బెంగాల్‌ టైగర్‌.. ప్రిన్స్‌.. దాదా అని క్రికెట్‌ అభిమానులు ముద్దుగా పిలుచుకునే సౌరవ్‌ గంగూలీ మరో రికార్డు సృష్టించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్ష పగ్గాలు చేపట్టబోతున్న రెండో క్రికెటర్‌గా రికార్డులకెక్కబోతున్నాడు. అప్పట్లో విజయనగరం మహారాజు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు గంగూలీకే ఆ ఖ్యాతి దక్కనుంది. 1936లో ఇంగ్లండ్‌లో పర్యటించిన భారత జట్టుకు విజయనగరం మహారాజు సారథ్యం వహించారు. భారత్ తరపున కేవలం మూడు టెస్టులకే ప్రాతినిధ్యం […]

టీమ్ ఇండియా మాజీ కెప్టన్ సౌరబ్ గంగూలీ సరికొత్తపాత్రలో మెరవనున్నాడు. గతంలో టీంఇండియాను నడిపించిన గంగూలీ… ఇప్పుడు క్రికెట్ ఇండియానే నడిపించేందుకు సిద్దమవుతున్నారు. బిసిసిఐ అధ్యక్షుడిగా పగ్గాలు అందుకోవడం దాదాపు ఖాయమైంది. పలు నాటకీయ పరిణామాల మధ్య బ్రజేష్ పటేల్ పోటీ నుంచి తప్పుకోవడంలో గంగూలీకి లైన్ క్లియర్ అయింది. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న 47 ఏళ్ల గంగూలీ కొత్త బాధ్యతలు తీసుకుంటారు. 23న బిసిసిఐ […]

టీమిండియా మరో ఆల్ రౌండ్ షో అదరగొట్టేసింది. బ్యాట్స్ మెన్, బౌలర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన కనబరచిన వేళ రెండో టెస్టులో ఇన్నింగ్స్ 137 పరుగులతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. అంతేకాదు స్వదేశంలో వరుసగా 11వ సిరీస్ విజయంతో టీమిండియా వరల్డ్ రికార్డ్ సృష్టించింది. విశాఖపట్నం టెస్టు విక్టరీకి మరింత పదనుపెట్టినట్టు పుణే టెస్టులో మరింత […]

పుణేలో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘన విజయం సాధించింది. 137 పరుగుల భారీ స్కోర్ తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఆదివారం నాల్గో రోజు ఆటలో భాగంగా ఫాలోఆన్‌ ఆడుతున్న సఫారీలు 189 పరుగులకే కుప్పకూలారు. దీంతో దక్షిణాఫ్రికా చరిత్రలో ఫాలో ఆన్ ఆడిన ఆ జట్టు చిత్తుగా ఓడింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా టాపార్డర్‌ కకావికలమైంది. సఫారీల రెండో ఇన్నింగ్స్‌లో మార్కరమ్‌ పరుగులేమీ చేయకుండా […]

రెండో టెస్టులోనూ భారీ విజయాన్ని టార్గెట్‌ చేసింది టీమిండియా.. పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను కేవలం 275 పరుగులకే ఆలౌట్‌ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆరీగా 326 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి 601 పరుగులకే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. దక్షిణాఫ్రికా ఆలౌట్‌ అయిన వెంటనే.. వెలుతురు సరిగ్గా లేకపోవడంతో.. అంపైర్లు మ్యాచ్‌ని వాయిదా వేశారు. […]

పూణే టెస్ట్ లో విరాట్ కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించాడు. కెరీర్ బెస్ట్ స్ట్రైక్ తో మ్యాచ్ గమనాన్ని శాసించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత్ కెప్టెన్ బ్యాటింగ్ ధాటికి సర్ డాన్ బ్రాడ్ మన్, సచిన్ టెండూల్కర్ , సునీల్ గవాస్కర్, వెన్ సర్కార్, స్టీవ్ స్మిత్ లాంటి క్రికెట్ ప్రముఖుల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. మరికొన్ని రికార్డులు సమం అయ్యాయి. సింగిల్స్, డుబల్స్ తీస్తూనే అవకాశం దక్కినప్పుడల్లా స్టైలిష్ సర్జికల్ […]

పుణె టెస్టుపై పట్టుబిగించింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో 601 పరుగుల భారీ స్కోరు సాధించిన కోహ్లీసేన.. సౌతాఫ్రికాకు టాప్‌ఆర్డర్‌ను కూల్చేసింది. రెండో రోజు ఆటముగిసే సరికి సఫారీలు 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయారు. అంతకుముందు.. 5 వికెట్ల నష్టానికి 601 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. రవీంద్ర జడేజా 9 పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు. […]

కర్ణాటక కుర్రోడు, టీమిండియా ఆటగాడు మనీశ్‌ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సినీ నటి అశ్రిత షెట్టితో కలిసి ఏడడుగులు నడవబోతున్నాడు. ఈ ఏడాది డిసెంబర్‌ 2న మనీశ్‌ పాండే, నటి అశ్రిత వివాహ బంధంతో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుక కొద్దిమంది బంధువులు, సన్నిహితుల మధ్య జరగనున్నట్లు సమాచారం. ముంబైకి చెందిన అశ్రిత (26) 2012లో తుళు భాషలో వచ్చిన ‘తెళికెద బొల్లి’ ద్వారా […]

దక్షిణాఫ్రికాపై టీమిండియా దూకుడు కొనసాగుతోంది. తొలి టెస్టు విజయంతో సిరీస్‌ను ఘనంగా ప్రారంభించిన కోహ్లీసేన రెండో టెస్టులోనూ అదరగొడుతోంది. వైజాగ్‌లో రెండు సెంచరీలతో రెచ్చిపోయిన రోహిత్‌ శర్మ 14 పరుగులకే ఔటై నిరాశపర్చాడు. మరో ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ సూపర్‌ సెంచరీతో సత్తా చాటాడు. కెరీర్‌లో వరుసగా రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసిన ఘనత సొంతం చేసుకున్నాడు. 195 బంతుల్లో 108 పరుగుల చేసి మెరిశాడు. పుజారా 58, కెప్టెన్‌ […]

విశాఖ పట్టణంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత జట్టును పుణె పిచ్ భయపెడుతోంది. గురువారం నుంచి 14వ తేదీ వరకు గహుంజే స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రెండేళ్ల కిందట ఆస్ట్రేలియాతో ఇదే స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ టెస్ట్ మ్యాచ్లో మూడు రోజుల్లోనే టీమిండియాను సొంతగడ్డపై ఆస్ట్రేలియా […]