మాంచెస్టర్ మ్యాచ్‌లో టీమిండియా ఆధిపత్యం కనబరుస్తోంది. బ్యాటింగ్‌లో భారీస్కోర్ చేసిన కోహ్లీసేన… బౌలింగ్‌లోనూ రాణిస్తోంది. ఛేజింగ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తోంది. 337 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పాక్ 13 పరుగులకే వికెట్ కోల్పోయింది. విజయ్‌శంకర్ తాను వేసిన తొలి బంతికే వికెట్ పడగొట్టాడు. అయితే భువనేశ్వర్‌కు కండరాలు పట్టేయడంతో విజయ్ శంకర్ ఆ ఓవర్‌ను పూర్తి చేశాడు. తర్వాత కూడా పాక్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు శ్రమిస్తున్నారు. […]

మాంచెస్టర్ లో వర్షం ఆగిపోయింది. దీంతో ఏ క్షణమైనా మ్యాచ్ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఇన్నింగ్స్ 47వ ఓవర్‌లో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. మ్యాచ్ ఆగిపోయే సమయానికి భారత్ 4 వికెట్లకు 305 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రాహుల్, రోహిత్‌శర్మ మంచి ఆరంభాన్నిచ్చారు. రాహుల్ హాఫ్ సెంచరీ చేసి ఔటవగా… రోహిత్‌శర్మ సెంచరీతో రెచ్చిపోయాడు. 85 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న […]

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా కాన్ఫిడెంట్‌గా ఆడుతోంది. ఓపెనర్లు రాహుల్, రోహిత్‌శర్మ పాక్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. ఫామ్‌లో ఉన్న రోహిత్‌శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌పై వ్యూహం తరహాలోనే మొదటి పవర్ ప్లేలో సింగిల్స్‌కే ప్రాధాన్యమిచ్చిన భారత్ భారీస్కోరుపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేన ఒక మార్పుతో బరిలోకి దిగింది. ధావన్ స్థానంలో విజయ్ శంకర్‌కు అవకాశమిచ్చింది. అటు వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకున్న పాక్ […]

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ను తలపిస్తున్న హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.. పిచ్‌ ఆరంభంలో బౌలర్లకు సహకరిస్తుందనే నమ్మకంతో ఫీల్డింగ్‌ ఎంచుకున్నట్టు పాక్‌ కెప్టెన్‌ సర్ఫారజ్‌ చెప్పాడు. భారత్‌ విషయానికి వస్తే జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. ఓపెనర్‌ ధావన్‌ గాయంతో మూడు వారాల పాటు టోర్నీకి దూరమయ్యాడు.. అతడి స్థానంలో ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను జట్టులోకి తీసుకున్నాడు కెప్టెన్‌ కోహ్లీ. టాస్‌ ఓడి […]

వెస్టిండీస్‌ హార్డ్‌ హిట్టర్‌ క్రిస్‌గేల్‌ కూడా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నాడు. భారత్‌, పాక్‌ నేషనల్ ఫ్లాగ్‌ కలర్స్‌తో ఉన్న షర్ట్‌ వేసుకున్న గేల్‌…ఇండియా-పాక్‌ మ్యాచ్‌పై తన ఆసక్తిని కనబరిచాడు.సెప్టెంబర్‌ 20న తన బర్త్‌డేకు కూడా ఇదే డ్రెస్‌ ధరిస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన గేల్‌ సెల్ఫీ వీడియో వైరల్‌ అవుతోంది.

ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ అత్యంత విమర్శల పాలవుతోంది. పాయంట్ల పట్టికలో వర్షంతో రద్దయిన మ్యాచ్ లు ఎక్కువగా ఉన్నాయి. వర్షాకాలం ఎవరైనా వరల్డ్ కప్ నిర్వహిస్తారా అని అభిమానులు ప్రశ్నింస్తున్నారు. నాలుగేళ్లకోసారి వచ్చే ప్రపంచ కప్ మ్యాచ్ లను కనులార తిలకిద్దామని ఎంతో ఆశ ఉంటుంది. కానీ వరుణుడు మాత్రం అభిమానుల ఆశలకు గండి కొడుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం […]

వరల్డ్‌కప్‌ నేపథ్యంలో ఇండియా-పాకిస్తాన్‌ మధ్య వీడియో వార్‌ కొనసాగుతోంది. అభినందన్‌ను అవమానిస్తూ దాయాది ఒక్క యాడ్‌ వదిలితే…భారత్‌ వరుస కౌంటర్ వీడియోలతో పాక్‌కు చుక్కలు చూపిస్తోంది. సోషల్‌ మీడియాలో అభినందన్‌ అవమానించిన పాక్‌పై… అదే సోషల్‌ మీడియాలో సెటైరిక్‌ వీడియోల ద్వారా కసి తీర్చుకుంటున్నారు ఇండియన్‌ నెటిజన్లు. నిన్న బాలీవుడ్‌ నటి పూనం పాండే తనదైన శైలిలో పాకిస్తాన్‌కు కౌంటర్‌ ఇస్తే.. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ విడుదల చేసిన […]

వరల్డ్‌కప్‌లో క్రికెట్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చే పోరు మరికొద్ది గంటల్లో మొదలుకాబోతోంది. యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికరంగా ఎదురుచూస్తోన్న ఇండో-పాక్ పోరులో బలాబలాల పరంగా టీమిండియానే ఫేవరెట్‌. అయితే ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్‌ను తేలిగ్గా తీసుకోలేని పరిస్థితి. వెరసి మాంచెస్టర్ వేదికగా ఉత్కంఠభరిత మ్యాచ్‌ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌ కాని ఫైనల్‌కు సిధ్ధమైంది. అదేంటి టోర్నీ ఇంకా లీగ్ స్టేజ్‌లోనే ఉండగా… […]

ప్రపంచకప్‌లో అయినా, మరో సిరీస్‌ అయినా.. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే భావోద్వేగాలు తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఈ మ్యాచ్‌లో గెలుపును ఇరు జట్లూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తాయి. ఈ క్రమంలో ఆటగాళ్లు అదుపు తప్పి గొడవలకు దిగడం ఎన్నోసార్లు చూశాం. 1992 ప్రపంచకప్‌లో తాను బ్యాటింగ్‌ చేస్తున్నపుడు భారత వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరె ఎక్కువగా అరుస్తుండటం, పదే పదే ఔట్‌ కోసం అప్పీల్‌ చేస్తుండటం పాకిస్థాన్‌ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌ […]

భారత్‌,పాక్ క్రికెట్ పోరుకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు నిర్వాహకులు ఎవ్వరి వ్యూహాల్లో వారు ఉంటారు. అయితే రేపు జరగబోయే మ్యాచ్ వర్షంతో రద్దయితే మాత్రం నష్టం కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు వర్షార్పణం కావడంతో దాదాపు 200 కోట్ల మేర నష్టం వచ్చినట్టు అంచనా.. ఇక భారత్ ,పాక్ పోరుకు సైతం వరుణుడు ముప్పు ఉండడంతో అందరిలోనూ […]