ త్రిభాష పద్ధతిని అమలు చేయాలని నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ డ్రాఫ్ట్ సూచించింది. కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ ఈ కొత్త […]

కేసీఆర్‌ లొంగేది ఒక్క బీజేపీకి మాత్రమేనంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత MLC జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. TRT క్వాలిఫైడ్‌ అభ్యర్థులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఇందిరాపార్కు దగ్గర ఆందోళనకు దిగిన అభ్యర్థులకు జీవన్‌ రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మద్దతు పలికారు. ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ను కూడా సరిగా పూర్తి చేయలేని ప్రభుత్వం అంటూ లక్ష్మణ్‌ TRS సర్కారుపై మండిపడ్డారు. అటు జీవన్‌ రెడ్డి సైతం […]

భారత ప్రజా జీవనంలో నైరుతి రుతుపవనాలు ఓ భాగం. దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి. అవి సకాలంలో రాకపోయినా… సరిగా ప్రభావం చూపకపోయినా దేశం తీవ్ర ఇబ్బందుల పాలవుతుంది. ద్రవ్యోల్బణం, మార్కెట్లు, జాతీయ వృద్ధిరేటు, ఇలా అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది వర్షం.. మన జాతీయ బడ్జెట్‌ను వర్షాధారపు జూదంగా ఆర్థికవేత్తలు అభివర్ణిస్తుంటారు. అందుకే రుతుపవనాలకు అంత ప్రాధాన్యం.. సీజన్‌లో ఒక దిశలో వీచే గాలి తిరుగుముఖం పట్టడం లేదా […]

GSP-జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్స్‌ అంటే సాధారణ ప్రాధాన్య వ్యవస్థ. ఈ హోదా ఉన్న దేశాల్లో భారత్‌, థాయిలాండ్‌, కంబోడియా, టర్కీ, ఇండోనేషియా ఉన్నాయి. ఈ దేశాలు అమెరికాకు ఎలాంటి సుంకం లేకుండా కొన్ని వస్తువులను ఎగుమతి చేయొచ్చు. అయితే, ఇందుకు అమెరికా కాంగ్రెస్ విధివిధానాలను అనుసరించాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి భంగం కలగకుండా చూసుకోవడంతో పాటు ఆ దేశ మార్కెట్లలో అమెరికాకు సులభ ప్రవేశానికి వీలు కల్పించాలి. కానీ భారత్ […]