బాదుడికి కేరాఫ్‌ ఆడ్రస్ అయిన గేల్‌ను వెనక్కు నెట్టేసింది. చిచ్చర పిడుగు సెహ్వాగ్‌ను మైమరపించింది. విజృంభణ అంటే ఇలా ఉంటుంది అని చూపిస్తూ స్టేడియంలో పరుగుల సునామీ సృష్టించింది. క్రీజ్‌లో పడ్డ ప్రతి బంతిని బౌండరీ దాటిస్తూ రికార్డుల మోత మోగిచింది ఆస్ట్రేలియా ఉమెన్‌ క్రికెటర్‌ అలీసా హీలీ. గతంలో ఆసీస్‌ ఉమెన్‌ క్రికెటర్‌ మెగ్‌ లానింగ్‌ చేసిన 133 పరుగులే అత్యధిక రికార్డుగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును […]

హంటింగ్‌ గ్రౌండ్‌లో రోహిత్‌ అదరగొట్టాడు. సఫారీలను ఉతికి ఆరేశాడు. తనకు అచ్చొచ్చిన విశాఖలో మరోసారి విజృంభించాడు. తొలి టెస్టులో సెంచరీతో కదం తొక్కాడు. వర్షం కారణంగా ఆట త్వరగా ముగించాల్సి వచ్చింది. ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా టీమిండియా 202 పరుగులు చేసింది. ఓపెనర్‌గా రాణిస్తాడా అని అనుమానించిన వాళ్లకు రోహిత్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చిన తొలి మ్యాచ్‌లోనే శతక్కొడుతూ విశ్వరూపం ప్రదర్శించాడు. […]

సౌతాఫ్రికాతో విశాఖలో జరుగుతున్న తొలిటెస్టులో భారత ఓపెనర్లు విజృంభించారు. ప్రత్యర్థి బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. టాస్‌ గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. మొదట్లో ఇద్దరూ ఆచితూచి ఆడారు. క్రీజ్‌లో కుదురుకున్నాక వేగం పెంచారు. వీలుచిక్కినప్పుడల్లా బంతుల్ని బౌండరీలు దాటించారు.. లంచ్‌ తర్వాత ఈ జోడీ మరింత దూకుడుగా ఆడింది. ఈ క్రమంలో రోహిత్ సెంచరీ, మాయంక్ అగర్వాల్ […]

అమ్మ కావాలంటే అమ్మ పెట్టినవన్నీ తినాలి. డాక్టర్ చెప్పినట్లు చెయ్యాలి. అప్పుడే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో బరువు విపరీతంగా పెరిగిపోతుంటారు. డెలివరీ అయిన తరువాత పాలిచ్చే క్రమంలో శరీరంపై శ్రద్ధ పెట్టే అవకాశం ఉండదు. మరి అలానే వదిలేస్తే అనుకున్న లక్ష్యం నెరవేరదు. అందుకే అమ్మ జిమ్ముల్లో కసరత్తులు చేస్తుంది. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనేందుకు తనని తాను సమాయత్తం చేసుకుంటోంది భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా […]

ఐసీసీ బౌండరీ రూల్ మారబోతోంది. బౌండరీ రూల్ స్థానంలో సూపర్ ఓవర్‌ను పొడిగించనున్నారు. మ్యాచ్ టై ఐతే విజేతను తేల్చడానికి మరికొన్ని ఓవర్లు ఆడించాలని ఐసీసీ భావిస్తోంది. ఇప్పటి వరకు సూపర్ ఓవర్‌లో ఎవరు ఎక్కువ పరుగులు చేస్తే వాళ్లనే గెలిచినట్లు ప్రకటించేవారు. సూపర్ ఓవర్‌లో కూడా పరుగులు సమానంగా వస్తే బౌండరీల ఆధారంగా విన్నర్‌ను తేల్చేవారు. ఈ బౌండరీ రూల్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో ఐసీసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. […]

భారత షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇందుకు ముఖ్యపాత్ర పోషించిన సింధు మహిళా కోచ్‌ కిమ్ జి హ్యున్ తన పదవికి రాజీనామా చేశారు. దక్షిణ కొరియాకు చెందిన జి హ్యున్.. సింధుకు నాలుగు నెలలు మాత్రమే కోచ్ గా సేవలందించారు. వ్యక్తిగత కారణాలతో కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. కాగా హ్యున్ భర్త […]

సొంత గడ్డపై సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ గెలవాలన్న టీమిండియా ఆశలు నెరవేరలేదు. ఆదివారం జరిగిన చివరి టీ20లో సఫారీలు విజయం సాధించడంతో సీరిస్‌ సమం అయ్యింది. దీంతో చివరి టీ20లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోవడంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఛేజింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా బ్యాటింగ్‌ తీసుకోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. విమర్శలపై స్పందించిన కోహ్లీ.. తమది తప్పుడు నిర్ణయమేనని పరోక్షంగా ఒప్పుకున్నాడు. గేమ్‌ […]

సౌతాఫ్రికాతో రెండో టీ-20లో భారత్ ఘన విజయం సాధించింది. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 20 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేశారు. భారత్ 19 ఓవర్లలో 151 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాను 150 రన్స్‌లోపే పరిమితం చేసిన టీమిండియా.. సునాయాస లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. రోహిత్‌ శర్మ త్వరగానే అవుటైనా,  కోహ్లీ, శిఖర్‌ ధవన్‌ ధాటిగా ఆడడంతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కోహ్లీ […]

ఫేమస్ రెజ్లర్ ఎన్నికల్లో పోటీ చేయబోతోందా..? రెజ్లింగ్‌లో పతకాల పండించిన ఆమె ఎలక్షన్ ఫీల్డ్‌లో ఓట్ల పంట పండించగలదా..? హర్యానాలో ఇప్పుడు హాట్ టాపిక్ ఇదే. రెజ్లర్ బబితా ఫొగట్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం. బీజేపీ క్యాండిడేట్‌గా ఆమె బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. బర్దా లేదా చారఖీ దాద్రి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశముందని అంటున్నారు. ఆమె అభ్యర్ధిత్వం, పోటీ చేసే స్థానంపై […]

ధోనీని టీ20 జట్టుకు ఎంపిక చేయని భారత సెలక్టర్లు. ధోనీ.. తన రిటైర్మెంట్ గురించి ముందే చెప్పడంతో ఎంపిక చేయలేదా.. లేక భారత సెలక్టర్లు ధోనీని ఎంపికలో పరిగణలోకి తీసుకోలేదా అంటూ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం మీడియాతో మాట్లాడనున్న ధోనీ ఏం చెబుతాడని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ధోనీ త్వరలోనే రాజకీయాల్లో చేరతాడంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నాడనే ప్రచారం […]