భారత క్రికెట్‌లో వివాదాలకు తెరపడడం లేదు. ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య కోల్డ్‌వార్ కొన సాగుతోందంటూ ప్రచారం జరుగుతుండగా, తాజాగా ద్రవిడ్ వ్యవహారం రగడ రాజేసింది. మిస్టర్ డిపెండబుల్‌ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్ నోటీసులు ఇవ్వడం కలకలం రేపింది. ద్రవిడ్‌కు నోటీసులపై మాజీ క్రికెటర్లు గరంగరమయ్యారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తీవ్రంగా స్పందించాడు. వార్తల్లో నిలవడానికే నోటీసులు ఇచ్చారని సెటైర్లు […]

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు సమీక్ష చేయకుండానే సారథిగా విరాట్‌ కోహ్లీని తిరిగి ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సెలక్షన్‌ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా.. లేక కోహ్లి నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా అనే విమర్శలు వచ్చాయి. ఈ సెలక్షన్‌ కమిటీకి ఇదే చివరి ఎంపిక అని ఆయన వ్యాఖ్యానించారు. వెస్టిండీస్‌ పర్యటనకు జట్టును ఎంపిక చేసేముందు […]

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌కెప్టెన్‌ రోహిత్‌శర్మ మధ్య విభేదాలు ఉన్నాయంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రోహిత్‌ శర్మతో తనకు విభేదాలు లేవని కోహ్లీ స్పష్టం చేశాడు. అతడిని చూసి అభద్రతాభావానికి గురైతే అది తన ముఖంలో కనిపించేదని వెల్లడించాడు. తానెప్పుడూ రోహిత్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతానని పేర్కొన్నాడు. రోహిత్‌ అంత బాగా ఆడతాడని తెలిపాడు. అసలు బయట ఇలా ఎందుకు […]

భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ మరో స్వర్ణంతో మెరిసింది. ఇండోనేషియాలోని లాబన్ బజోలో జరిగిన 23వ ప్రెసిడెంట్స్ కప్‌ ఫైనల్‌లో అలవోకగా విజయం సాధించింది. మహిళల 51 కేజీల విభాగం ఫైనల్‌లో ఒలింపిక్ కాంస్యపతక విజేత, ఆస్ట్రేలియా బాక్సర్‌ ఏప్రిల్ ఫ్రాంక్స్‌ను 5-0తో మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. సెమీ ఫైనల్‌లో వియత్నాంకు చెందిన కిమ్‌తో పోరాడి 3-2తో గెలిచిన మేరీ, ఫైనల్‌లో మాత్రం అలవోకగా విజయం […]

టాప్ ఇండియన్ బాక్సర్ మేరికోమ్ ఖాతాలో మరో మెడల్ పడింది. ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీలో మేరీ కోమ్ గోల్డ్ మెడల్ సాధించింది. మహిళల 51 కిలోల విభాగంలో మేరీకోమ్‌ స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైన ల్లో ఆస్ట్రేలియన్ బాక్సర్ ఫ్రాంక్స్‌తో జరిగిన పోరులో మేరీ కోమ్ 5-0 తేడాతో విజయం సాధించింది. సెమీ ఫైనల్‌లో వియత్నాంకు చెందిన కిమ్‌తో పోరాడి గెలిచిన మేరీ, ఫైనల్‌లో మాత్రం అలవోకగా విజయం […]

టీమిండియా స్టైలిష్ బ్యాట్స్‌మెన్, వైస్‌ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మను అన్‌ఫాలో చేశాడు. ఇంగ్లండ్‌లో వరల్డ్‌కప్‌ జరుగుతున్నప్పుడే కెప్టెన్ కోహ్లీని కూడా అన్‌ఫాలో అయ్యాడు. రోహిత్ శర్మ భార్య రితిక కూడా సేమ్‌ ఇదే ఫాలో అయింది. ఉన్నట్టుండి రోహిత్ శర్మకు … కోహ్లీ, అనుష్కశర్మపై ఎందుకు కోపం వచ్చింది. ఇద్దరినీ ఎందుకు అన్‌ఫాలో చేశాడన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. మామాలూగా అయితే ఇది పర్సనల్ విషయం. పెద్దగా […]

వికెట్ల వెనుక నిలబడి మెరుపు వేగంతో స్టంపింగ్‌లు చేయడం.. క్రీజ్‌లోకి వచ్చాక బ్యాట్‌తో బౌండరీలు బాదడం మాత్రమే కాదు.. దేశ రక్షణలోనూ ముందే ఉంటున్నాడు మహేంద్ర సింగ్‌ ధోనీ. కేవలం మాటలు చెప్పడమే కాదు చేతల్లో చూపిస్తున్నాడు. వరల్డ్‌ కప్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనీ.. విండీస్‌ టూర్‌ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. సైన్యంతో కలిసి విధుల్లో తానూ భాగం కావాలని భావించడంతో విండీస్‌ టూర్‌కు […]

శ్రీలంక పేస్ బౌలర్.. లసిత్ మలింగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలో వన్డే మ్యాచ్ లు ఆడబోనని చెప్పాడు. ఆయన సతీమణి ఫేస్ బుక్ పేజ్ ద్వారా తన రిటైర్‌మెంట్ గురించి ప్రకటన చేశాడు. బంగ్లాదేశ్‌తో కొలంబో వేదికగా జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత వన్డే మ్యాచ్ ల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కానీ టీ-20 ఫార్మాట్‌లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్‌లో […]

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌తో ఢి అంటే ఢీ అంటోంది క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ. హైదరాబాద్ పరిశర ప్రాంతాల్లో ఉన్న క్రికెటర్లకే తరచూ అవకాశాలు వస్తున్నాయని.. ఇతర జిల్లాల్లో ఉన్న ఆటగాళ్లు తీవ్రంగా నష్టపోతున్నారని పోరాటం చేస్తున్న క్యాట్.. జనరల్ బాడీ సమావేశంలో ఇదే అంశాన్ని లేవనెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని కొత్త క్లబ్ లు ఏర్పాటు చేసి.. త్వరలో జరిగే ఎన్నికల్లో ఓటింగ్ హక్కు కల్పించాలని క్యాట్ డిమాండ్ చేస్తోంది. […]

క్రికెట్ వరల్డ్‌కప్‌ గెలవాలని ప్రతి భారతీయుడూ కోరుకున్నాడు. పూజలు చేశారు. మన టీమ్‌ ఆటతీరు కూడా ఓ రేంజ్‌లో కనిపించింది. లీగ్‌ దశలో టాపర్స్‌ మనమే. కానీ.. ఒకడు మాత్రం టీమిండియా ఓడిపోవాలని.. ఫైనల్ చేరకూడదని ప్రార్థించాడట. ఏసుక్రీస్తు నా మొర ఆలకించాడు.. వరం కురిపించాడు అంటూ.. ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో దేశం ఓడిపోవాలని కోరుకున్న వాడిని ఏమనాలి? అతడు భారతీయుడేనా? మరో […]