వన్డే వరల్డ్ వార్ మొదలై వారం గడిచిపోయింది. 10కిపైగా మ్యాచ్ లు పూర్తయ్యాయి. కానీ ఎలాంటి జోష్ లేదు. అసలు ఇండియన్ ఫ్యాన్స్ కైతే వరల్డ్ కప్ జరుగుతుందన్న ఫీలింగే లేదు. కారణం ఇప్పటి వరకు మన కోహ్లీసేన బరిలోకి దిగకపోవడమే. మన మ్యాచ్ ఎప్పుడా అంటూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన ఫ్యాన్స్ కు ఇవాళ పండుగే. క్రికెట్ సమరంలో అసలు యుద్ధానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. […]

ప్రపంచకప్‌ ఫేవరెట్‌ జట్లలో ఒకటిగా ఉన్న టీమిండియా తొలి పోరుకు సిద్ధమవుతోంది. విరాట్‌ కోహ్లీ నేతృత్వంలో మొదటిసారి ఈ మెగా టోర్నీలో ఆడుతోన్న భారత్‌ ఇవాళ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. 1983, 2011లో ప్రపంచక్‌పలు సాధించిన భారత జట్టుకు మరోసారి ట్రోఫీ అందించాలన్న కసితో కెప్టెన్‌ విరాట్‌ ఉన్నాడు. అయితే జట్టులో మ్యాచ్‌ విన్నర్లకు కొదవలేకపోయినా అప్పట్లో ఎంఎస్‌ ధోనీ చాంపియన్‌ జట్టులో ఉన్న ఆటగాళ్ల స్థాయి వేరు. సచిన్‌, సెహ్వాగ్‌, […]

టీమిండియా ప్రపంచకప్‌ వేట రేపటి నుండి ప్రారంభం కాబోతోంది. సౌతాంప్టన్ వేదికగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనుంది. ఐపీఎల్ కారణంగా భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఆలస్యంగా రూపొందించడంతో ఆటగాళ్ళకు కావాల్సినంత విశ్రాంతి దొరికింది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిన సఫారీలకు కోహ్లీసేనతో మ్యాచ్‌ సవాల్‌గా చెప్పాలి. ప్రపంచకప్‌ మొదలై మ్యాచ్‌లు జరుగుతున్నా… ఇప్పటి వరకూ సరైన జోష్ కనిపించడం లేదు. దీనికి కారణం టీమిండియా ఇంకా బరిలోకి దిగకపోవడమే.. ఇప్పుడు […]

వరల్డ్‌ కప్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుకు పాకిస్తాన్‌ షాక్‌ ఇచ్చింది. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌‌లో 14 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ విజయం సాధించింది. పాక్‌ నిర్దేశించిన 349 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ గెలుపు అంచుకు చేరుకుని..చివర్లో బోల్తా పడింది. నిర్ణీత 50 ఓవర్లలో 334 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లండ్‌.. ఓటమిని మూటగట్టుకుంది. జో రూట్, బట్లర్ సెంచరీలు వృధా […]

వన్డే ప్రపంచకప్‌ అంటే ఒకప్పుడు మామూలు హంగామా కాదు… టోర్నీ ఆరంభానికి ముందే ఆయా దేశాల్లో క్రికెట్ సందడి ఒక రేంజ్‌లో కనిపించేది. ఆతిథ్య దేశమైతే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు… టోర్నీ జరిగినన్ని రోజులూ కార్నివాల్ వాతావరణమే. అలాంటిది ప్రస్తుతం జరుగుతోన్న వరల్డ్‌కప్‌లో సందడి అంతంత మాత్రంగానే ఉంది. టోర్నీ మొదలై నాలుగు రోజులు గడిచినా… అభిమానుల్లో జోష్ మాత్రం మిస్సైనట్టు కనిపిస్తోంది. మ్యాచ్‌లు వన్‌సైడ్‌గా జరుగుతుండడం ఒక కారణమైతే… క్రికెట్‌ను […]

క్రికెట్‌ ప్రపంచకప్‌ లో సంచలనం నమోదైంది. బంగ్లాదేశ్‌ బెబ్బులిలా రెచ్చిపోయింది. ఏకంగా వరల్డ్‌ కప్ లో అత్యధిక స్కోర్‌ సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన బంగ్లా.. ప్రత్యర్థి అత్యుత్తమ పేస్‌ బలగాన్ని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ రికార్డుల మోత మోగించింది. సమిష్టిగా రాణించి దక్షి ణాఫ్రికాను చిత్తు చేసింది. వెటరన్‌ బ్యాట్స్‌మెన్‌ షకీబల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో కదం తొక్కగా… తమ వన్డే చరిత్రలోనే బంగ్లా […]

వరల్డ్‌ కప్‌ వార్‌లు వన్‌సైడ్‌గా ముగుస్తున్నాయి.. శనివారం సోఫియా గార్డెన్స్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో.. న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. మొదట టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ పూర్తిగా చేతులు ఎత్తేశారు. పిచ్ బౌలింగ్‌కి పూర్తిస్థాయిలో అనుకూలించడంతో కివీస్ పేసర్లు చెలరేగిపోయారు. లంక బ్యాటింగ్‌లో కరుణరత్నే 52, కుషల్ పెరీరా 29, తిషారా పెరీరా 27 మినహా మిగితా వారందరూ సింగిల్ డిజిట్ స్కోర్‌కే […]

వరల్డ్‌ కప్‌ను ఆసీస్‌ ఘనంగా ప్రారంభించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. డేవిడ్ ‌వార్నర్‌ 89, ఆరోన్‌ఫించ్‌ 66 పరుగులతో చెలరేగారు. దీంతో అఫ్గాన్‌ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 34.5 ఓవర్లలోనే ఛేదించింది. ఫించ్‌, వార్నర్‌లు తొలి వికెట్‌కు 96 పరుగులతో శుభారంభాన్ని అందించారు. మొదట ఫించ్‌ ఔటవ్వగా ఉస్మాన్‌ ఖవాజా15, స్టీవ్‌స్మిత్‌ 18తో కలిసి వార్నర్‌ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. […]

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను వెస్టిండీస్ చిత్తు చేసింది. పాక్‌ నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్‌ 13.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి సునాయాసంగా ఛేదించింది. క్రిస్‌గేల్‌ 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగి హాఫ్ సెంచరీ సాధించాడు. వెన్నునొప్పి వేధిస్తున్నా లెక్కచేయకుండా భారీ సిక్సర్లు బాదేశాడు. అతడికి తోడుగా నికోలస్‌ పూరన్‌ రెచ్చిపోయాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 […]

ప్రపంచ కప్‌లో సచిన్ ఏంటి..అతను ఎప్పుడో రిటైర్ అయ్యారుగా మళ్ళీ మైదానంలోకి అడుగు పెడుతున్నాడా! అని అనుకుంటారా? అలా అనుకుంటే పొరపాటే ప్రపంచకప్ 2019 టోర్నీ కోసం భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కామెంటేటర్‌గా మారాడు. గురువారం ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి కామెంట్రీలో సచిన్ సందడి చేశాడు. అయితే పలు సార్లు బీసీసీఐ, […]