వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు ఊహించని షాక్‌ తగిలింది. వరుస రెండు విజయాలతో జోష్‌ మీదున్న ఉన్న కోహ్లీ సేనకు దెబ్బ తగిలింది. బొటనవేలు గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధవన్ మూడు వారాల పాటు టోర్నమెంటు నుంచి వైదొలగనున్నాడు. ఆదివారం ఓవల్ వేదికగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ధవన్ ఎడమ చేతి బొటనవేలికి బంతి బలంగా తగిలింది. చేతికి గాయమైనప్పటికీ క్రీజులో నుంచి బయటికి రాకుండా బ్యాటింగ్ చేసిన […]

వరల్డ్‌ కప్‌లో వరుణుడు ఓ ఆట ఆడేసుకుంటున్నాడు.. వరుణుడి దెబ్బకు ఇప్పటికే మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. అందులో రెండు శ్రీలంక మ్యాచ్‌లే. శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మ్యాచ్‌కు పూర్తిగా వర్షం ఆటంకం కలిగించడంతో రెండు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి. సెమీస్‌కు చేరుకోవాలంటే బంగ్లాదేశ్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పని సరి.. కానీ వర్షం కారణంగా కేవలం ఒకపాయింట్‌ లభించింది. అయితే ఆ జట్టు ప్రస్తుతం ఫాం ప్రకారం.. సంచలనాలు నమోదు […]

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువరాజ్‌సింగ్‌కు ఐసిసి థ్యాంక్స్ చెప్పింది. అతని కెరీర్‌లో కొన్ని అత్యుత్తమ మ్యాచ్‌లకు సంబంధించిన క్లిప్పింగ్స్‌తో ఒక వీడియో రూపొందించింది. గొప్ప ఆల్‌రౌండర్ క్రికెట్‌కు దూరమయ్యాడంటూ కితాబిచ్చిన ఐసిసి ట్విట్టర్‌లో యువీపై రూపొందించిన వీడియోను ఉంచింది.

వర్షంతో మ్యాచ్‌లు సరిగా జరగకపోవడంతో విరామాన్ని ఆటగాళ్ళు ఆఫ్ ది ఫీల్డ్‌లో ఆస్వాదిస్తున్నారు. తాజాగా విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ కెమెరామ్యాన్ అవతారమెత్తాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో గ్రౌండ్‌లో బ్రాస్‌కాస్టింగ్ కెమెరాను తీసుకున్న గేల్ కాసేపు వీడియో రికార్డ్ చేస్తూ సందడి చేశాడు. తర్వాత కెమెరామ్యాన్ పని చాలా కష్టమంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు.

వరల్డ్‌కప్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా ఎదురుదెబ్బ తగలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం కారణంగా మూడు వారాల పాటు టోర్నీకి దూరమయ్యాడు. ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ధావన్ చేతివేలికి గాయమైంది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ధావన్ గాయం కారణంగానే ఫీల్టింగ్‌ చేయలేదు. అయితే తాజాగా భారత ఓపెనర్ వేలికి స్కానింగ్ చేయించగా.. మూడు వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. దీంతో […]

యువరాజ్‌సింగ్‌… భారత క్రికెట్‌లో డాషింగ్ ఆల్‌రౌండర్‌… బ్యాట్‌తోనూ,బంతితోనూ తనదైన ముద్ర వేశాడు. సిక్సర్ల వీరునిగా అభిమానులు పిలుచుకునే యువీ కెరీర్‌కు టీ ట్వంటీ ప్రపంచకప్‌ టర్నింగ్ పాయింట్‌గా చెప్పొచ్చు. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల రికార్డుతో వరల్డ్‌వైడ్‌గా హీరో అయిపోయాడు. భారత క్రికెట్‌లో ఎందరో గొప్ప ఆటగాళ్ళు వచ్చినా… యువరాజ్‌సింగ్ లాంటి ఆల్‌రౌండర్లు మాత్రం అరుదగానే ఉంటారు. జట్టు మిడిలార్డర్‌కు కీలకంగా… క్లిష్టసమయాల్లో బంతితోనూ మాయ చేయగల బౌలర్‌గానూ అదరగొట్టడం […]

టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆసీస్‌తో జరిగిన పోరులో భారత అభిమానులు కొందరు స్మిత్‌ను ఛీటర్ అంటూ గేలి చేయడంతో కోహ్లీ మైదానం నుంచే వారిపై అరిచాడు. అలా అనొద్దంటూ వారించి ప్రోత్సహించాలని సైగలతో సూచించాడు. మ్యాచ్ ముగిసాక మీడియా సమావేశంలోనూ విరాట్‌ దీనిపై స్పందించాడు. ఫ్యాన్స్ చేసిన తప్పుకు ఆసీస్‌ కెప్టెన్‌ను క్షమాపణలు కోరాడు. అభిమానులు ఇలా చేయడం తగదని , హుందాగా వ్యవహరించాలని […]

టీమిండియా ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్ అంతర్జతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మేట్ల నుండి వైదొలుగుతున్నట్టు వెల్లడించాడు. 17 ఏళ్ళ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే సమయం ఇదేనంటూ ఉద్వేగానికి గురయ్యాడు. 2000లో కెన్యాపై అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన యువరాజ్‌ జాతీయ జట్టులో స్టార్ ప్లేయర్‌గా ఎదిగాడు. 2007 టీ ట్వంటీ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఒకే ఓవర్లో యువీ కొట్టిన ఆరు సిక్సర్ల ఫీట్‌ను అభిమానులు ఎప్పటకీ మరిచిపోలేరు.అలాగే 2011 ప్రపంచకప్‌ విజయంలోనూ […]

17 ఏళ్ల పాటు భారత క్రికెట్‌ అభిమానులను ఉర్రుతలూగించిన యువరాజ్‌…అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇక క్రికెట్‌కు సెలవంటూ వీడ్కోలు పలికాడు. గత కొద్దికాలంగా ఫామ్‌లో లేని యువరాజ్‌ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు ప్రకటించాడు. 2000 సంవత్సరంలో కెన్యా వన్డేతో అరంగేట్రం చేసిన యువరాజ్‌.. తన 17 ఏళ్ల క్రికెట్‌ కెరీయర్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు యువీ. ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చేత్తో గెలిపించాడు. రెండు […]

అంచనాలు తప్పలేదు…వేదిక మారినా ఫలితం మాత్రం అదే..టోర్నీలో కీఫైట్‌గా భావించిన పోరులో ఆసీస్‌పై టీమిండియదే పైచేయిగా నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న కోహ్లీసేన 36 పరుగుల తేడాతో గెలిచింది. బ్యాటింగ్‌లో ధావన్‌,కోహ్లీ ఇన్నింగ్స్‌లు హైలెట్‌గా నిలిస్తే… బౌలింగ్‌లో పేస్ ద్వయం అదరగొట్టింది. దక్షిణాఫ్రికాపై కోహ్లీ సేన నెగ్గినా.. ఎక్కడో ఏదో తెలియని అనుమానం. కానీ, ఆసీస్‌పై టీమిండియా ప్రదర్శన ముందు ఆ అనుమానాలన్ని పటాపంచలయ్యాయి. ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. […]