తాజా వార్తలు

తాజా వార్తలు

నూతన కేంద్ర క్యాబినెట్, సహాయ మంత్రులు వీరే..

కేంద్ర కేబినెట్‌ మంత్రులు : రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, సదానంద గౌడ, శ్రీమతి నిర్మలా సీతారామన్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, నరేంద్రసింద్‌ తోమర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, శ్రీమతి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌, థావర్‌చంద్‌ గెహ్లాట్‌, సుబ్రమణ్యం జయశంకర్‌, రమేష్‌ పోఖ్రియాల్‌, అర్జున్‌ ముండా, శ్రీమతి స్మృతి ఇరానీ, డాక్టర్‌ హర్షవర్థన్‌, ప్రకాశ్‌ జవదేకర్‌, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, ప్రహ్లాద్‌ […]

కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్‌ రెడ్డి

తొలిసారిగా కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కిషన్‌ రెడ్డి. రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్ కిషన్‌ రెడ్డితో ప్రమాణం చేయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కిషన్‌ రెడ్డికి తన కేబినెట్‌ లో చోటు కల్పించారు మోదీ. సికింద్రాబాద్ లోక్‌ సభ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ సీనియర్‌ నేతగా పార్టీకి దశాబ్దాలుగా సేవలు అందించిన కిషన్‌ రెడ్డికి ఎట్టకేలకు కేంద్రమంత్రి పదవి […]

ఓటమికి పార్టీ మొత్తాన్ని బాధ్యుల్ని చెయ్యాలని రాహుల్‌గాంధీ నిర్ణయించుకున్నారా?

లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాభవానికి తానొక్కడినే కాక, పార్టీ మొత్తాన్ని బాధ్యుల్ని చెయ్యాలని కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ నిర్ణయించుకున్నారా? పాత తరానికి చెక్‌పెట్టే ఉద్దేశంతో కదులుతున్నారా? మూడు రోజులుగా సాగుతున్న పరిణామాలు ఇవే విషయాలను స్పష్టం చేస్తున్నాయి. తన సోదరి ప్రియాంక గాంధీతో పాటు కొందరు ముఖ్యులను మాత్రమే కలిశారు. ఆయన తన అభిప్రాయాలను, నిర్ణయాలను స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సీనియర్లను సాగనంపి […]

అట్టహాసంగా ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకం

ప్రధాని నరేంద్ర మోదీ పట్టాభిషేకం హట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతిభవన్ ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మోదీతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. మే… నరేంద్ర దామోదర్ దాస్ మోదీ…అంటూ దైవసాక్షిగా ప్రమాణం చేశారు మోదీ. ప్రమాణస్వీకార మహోత్సవానికి మోడీ చాలా నిడారంబరంగా వచ్చారు. పలువురు రాజకీయ, పారిశ్రామిక, సినీ వర్గాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

విజయమ్మ ఆనందానికి అవధుల్లేవు..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా జగన్‌ పట్టాభిషేకం పూర్తయింది. మధ్యాహ్నం 12 గంటల 23 నిమషాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వేడుకలో… జగన్‌ ఒక్కరే ప్రమాణ స్వీకారం చేశారు. జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వైఎస్ కుటుంబసభ్యులు, తెలంగాణ సీఎం కేసీఆర్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, పుదుచ్చేరి మంత్రి మాల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్‌ […]

అసలు ఈమెకు ఎమోషన్స్ లేవా? అంటూ..

సోషల్ మీడియాలో సెలబ్రెటీస్ పిల్లలపై ట్రోలింగ్ పెరిగిపోయాయి. తాజాగా అజయ్ దేవగన్, కాజోల్ ల గారాలపట్టి నైసా దేవగన్ ట్రోలింగ్ బారిన పడింది. గత కొన్నిరోజులుగా నైసాపై నెటిజన్స్ తీవ్ర విమర్శలు చే్స్తున్నారు. ఎంతలంటే కూతురిపై వస్తున్న ట్రోలింగ్స్‌ను తట్టుకోలేక అజయ్ దేవగన్ ఏకంగా ప్రెస్ మీట్‌ను పెట్టారు. తనకు ఇంకా 14 ఏళ్ళ అంటూ..ఇక విమర్శలను అపలంటూ నెటిజన్స్‌ను కోరారు. తాజాగా […]

ఎన్సీపీ.. కాంగ్రెస్ లో విలీనం అవుతుందా?

ఏన్సీపీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందా? అన్ని కలిసొస్తే సెప్టెంబర్ లో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకన్న ముందే ఈ ప్రక్రియ పూర్తికానుందా? ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో రాహుల్ గాంధీ సమావేశం కావడంతో ఈ వార్తలకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీలో సమావేశమైన ఈ ఇద్దరు నేతలు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.. ముఖ్యంగా ఎన్సీపీని కాంగ్రెస్ లో […]

హృదయాలను ఏలే ‘దొరసాని’

రియలిస్టిక్ అండ్ ఇంటెన్సిటీ ఉన్న కథలకు ఇప్పుడు ప్రేక్షకులు అదరణ లభిస్తుంది. అలాంటి ఓ రియలిస్టిక్ స్టోరీతో వస్తోన్న చిత్రమే ‘దొరసాని’. తెలంగాణలోని ఓ ప్రాంతంలో 80 దశకం లో జరిగిన కథగా వస్తోంది. లేటెస్ట్ గా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్ లో కథ లోంచి పరిచయం అయిన రాజు, దొరసాని […]

లంచం అడిగితే నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికే ఫోన్‌ చేయండి : సీఎం జగన్

విజయవాడలో అంగరంగ వేడుకగా సాగింది జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవం. అదే వేదికపై సర్వ మత ప్రార్థనలు జరిగాయి. అనంతరం ప్రసంగించిన కొత్త ముఖ్యమంత్రి తన ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. పెన్షన్లు పెంపు ఫైల్‌పై తొలి సంతకం చేశారాయన. రెండు పేజీల ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నెరవేరుస్తానని మరోసారి జగన్ స్పష్టంచేశారు. నవరత్నాలను ప్రతి ఇంటికి అందించేందుకు గ్రామాల్లో వాలంటీర్లను నియమిస్తానని జగన్ […]

జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి

ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం అన్నివిధాల సహకరిస్తుందని బీజేపీ ఏపీ లీడర్ విష్ణువర్దన్ రెడ్డి చెప్పారు. జగన్ సర్కారుకు తోడ్పాటును అందిస్తామన్నారు. ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జగన్ కు ఏపీ బీజేపీ తరపున విష్ణువర్దన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.