యాదాద్రి భువనగిరి జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది… బొమ్మలరామారంలోని రెజినీస్ ఎక్స్‌ప్లోజీవ్ కంపెనీలో డిటోనేటర్ పేలింది… ఈ ఘటనలో గది పూర్తిగా ధ్వంసమై భీతావహంగా మారింది… ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు… మృతదేహం ముక్కలు ముక్కలయ్యింది… మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికుడి మునాగుల్‌గా గుర్తించారు… ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి… కంపెనీ నిర్వహకుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని […]

రాజమండ్రి టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్‌ను పరామర్శించారు మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌… వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న మురళీమోహన్ కోలుకుంటున్నారు… హైదరాబాద్‌లోని మురళీమోహన్‌ ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు చంద్రబాబు… త్వరగా కోలుకోవాలని బాబు, లోకేష్ ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటించాలని, పూర్తిగా నయమయ్యేవరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు…

వరంగల్, హన్మకొండ, కాజీపేటలో దొంగలు హల్‌చల్‌ చేశారు. అర్ధరాత్రి పలు కాలనీల్లో సంచరిస్తూ దోపిడీకి ప్రయత్నించారు. దొంగల ముఠా కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాలనీల్లో దొంగల సంచారం వార్త తెలియడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎప్పుడొచ్చి ఏం పట్టుకుపోతారోనని భయపడుతున్నారు. దొంగల కదలికపై దృష్టిసారించిన పోలీసులు.. ఇతర రాష్ట్రాలకు చెందిన గ్యాంగ్‌గా అనుమానిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించిన పోలీసులు.. అనుమానితులను గుర్తిస్తే.. వెంటనే సమాచారం ఇవ్వాలని […]

సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. నీటి గుండాలే యమగండాలవుతున్నాయి. కళ్లెదుటే ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి. గత 24 గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 9 మంది చనిపోయారు. అయిన వాళ్లకు తీరని విషాదాన్ని మిగిల్చారు. ఎండలు మండిపోతున్నాయి. వేసవిసెలవులూ పొడిగించారు. ఇంకేముంది..భానుడి భగభగల నుంచి ఉపశమనం పొందేందుకు చెరువులు, వాగులను ఆశ్రయిస్తున్నారు జనం. ఆ సరదానే ప్రాణాలు తీస్తోంది. పిల్లలకు నీళ్లంటే ఏదో తెలియని సంతోషం. అందుకే కాస్త టైమ్ దొరికే […]

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. నల్గొండ, వరంగల్‌, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచింది. నల్గొండ, రంగారెడ్డిలో కాంగ్రెస్‌కి కాస్త బలం కనిపించినా.. వరంగల్‌లో విజయం ఏకపక్షమైంది. నల్గొండలో తేరా చిన్నపరెడ్డి విజయం సాధించారు. ఇక వరంగల్‌లో భారీ మెజార్టీతో పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గెలిచారు. రంగారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి కూడా విజయం సాధించడంతో.. MLC ఎన్నికల్లో కార్ తీర్‌మార్ కొట్టనట్టయ్యింది. […]

ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్‌ఎస్ దక్కించుకుంది. వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఘన విజయం సాధించారు. ఆయన తన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పై గెలుపొందారు.

నల్లగొండ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇవాళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఎంపీగా ఎన్నికైన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలసి హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇవ్వనున్నారు. ఆయన రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం కానుంది. దీంతో హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఉత్తమ్‌ స్థానంలో ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తిగా మారింది. నియోజకవర్గవ్యాప్తంగా గట్టి కేడర్, అనుచరులున్న ఉత్తమ్‌ స్థానంలో ఎవరికి […]

ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్‌, నల్గొండ జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ సోమవారం జరగనుంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే ఫలితాలు వెలువడనున్నాయి. స్థానిక కోటా ఎమ్మెల్సీల స్థానాల ఉప ఎన్నిక కోసం ప్రధానంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు పోటీ పడ్డాయి. మొత్తం 9 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. మే 31న జరిగిన ఎన్నికల్లో ఈ మూడు జిల్లాల పరిధిలో 2799 […]

రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. శనివారం గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ చర్చించారు. ఏపీ, తెలంగాణల మధ్య సమస్యల పరిష్కారంపై ఇద్దరు సీఎంలు ఫోకస్‌ చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఇచ్చిన ఇఫ్తార్‌ విందుకు హాజరైన కేసీఆర్‌, జగన్‌లు […]

గడిచిన ఐదేళ్లలో తెలంగాణ అద్భుత ప్రగతిని సాధించిందన్నారు సీఎం కేసీఆర్. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్నో పథకాలు ప్రపంచం దృష్టిని ఆకర్శించాయని చెప్పారు. రైతులకు మరో లక్ష రుణమాఫీ చేయబోతున్నట్లు ప్రకటించారు. పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఘనంగా జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. ఐదు వసంతాలు పూర్తి చేసుకొని.. ఆరో ఏట అడుగుపెట్టింది తెలంగాణ. రాష్ట్ర అవతరణ వేడకలను ఘనంగా నిర్వహించారు. గత సంప్రదాయానికి భిన్నంగా […]