వయసుతో పనేముంది.. ఒంట్లో సత్తా వుండాలి కానీ.. అందరికీ వర్తిస్తుందా.. అమృతం తాగిన మహానుభావులు కొందరే వుంటారా.. వెస్టిండీస్ క్రికెటర్‌ సెసిల్ రైట్.. ఆయన వయసు 85 ఏళ్లు. 60 ఏళ్లుగా కెరీర్‌లో 7000కు పైగా వికెట్లు తీశారు. ఫాస్ట్ బౌలర్‌గా క్రికెట్ మైదానంలో దుమ్ము రేపారు. సెసిల్ వెస్టిండీస్ దిగ్గజాలు వివ్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, జోయెల్ గార్నర్, ఫ్రాంక్ వోరెల్‌తో కలిసి ఆడారు. 85వ వసంతంలోకి అడుగుపెడుతున్న […]

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌ పీవీ సింధు స్వదేశానికి చేరుకున్నారు. పుల్లెల గోపిచంద్‌తో కలిసి ఆమె కేంద్ర మంత్రి కిరేణ్‌ బిజుజూని కలిశారు. ఈ సందర్బంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు కేంద్రమంత్రి. మరోవైపు… భవిష్యత్‌లో మరిన్ని టోర్నమెంట్లు గెలిచేందుకు ఈ విజయం దోహపడుతుందన్నారు పీవీ సింధూ. సింధూ గోల్డ్‌ మెడల్‌ సాధించడం సంతోషంగా ఉందన్నారు పుల్లెలగోపిచంద్‌.

ప్రంపంచ చాంఫియన్ షిప్ టైటిల్ నెగ్గిన తెలుగు తేజం పీవీ సింధు స్వదేశానికి చేరుకుంది. ఆమెకు ఢిల్లీ ఎయిర్ పోర్టులో బ్యాడ్మింటన్ సంఘం పెద్దలు, అధికారులు, క్రీడా సంఘాల పెద్దలు ఘన స్వాగతం పలికారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సాధించిన తొలి భారత షట్లర్‌గా రికార్డుల్లో నిలిచిన ఆమె మంగళవారం హైదరాబాద్ కు చేరుకోనుంది. ఇక్కడ కూడా వినూత్న రీతిలో ఘన స్వాగతం పలికేందుకు బ్యాడ్మింటన్ సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

తెలుగు తేజం, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు సరికొత్త రికార్డు సృష్టించింది. భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ఎవరికి సాధ్యంకాని.. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్‌లో ఆమె, జపాన్ షట్లర్ నొజోమీ ఒకుహారాను వరుస గేమ్‌లలో ఓడించింది. వరుసగా రెండు గేమ్‌లను గెలుచుకున్న సింధూ ఆటతో పాటు స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుని….. భారత ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటింది. మొత్తంగా సింధూకు ఇది ప్రపంచ చాంపియన్‌ […]

యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ అదరగొట్టింది.. ఉత్కంఠ మధ్య సాగిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌కు ఊహించని విజయాన్ని అందించాడు.. 219 బంతుల్లో పదకొండు ఫోర్లు, 8 సిక్సర్లు బాది 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.. 259 పరుగుల లక్ష్యాన్ని ఒక వికెట్‌ మిగిలుండగా ఇంగ్లండ్‌ జట్టు ఛేదించింది. నాలుగోరోజు మ్యాచ్‌ ఎన్నో మలుపులు తిరిగింది.. విజయం ఇద్దరి మధ్యా దోబూచులాడింది.. అయితే ఉత్కంఠ పోరులో చివరకు […]

టీ20లు, వన్డేల్లోనే కాదు.. టెస్టుల్లోనూ టీమిండియా విజయ దుందుభి మోగిస్తోంది.. వెస్టిండీస్‌ టూర్‌లో అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతోంది.. తొలి టెస్టును కైవసం చేసుకుంది టీమిండియా.. రహానె సెంచరీతోపాటు బుమ్రా విజృంభించడంతో వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో టీమిండియా ఘనంగా బోణీ చేసింది. తొలి టెస్ట్‌లో వెస్టిండీస్‌ను 318 పరుగులతో చిత్తు చేసింది. టీమిండియా నిర్దేశించిన 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 26.5 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌటైంది. బుమ్రా […]

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 297 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. సెకండ్ ఇన్నింగ్స్ లో లంచ్ విరామానికి నాలుగు వికెట్ల కోల్పోయి 300 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో అజింక్య రహేనే సెంచరీ సాధించాడు. అతనికి విరాట్ కోహ్లీ, హనుమ విహారి తోడ్పాటునందించారు. ఓపెనర్లు కెఎల్ రాహుల్(38), మయాంక్ అగర్వాల్(16)పెద్దగా రాణించలేకపోయారు. వన్ డౌన్ లో వచ్చిన చటేశ్వర్ పూజారి […]

హైదరాబాద్ షట్లర్ పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ గెలిచిన తొలి ఇండియన్‌గా నిలిచింది.. ఫైనల్లో జపాన్‌ ప్లేయర్ ఒకుహరపై రెండు వరుస సెట్లలో గెలిచింది..2017లో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. 2017లో ఒకుహర చేతిలోనే ఓడిపోయి స్వర్ణాన్ని చేజార్చుకుంది పీవీ సింధు. ఫైనల్లో సింధు చిరుతపులిలా చెలరేగి పోయింది. ఆమె దూకుడు ముందు ఒకుహర నిలువలేకపోయింది. అసలు ఏదశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.. 21-7తేడాతో […]

రాజకీయంగానే కాదు.. క్రికెట్‌లోనూ ఎంతో మంది ఆటగాళ్ల కెరీర్‌ను మలుపు తిప్పారు జైట్లీ. భారత క్రికెట్‌లో డాషింగ్‌ డైనమిక్‌గా పేరుపొందిన సెహ్వాగ్, టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ కెరీర్‌ ముందుకు సాగడంలో అరుణ్‌ జైట్లీ కృషి ఎంతో ఉంది. అటు రాజకీయాల్లో కొనసాగుతూనే..ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు జైట్లీ. 1999 నుంచి 2013 వరకు అరుణ్ జైట్లీ డీడీసీఏ ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు. […]

ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఇంటర్‌ నేషనల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో డబ్బులు తీసుకొని అర్హత లేనివారిని టోర్నమెంట్‌లో సెలక్ట్ చేశారంటూ క్రీడాకారుడి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. టోర్నమెంట్‌లో సెలక్ట్‌ అయిన తమ కుమారుడు కార్తికేయను చివరి క్షణంలో పోటీల నుంచి నిర్వాహకులు తప్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు తప్పించారంటూ ప్రశ్నించినందుకు సెలక్టర్‌ శివారెడ్డి తమపై దాడులకు దిగారని క్రీడాకారుడి తల్లిదండ్రులు మండిపడ్డారు . సైఫాబాద్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన […]