ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం అటెండర్‌ చంద్రయ్య పరిస్థితి ధీనంగా మారింది. అతడి పరిస్థితిని అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం వైద్యం నిలిచిపోయింది. ఆస్పత్రి బిల్లు కట్టడం లేదనే కారణంతో చంద్రయ్యను ఆస్పత్రి నుంచి చికిత్స మధ్యలోనే బయటకు తరిమేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్‌ ఎమ్మార్వో విజయా రెడ్డి సజీవదహనమవుతుంటే కాపాడే ప్రయత్నంలో డ్రైవర్‌ కూడా మృతి చెందాడు. ఆఫీస్‌ అటెండర్‌కు సైతం తీవ్ర […]

ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై హైకోర్టు విచారణ బుధవారానికి వాయిదా పడింది. మొదట ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ సుదీర్ఘంగా సాగింది. కార్మికుల సమ్మె చట్ట విరుద్ధమా? కాదా? అని చెప్పే అధికారం హైకోర్టుకు ఉందా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై వివరించాలని సీనియర్ న్యాయవాది విద్యాసాగర్‌ను ఉన్నత న్యాయస్థానం కోరింది. ఎస్మా కింద సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించవచ్చని.. ఆర్టీసీని 1998, 2015లో ఎస్మా పరిధిలోకి […]

కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి ఎస్సై మురళి సస్పెండ్ అయ్యారు. ఆర్టీసీ కార్మికుల మిలియన్‌ మార్చ్‌ రోజు ఆయన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. స్టేషన్‌ ఆవరణలోనే ఆయన మద్యం సేవించాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సీరియస్‌ అయిన ఎస్పీ శ్వేతా రెడ్డి చర్యలు తీసుకుంటూ.. ఎస్సై మరళిని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణలో రెవెన్యూ సంఘాలు రెండుగా చీలాయి. విజయారెడ్డి హత్య తరువాత ఆందోళనలు ఉధృతం చేసిన రెవెన్యూ సంఘాలు ఇప్పుడు ఎవరికి వారు వేర్వేరుగా ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. ట్రెసా ఆధ్వర్యంలో కీలక అధికారులంతా తమ కార్యాచరణను నిర్ణయించారు. వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చారు. ఇటు ప్రభుత్వంతో ట్రెసా అధికారుల చర్చలు సఫలం కావడంతో.. నిరసన కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నామని ప్రకటించారు. మరోవైపు తెలంగాణ రెవెన్యూ జేఏసీ […]

TSRTC కార్మికులు చేపడుతున్న సమ్మె 39వ రోజు కొనసాగుతోంది. RTC JAC పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో కార్మికులు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఇతర జేఏసీ నేతలు కార్మికులకు దండలు వేసి దీక్షలు ప్రారంభించారు. కార్మికుల సమ్మెపై ప్రభుత్వంలో చలనంలేదని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమంగా కార్మికులే విజయం సాధిస్తారన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను […]

హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో రౌడీషీటర్ అరాచకాలపై ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు స్థానికులు.. హోంమంత్రి మహమూద్ అలీ ఫ్లెక్సీపై పెట్రోల్‌బాంబు విసిరి తగులబెట్టాడు రౌడీషీటర్. ఈ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డయ్యాయి.. వీటిని పోలీసులకు అప్పగించిన స్థానికులు..గతంలో ఈ రౌడీషీటర్ చేసిన దారుణాలపైనా ఫిర్యాదు చేశారు.

ఒకటి రెండు కాదు.. ఎనిమిది గంటల పాటు ప్రాణాలు అరచేత పట్టుకొని పోరాడాడు. కాచిగూడ రైల్‌ ప్రమాదంలో MMTS లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ తీవ్ర ఆవేదన అనుభవించాడు. ఉదయం పదిన్నర గంటల సమయంలో ప్రమాదం జరగడంతో ఇంజన్‌లో పూర్తిగా ఇరుక్కుపోయాడు చంద్రశేఖర్‌. అప్పటి నుంచి అతణ్ని బయటకు తీసేందుకు రెస్యూ టీమ్స్‌ చాలా శ్రమించాయి. మొదట చేతులు బయటకు వచ్చినా.. తీయడానికి చాలా ఇబ్బందిగా మారింది. దీంతో అతడికి ఆక్సిజన్‌ […]

సూడాన్ దేశానికి చెందిన పసిపాపకు అరుదైన గుండె శస్త్ర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు రెయిన్‌బో ఆసుపత్రి వైద్యులు .హైదరాబాద్ బంజారాహిల్స్‌ రెయిన్‌బో చిల్డ్రన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో డాక్టర్ థపన్ నేతృత్వంలోని డాక్టర్ల బృందం శిశువుకు నోర్‌వుడ్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. నెల రోజుల బేబికి ఇలాంటి సంక్లిష్టమైన శస్త్ర చికిత్స అందించడం చాలా కష్టమని…అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బేబిని సేవ్ చేశామని వైద్యులు నాగేశ్వరరావు తెలిపారు .చిన్నారి గుండె […]

ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌, ఉన్నతాధికారులు భగీరథ పథకంపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మిషన్‌ కాకతీయ పథకం గురించి కూడా కేంద్రమంత్రికి.. కేసీఆర్ వివరించారు. 90 శాతం ఆయకట్టు కలిగిన చెరువులను బాగు చేసినట్లు చెప్పారు. మిషన్‌ భగీరథ పథకానికి, దాని నిర్వహణకు ఆర్థిక […]

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణను మంగళవారం వాయిదా వేసింది. సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని స్పష్టం చేసింది. చర్చలు జరపాలని ఆదేశించినప్పటికీ.. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికులు ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది. సమ్మెపై ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య హైకోర్టుకు తెలిపారు. అయితే ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీని అత్యవసర సర్వీస్‌గా పేర్కొంటూ జారీ చేసిన […]