వరల్డ్‌ కప్‌ను ఆసీస్‌ ఘనంగా ప్రారంభించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. డేవిడ్ ‌వార్నర్‌ 89, ఆరోన్‌ఫించ్‌ 66 పరుగులతో చెలరేగారు. దీంతో అఫ్గాన్‌ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 34.5 ఓవర్లలోనే ఛేదించింది. ఫించ్‌, వార్నర్‌లు తొలి వికెట్‌కు 96 పరుగులతో శుభారంభాన్ని అందించారు. మొదట ఫించ్‌ ఔటవ్వగా ఉస్మాన్‌ ఖవాజా15, స్టీవ్‌స్మిత్‌ 18తో కలిసి వార్నర్‌ జట్టుని విజయతీరాలకు చేర్చాడు. […]

టీవీలో ప్రసారమయే ఏ కార్యక్రమానికి ఆయన సెంటర్ అఫ్ అట్రాక్షన్‌ యాంకరే. పోగ్రాం చూసే ప్రేక్షకుల దృష్టి ముందుగా వచ్చే యాంకర్‌పైనే ఉంటుంది.. కొందరు మాటలతో ఆకట్టుకుంటే.. మరికొందరు. రూపంతో ఆకర్షిస్తారు. అలా అందంతో ,మాటలతో ప్రేక్షకులను ఆకట్టి పడేస్తుంది ఓ భామ. దేశంలో మోస్ట్ ఫేవరేబుల్ వ్యాఖ్వతగా క్రికెట్,పుట్‌బాల్ అబిమానులకు తెగ నచ్చేసింది ఆ యంగ్ ఆండ్ డైనామిక్ యాంకర్. క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని […]

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను వెస్టిండీస్ చిత్తు చేసింది. పాక్‌ నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్‌ 13.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి సునాయాసంగా ఛేదించింది. క్రిస్‌గేల్‌ 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగి హాఫ్ సెంచరీ సాధించాడు. వెన్నునొప్పి వేధిస్తున్నా లెక్కచేయకుండా భారీ సిక్సర్లు బాదేశాడు. అతడికి తోడుగా నికోలస్‌ పూరన్‌ రెచ్చిపోయాడు. 19 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 […]

ప్రపంచ కప్‌లో సచిన్ ఏంటి..అతను ఎప్పుడో రిటైర్ అయ్యారుగా మళ్ళీ మైదానంలోకి అడుగు పెడుతున్నాడా! అని అనుకుంటారా? అలా అనుకుంటే పొరపాటే ప్రపంచకప్ 2019 టోర్నీ కోసం భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కామెంటేటర్‌గా మారాడు. గురువారం ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి కామెంట్రీలో సచిన్ సందడి చేశాడు. అయితే పలు సార్లు బీసీసీఐ, […]

ప్రపంచ కప్ మెుదటి మ్యాచ్‌లోనే ప్రేక్షకులకు కావల్సినంతా మజా దొరికింది. ఇటు బ్యాటింగ్..అటు ఫిల్డింగ్‌లో ఆటగాళ్ళు అదరగొట్టారు. కళ్లు చెదిరే క్యాచ్‌లు.. ఔరా అనిపించే బౌండరీలు.. క్రికెట్ అభిమానులను రంజింపచేశాయి. కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా దక్షిణాఫ్రికా ,ఇంగ్లండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్ళ విన్యాసాలు అన్ని కనిపించాయి. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, సపారీలపై ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శన సఫారీ జట్టును ఓటమి […]

ప్రపంచకప్‌ 2019ను ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు భారీ విజయంతో ప్రారంభించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో ఆ జట్టు సూపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టు 311 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెయిర్‌ స్టో తొలి ఓవర్‌లోనే డకౌట్‌గా పెవిలియన్‌ చేరినప్పటికీ జేసన్‌ రాయ్‌, జో రూట్‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడి రెండో వికెట్‌కు 106 పరుగులు సాధించిన తర్వాత […]

ప్రపంచ కప్ మెుదలైంది. తొలి మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహా క్రీడా సంగ్రామం గురువారం మెుదలవుతుండడంతో క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అన్ని జట్లు సమఉజ్జీలుగా ఉండడంతో ఎవరు గెలుస్తారు అనే దానిపై అందరికి ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం టైటిల్ ఫేవరెట్‌గా ఇంగ్లాండ్ ఉన్నా.. ఆస్ట్రేలియా,ఇండియా జట్లను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. అయితే గురువారం జరిగే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా […]

రెండు దేశాల మధ్య ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని యుద్దాలు జరిగినా పాక్‌తో భారత్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. చూసే వారికి మజానిస్తుంది. ఎన్ని దేశాలతో ఆడినా పాకిప్తాన్‌తో మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోయే వారి సంఖ్య కూడా ఎక్కువే వుంటుంది. పుల్వామా దాడి తరువాత పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదనే కామెంట్లు వినిపించినా ద్వైపాక్షిక్ సిరీస్‌లు ఆడేందుకు నిరాకరించింది భారత జట్టు. ఈ విషయమై పాక్ క్రికెట్ […]

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. గురువారం నుంచే వన్డే ప్రపంచకప్ వేట మొదలైంది. ‌ప్రారంభోత్సవ వేడులను అట్టహాసంగా నిర్వహించారు. లండన్ లోని బకింగ్ హాల్‌కి సమీపంలో ఈ వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో మాజీ క్రికెటర్లు, కొందరు ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. దాదాపు 4 వేల మంది అభిమానులు ఈ వేడుకకు హాజరయ్యారు. ముందుగా ఈ టోర్నీ ఆడుతున్న పది దేశాల కెప్టెన్లను ఒకరి […]

ఎవరికి ఎవరో ముందే రాసి పెట్టి ఉందంటారు. మరి అది ఎంత వరకు నిజమో. వేద మంత్రాల సాక్షిగా పెళ్లి జరిపించే పూజారితోనే పెళ్లి కూతురు జంప్ అయితే ఏమనాలో అర్థం కావట్లేదు ఊరి ప్రజలకి. మధ్యప్రదేశ్‌లోని విధిష జిల్లా సిరోంజ్‌లోని బాగ్‌రడ్‌కు చెందిన వినోద్ మహరాజ్ అనే పూజారి మే 7న ఓ జంటకు వివాహం జరిపించాడు. వివాహ కార్యక్రమాలు పూర్తవగానే సంప్రదాయం ప్రకారం అత్తింట్లోకి అడుగు పెట్టింది […]