తాజా వార్తలు

తాజా వార్తలు

ఆ 8 మంది రాజీనామాలు సరైన ఫార్మాట్‌లో లేవు: కర్ణాటక స్పీకర్‌

కర్ణాటకలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం నెలకోన్న సంక్షోభం క్లైమాక్స్‌ దశకు చేరినట్టు కనబడుతుంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఈ సాయంత్రం ప్రత్యేక విమానంలో ముంబయి నుంచి బెంగళూరు చేరుకున్నారు. క‌ర్నాట‌క రెబ‌ల్ ఎమ్మెల్యేలు త‌మ రాజీనామాల‌ను అసెంబ్లీ స్పీక‌ర్‌కు స‌మ‌ర్పించుకోవాల‌ని సుప్రీంకోర్టు నేడు స్ప‌ష్టం చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ను కలిసేందుకు అసమ్మతి కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు […]

జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. నీరు నిలిచే చోట మిషన్ ‘ఇంజెక్షన్ బోర్ వెల్ ‘

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ముందుగానే ముంపు చర్యలపై జీహెచ్‌ఎంసీ దృష్టి పెట్టింది. భారీ వ‌ర్షాలు పడే స‌మ‌యంలో ముంపుకు గుర‌య్యే 160 లొకేష‌న్లలో ముంపు స‌మ‌స్య తీవ్రత‌ను త‌గ్గించేందుకు చ‌ర్యలు చేప‌ట్టింది. జె.ఎన్‌.టి.యుకి చెందిన నిపుణులైన ప్రొఫెస‌ర్లను జీహెచ్ఎంసీకి ప‌లు సిఫార్సుల‌తో కూడిన నివేదిక‌ల‌ను అంద‌జేశారు. వాటి అమ‌లు దిశ‌గా ఇంజ‌నీరింగ్ విభాగం ప్రస్తుతం ప‌నులు చేప‌ట్టింది. శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్‌లోని కాక‌తీయ హిల్స్‌ ర‌హ‌దారి […]

టీటీడీ జేఈవోగా ధర్మారెడ్డినే.. జగన్ నియమించడానికి కారణం ఏంటంటే..

టీటీడీ ప్రత్యేక అధికారిగా ధర్మారెడ్డి నియమితులయ్యారు. రేపు ఉదయం ఏడున్నర గంటలకు ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కాలినడకన కొండపైకి వెళ్లి టీటీడీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. కేంద్ర సర్వీసుల నుంచి డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ధర్మారెడ్డి… గతంలో వైఎస్సార్‌ హయాంలోను కొండపై పనిచేశారు. సామాన్యులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించడంలో ఆయన తెచ్చిన మార్పులు, సంస్కరణలు నేటికీ అమలవుతున్నాయి. టీటీడీ బోర్డులో ప్రక్షాళన కోసం […]

జగన్‌పై లోకేశ్ ఫైర్!

కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే చంద్రబాబు స్పందించలేదంటూ సీఎం జగన్‌ చేసిన విమర్శలపై… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మండిపడ్డారు. జగన్‌ మాటలకు కౌంటర్‌ ఇస్తూ… టీడీపీ కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు పత్రికల్లో వచ్చిన వార్తను ట్వీట్‌ చేశారు. కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా..?అని జగన్‌గారు ఎంతో సంస్కారవంతమైన భాషలో అసెంబ్లీలో అడిగారు. జూన్‌ 21 న సాక్షి పత్రికలోనే వచ్చిందని.. […]

క్లైమాక్స్‌‌కు చేరిన కర్ణాటక సంక్షోభం

కర్ణాటక సంక్షోభం క్లైమాక్స్‌కు చేరింది. రెబల్ ఎమ్మెల్యేలు బెంగళూరుకు చేరుకున్నారు. రోషన్ బేగ్, మునిరత్నం సహా 16 మంది అసంతృప్త శాసనసభ్యులు, కాసేపటి క్రితం అసెంబ్లీకి వచ్చారు. ఇందులో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాగా, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు. ఇక, స్పీకర్ సురేష్‌ కుమార్‌ కూడా అసెంబ్లీకి వచ్చారు. కాసేపట్లో స్పీక ర్‌తో రెబల్ ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. రాజీనామాలను ఆమోదించాలని […]

