అనుకున్నదే జరిగింది. బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ ను కేవలం మూడు రోజుల్లోనే ముగించేసింది కోహ్లీసేన. భారత బౌలర్లు విజృంభణతో తొలి ఇన్నింగ్స్ లో 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 130 పరుగులకే కుప్పకూలిన.. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. బంగ్లా ఆటగాళ్లలో ముష్పీకర్ రహీమ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయితే 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ […]

ఇండోర్‌ టెస్టులో టీమిండియా హవా కొనసాగుతోంది. రెండో రోజు ఆటలో మన బ్యాట్స్‌మెన్ రెచ్చిపోయారు. బంగ్లా బౌలర్లను ఆటాడుకున్నారు..ఆటముగిసే సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. 330 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 28 ఫోర్లు, 8 సిక్సర్లతో 243 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 343 పరుగుల […]

ఇండోర్ టెస్టులో టీమిండియా ఇరగదీసింది. తొలిరోజే మ్యాచ్‌పై పట్టు బిగించింది. విజృంభించిన పేసర్లు..తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాను 150 పరుగులకే ఆలౌట్‌ చేశారు.. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 64 పరుగుల వెనుకంజలో ఉంది. పుజారా 43, మయాంక్ అగర్వాల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్ […]

బిసిసిఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ సిక్సర్ కొట్టడానికి రెడీ అవుతున్నారు.. ఇప్పటికే ఇన్నింగ్స్ మొదలుపెట్టిన దాదా.. బోర్డు పిచ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి అడుగులు వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. 9నెలల గండం దాటుకుని.. ఆరేళ్లపాటు తిరుగులేని నాయకుడిగా అవతరించే ఛాన్సుంది. బిసిసిఐ అధ్యక్షునిగా కొత్తగా ఎన్నికైన సౌరవ్‌ గంగూలీ పదవీ కాలం తొమ్మిది నెలల్లో ముగుస్తుంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం మాజీ కెప్టెన్ 9నెలల తర్వాత […]

చాహర్‌ మ్యాజిక్‌తో నాగ్‌పూర్‌ టీ-20లో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ సాధించింది.. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ బోల్తా పడింది.. ఫలితంగా 2-1 తేడాతో టీ-20 సిరీస్‌ను రోహిత్‌ సేన కైవసం చేసుకుంది.. తొలి మ్యాచ్‌లో పరాభవాన్ని చవిచూసినా.. ఆ తర్వాత రెండు మ్యాచ్‌ల్లో ఆల్‌ రౌండ్‌షోతో అదరగొట్టింది టీమిండియా. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్‌ తగిలింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న […]

బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకుంది భారత్. రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్ తో రాజ్ కోట్ టీ-ట్వంటీలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. 154 టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్..26 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తిచేసింది. వందో టీ-ట్వంటీ ఆడిన రోహిత్ శర్మ […]

శభాష్ చీకూ.. అప్పుడే నీకు 31 ఏళ్లు వచ్చేశాయా.. ఓసారి వెనక్కి తిరిగి చూస్కో.. కొన్ని తీపి.. కొన్ని చేదు జ్ఞాపకాలు కలబోసి కవ్విస్తున్నాయి కదూ.. వాటన్నింటినీ ఓసారి నెమరువేసుకుందాం.. తెలియని గమ్యం కంటే తెలిసిన ప్రయాణం ఎంతో బావుంటుంది కదూ.. భవిష్యత్ గురించి ఎన్నో కలలున్నాయి నీకు.. వాటి గురించి నన్ను అడక్కు. ఎందుకంటే ముందు ముందు ఏం జరగనుందో తెలియదు. అనుకోనిది జరగాలి.. అది ఓ తియ్యని […]

BCCI అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ బాధ్యతలు తీసుకున్న వెంటనే కార్యాచరణ మొదలుపెట్టారు. మార్పును చూస్తారంటూ ప్రకటించిన దాదా అప్పుడే టీంఇండియా కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో సమావేశమయ్యారు. భారత క్రికెట్ భవిష్యత్తు కార్యచరణ గురించి వారితో చర్చించారు. అటు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిరేపుతున్న ధోని రిటైర్మెంట్ గురించి కూడా వీరు మాట్లాడినట్టు ప్రచారం జరుగుతోంది. బిసిసిఐ కార్యదర్శి జై షా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సెలక్షన్ కమిటీ […]

భారత క్రికెట్‌ ఇక దాదా చేతుల్లో వచ్చింది. బీసీసీఐ 39వ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు స్వీకరించాడు. ఇప్పటికే కొత్త కార్యవర్గం కొలువుదీరింది. కీలక సమయంలో అత్యంత సంపన్నమైన బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా సౌరవ్‌ గంగూలీ బాధ్యతలు చేపట్టాడు. 47 ఏళ్ల గంగూలీ తొమ్మిది నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు. నిన్న జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో 39వ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. దీంతో సుప్రీం కోర్టు నియమించిన కమిటీ […]

నాల్గో టెస్టులో టీమిండియా భారీ ఇన్నింగ్స్ విజయాన్ని నమోదు చేసింది. 202 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రీకాను చిత్తు చేసింది. నిజానికి భారత పేసర్లు షమీ, ఉమేశ్‌లు ఆఖరి టెస్టును మూడో రోజే తేల్చేశారు. ఇద్దరు సీమర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదేసి వికెట్లు పడేశారు. తొలి సెషన్‌లో పేసర్లు ఉమేశ్‌ (3/40), షమీ (2/22)లకు స్పిన్నర్లు జడేజా (2/19), నదీమ్‌ (2/22) తోడయ్యారు. దీంతో సఫారీ తొలి ఇన్నింగ్స్‌ […]