దక్షిణాఫ్రికాపై టీమిండియా దూకుడు కొనసాగుతోంది. తొలి టెస్టు విజయంతో సిరీస్‌ను ఘనంగా ప్రారంభించిన కోహ్లీసేన రెండో టెస్టులోనూ అదరగొడుతోంది. వైజాగ్‌లో రెండు సెంచరీలతో రెచ్చిపోయిన రోహిత్‌ శర్మ 14 పరుగులకే ఔటై నిరాశపర్చాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సూపర్‌ సెంచరీతో సత్తా చాటాడు. కెరీర్‌లో వరుసగా రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన ఘనత సొంతం చేసుకున్నాడు. 195 బంతుల్లో 108 పరుగుల చేసి మెరిశాడు. పుజారా 58, కెప్టెన్‌ […]

విశాఖ పట్టణంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత జట్టును పుణె పిచ్ భయపెడుతోంది. గురువారం నుంచి 14వ తేదీ వరకు గహుంజే స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రెండేళ్ల కిందట ఆస్ట్రేలియాతో ఇదే స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ టెస్ట్ మ్యాచ్లో మూడు రోజుల్లోనే టీమిండియాను సొంతగడ్డపై ఆస్ట్రేలియా […]

ప్రపంచ బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకం సాధించిన షట్లర్ పీవీ సింధూకు కేరళ సర్కారు పదిలక్షల నగదు బహుమతి ప్రదానం చేసింది. కేరళ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. సునీల్ కుమార్ పీవీ సింధూకు పదిలక్షల చెక్కును అందచేశారు. మైసూరు దసరా నవరాత్రి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పీవీ సింధూ.. ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ ఆహ్వానం మేరకు కేరళలో పర్యటించారు.

క్రికెట్‌ మ్యాచ్‌ మధ్యలో అంపైర్‌కు గుండెపోటు వచ్చింది.. దాంతో అతను మృతి చెందాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లో చోటుచేసుకుంది.కరాచీకి చెందిన 56 ఏళ్ల నసీమ్‌ షేక్‌ కరాచీలోని టీఎంసీ గ్రౌండ్‌లో జరుగుతున్న లోకల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ కు అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే కొన్ని ఓవర్ల తరువాత అతను తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. ఈ క్రమంలో అతనికి గుండెపోటు రావడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అక్కడున్న సిబ్బంది అతన్ని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి […]

విశాఖ టెస్టులో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన క్రికెటర్లకు ఆగ్రహం తెప్పించారు పోలీసులు. అధికారుల మధ్య అవగాహన లోపంతో భారత క్రికెటర్లు వర్షంలో తడవాల్సి వచ్చింది. భారత జట్టు ఉన్న బస్సును విశాఖ ఎయిర్‌పోర్టు మూడో ఫ్లాట్‌ఫాంలో నిలిపారు. అయితే అప్పటికే భారీ వర్షం పడుతుండడంతో వారంతా అక్కడి నుంచి తడుసుకుంటూ ఎయిర్‌పోర్టులోకి వెళ్లాలసి వచ్చింది. ఫస్ట్‌ ఫ్లాట్‌ ఫాంలో ఎందుకు బస్‌ పార్క్‌ చేయలేదని ఎయిర్‌ పోర్ట్‌ సీఐను […]

భారత దిగ్గజ స్పిన్ ద్వయంగా గుర్తింపు పొందిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా వ్యక్తిగత రికార్డులు సాధించి సత్తా చాటారు. తన 66వ టెస్టులో 350వ వికెట్ సాధించిన రవిచంద్రన్ అశ్విన్ ఆల్ టైం గ్రేట్ ముత్తయ్య మురళీధరన్‌కు ధీటుగా నిలిచాడు. సరిగ్గా మురళీధరన్ కూడా తన 66వ టెస్టులోనే 350వ వికెట్ సాధించి, అప్పట్లో అతి తక్కువ టెస్టుల్లో ఆ ఫీట్ సాధించిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. […]

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 203 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు191 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఆదివారం చివరి రోజు ఆటలో భారత బౌలర్లు విజృంభించడంతో సఫారీలు చేతులెత్తేశారు. పేసర్‌ మహ్మద్‌ షమీ స్పిన్నర్‌ రవీంద్ర తమ మ్యాజిక్‌ తో దక్షిణాఫ్రికాను మట్టికరిపించారు. చివరి ఆటగాళ్లు పీయడ్త్‌-ముత్తుసామిలు తీవ్రంగా ప్రతిఘటించడంతో భారత్‌ విజయం కొంత ఆలస్యమైంది. లేదంటే […]

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ డబుల్ మోత మోగించాడు. ఇప్పటికే మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీతోపాటు భారీ స్కోర్ సాధించిన రోహిత్ రెండో ఇన్నింగ్స్ లోను సెంచరీ సాధించి రికార్డు నెలకొల్పాడు. శనివారం నాల్గో రోజు ఆటలో మయాంక్‌ అగర్వాల్‌(7) నిరాశపరిచినప్పటికీ రోహిత్‌ మాత్రం నిలదొక్కుకున్నాడు. 133 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లలో శతకం పూర్తి చేసుకున్నాడు. ఎక్కడ కూడా తడబడకుండా సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి టీమిండియాకు భారీ […]

విశాఖ టెస్టులో సౌతాఫ్రికా పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 385 రన్స్ చేసింది.. ఇండియా కంటే ఇంకా 117 రన్స్ మాత్రమే వెనుకబడి ఉంది. 3 వికెట్ల నష్టానికి 39 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ అద్భుతంగా పోరాడారు. ఇండియన్ స్పినర్లను కాచుకొని క్రీజులో పాతుకుపోయారు…ఓపెనర్ ఎల్గర్ సెంచరీతో చెలరేగాడు.. అటు కెప్టెన్ డుప్లెసిస్‌ […]

విశాఖ టెస్టుపై టీమిండియా పట్టుబిగించింది. ఏడు వికెట్లకు 502 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఎదురీదుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది..భారత స్పిన్నర్లను ఎదుర్కునేందుకు సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ చాలా కష్టపడ్డారు. 14 రన్స్ వద్దే తొలి వికెట్ కోల్పోయింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో క్రీజులో […]