ఆ విషయంలో ధోనీని సమర్ధించిన కోహ్లీ

వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌లో ఓటమి చాలా బాధ కలిగించిందని.. అయితే అంత మాత్రాన కుంగిపోవాల్సిన అవసరం ఏమీ లేదన్నాడు.. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. టోర్నీ మొత్తం తమ జట్టు అద్భుతంగా ఆడిందని… కేవలం ఒక రోజు మాత్రం తమకు ప్రతికూల ఫలితం వచ్చిందన్నారు. ధోనీపై వస్తున్న విమర్శలను కోహ్లీ మరోసారి తోసిపుచ్చాడు. ధోనీ అద్భుతమైన ఆటగాడని.. నిన్నటి పరిస్థితుల్లో జడేడాకు అండగా […]

ఒక్కొక్కటిగా బయటపడుతున్న లావణ్య లంచాల భాగోతం.. తాజాగా..

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన వ్యవహారంలో రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తహసీల్దార్‌ లావణ్య ఏ స్థాయిలో లంచాలు తీసుకున్నారో ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. ఆన్‌లైన్‌లో పేరు నమోదుకు రైతు నుంచి లంచం తీసుకుంటూ దొరికిన వీఆర్వో అనంతయ్యను విచారించడంతో ఆమె గుట్టు బయటపడింది. ఇప్పుడు తాజాగా మరోరైతు వ్యధ వీడియో బయటకొచ్చింది. గతంలో తన భూమిని తన పేరున చేయమని ఓ రైతు […]

20 ఏళ్లకే కోట్ల రూపాయల వ్యాపారం.. హైద్రాబాద్ కుర్రాడి సక్సెస్ స్టోరీ..

నీ వయసేంటి.. నువు చదువుతున్న పుస్తకాలేంటి.. అయినా ఏడో క్లాస్‌కి ఏమర్ధమవుతుందని ఆ స్టాక్ మార్కెట్ పుస్తకాలు చదువుతున్నావని అమ్మానాన్న ఎప్పుడూ అన్లేదు. అందుకే స్టాక్ మర్కెట్ గురించి బెంజమిన్ గ్రాహం రాసిన ఆర్టికల్ అప్పుడే చదివి ఒక అవగాహనకు వచ్చేశాడు. అసలు మార్కెట్‌లో వస్తు రూపంలో లేని దానిపై పెట్టుబడి పెట్టడం ఏమిటి.. వాటిద్వారా డబ్బులు సంపాదించడం ఏమిటి.. అంతా వింతగా […]

రాకెట్ లాంఛింగ్ శ్రీహరి కోట నుంచే చేయడానికి కారణమేమిటంటే..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు గుండెకాయలా సేవలందిస్తోంది నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట. సముద్ర తీర ప్రాంతంలో శ్రీహరి కోట రాకెట్ ప్రయోగాలకు అనుకూలంగా ఉంది. అయితే దేశంలో చాలా రాష్రాలకు తీర ప్రాంతాలు ఉన్న ఇక్కడి నుంచే ప్రయోగాలు ఎందుకు చెస్తున్నారు. అసలు ఈ ప్రాంత ప్రత్యేకత ఎంటో ఓ సారి చూద్దాం..దేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. గుజరాత్ అధికంగా […]

విజయసాయిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతికి లేఖ రాసిన టీడీపీ

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని రాష్ట్రపతికి లేఖ రాసింది టీడీపీ. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ లాభదాయక పదవిలో ఆయన కొనసాగరంటూ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి కూడా ఫిర్యాదు కాపీని పంపించింది. కాగా, విజయసాయిరెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక ప్రజాప్రతినిధి లాభదాయక పదవిలో కొనసాగితే ఆ సభ్యుడిపై అనర్హత వేటు […]