పోలీస్‌ పెట్రోల్ వాహనంలో నలుగురు యువకులు హల్‌చల్‌ చేశారు. హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌లో సైరన్‌ వేసుకుంటూ ర్యాష్‌ డ్రైవింగ్‌ చేశారు. దీంతో మిగతా వాహనదారులు ఉలిక్కిపడ్డారు. లా అండ్‌ ఆర్డర్‌ కోసం వినియోగించే పోలీస్‌ వాహనం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. వాహనాన్ని నడిపింది మైనర్లుగా చెబుతున్నారు. పోలీస్‌ వాహనం ఎవరికి సంబంధించింది. ఆ యువకుల చేతికి పెట్రోలింగ్‌ వాహనం ఎలా వెళ్లింది అన్నదానిపై పోలీసులు విచారణ […]

తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నిన్నటిదాకా నిప్పుల కుంపటిని తలపించిన ఈ ప్రాంతం చిరు జల్లులతో చల్లబడిపోయింది. భారీ వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

పెళ్లింట డీజే రౌడీలు ఎంటరయ్యారు. కర్రలు, రాడ్లతో దొరికినవారిని దొరికినట్టు చితక్కొట్టారు. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్‌లో జరిగిందీ దారుణం. పచ్చని పందిరి.. రక్తంతో తడిసిపోయింది. డీజే సౌండ్ పెంచమన్నందుకు గొడవ మొదలైంది. డీజే నిర్వాహకుడు తన స్నేహితులకు ఫోన్‌ చేశాడు. అల్లరి మూకల్ని రప్పించాడు. పెళ్లి రిసెప్షన్‌ జరుగుతుండగా ఎంటరైన వాళ్లు.. విచక్షణారహితంగా ప్రవర్తించారు. వరుడి కుటుంబాన్ని, వధువు బంధువులను వదల్లేదు. మాతో పెట్టుకుంటారా అంటూ చితకబాదారు. మండపాన్ని ధ్వంసం […]

రాష్ట్రంలో వ‌రుస ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌టంతో ఇప్పటివరకు పూర్తి స్థాయి విస్త‌ర‌ణ చేపట్టలేకపోయారు సీఎం కేసీఆర్‌. అయితే.. ప్రస్తుతం దాదాపుగా అన్ని ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గవిస్తరణపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. మిగిలిన 6 మంత్రి ప‌ద‌వుల్ని జెడ్పిటిసి,ఎంపిటిసి ఫలితాలు వెలువ‌డిన కొద్ది రోజుల‌కే భర్తీ చేసే అవకాశాలున్నాయి. దీనిపై ఇప్పటికే కేసిఆర్ క‌స‌ర‌త్తు చేసిన‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆరు స్ధానాల్లో ఎవ‌రెవ‌రికి ఛాన్స్ ద‌క్కుతుంద‌న్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా […]

తెలంగాణలో ఖాళీ అయిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్‌ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగిన ఈ పోలింగ్‌లో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మూడు ఎమ్మెల్సీల పరిధిలో 2799 మంది ఓటర్లు ఉండగా.. 25 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ పారదర్శకత కోసం వీడియోగ్రఫీ, వెబ్ […]

వజ్రం… ప్రపంచంలోనే అత్యంత విలువైన ఖనిజం… ఒక్క డైమండ్‌ ఉంటే రాజాలా బతికేయొచ్చు అంటుంటారు… అలాంటి వజ్రాల గనులు ఎక్కడో కాదు మన తెలంగాణలో ఉన్నాయని ఓయూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది… కృష్ణమ్మ పరుగుల కింద మిళ మిళ మెరిసే వజ్రాల గనులున్నట్టు ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో గుర్తించినట్టు జియోలాజికల్‌ శాస్త్రవేత్తలు తెలిపారు… కృష్ణా, మూసీ నదుల పరివాహక ప్రాంతాల్లో వజ్రాల గనులు ఉన్నాయంటున్నారు… నల్లమల అడవుల్లో అపార ఖనిజ […]

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నవీన్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్లకు గడువు ముగిసే సమయానికి మరో నామినేషన్ రాకపోవటంతో నవీన్ రావు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ఎలక్షన్ అధికారులు ప్రకటించారు. అసెంబ్లీ సెక్రటరీ నుంచి ఆయన ధృవీకరణ పత్రాలను అందుకున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికకు నవీన్ రావుతో పాటు మరో నామినేషన్ దాఖలైప్పటికీ..సంతకాలు లేకపోవటంతో రెండో నామినేషన్ ను తిరస్కరించారు. మే 31తో నామినేషన్లకు చివరి రోజు అయినా..ఇంకెవరు నామినేషన్ […]

తెలంగాణలో ఖాళీ అయిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ లో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ పారదర్శకత కోసం వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు 9 మంది అభ్యర్థులు పోటీలో […]

ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని..అంతమాత్రానికే అధైర్యపడొద్దని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలని నేతలకు సూచించారు. మెడికల్ చెకప్ కోసం అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చిన చంద్రబాబును తెలంగాణ టీడీపీ నేతలు కలిశారు…తెలుగు రాష్ట్రాల్లో ఎదురైన ఓటమికి కారణాలపై చర్చించారు. పార్టీ పునర్ నిర్మాణం కోసం త్వరలో కార్యచరణ సిద్ధం చేస్తామని సీనియర్ నేత రావుల చెప్పారు.. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామన్నారు.

రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఓ అమ్మాయి హృదయ విదారకమైన రోదన అందరి హృదయాలను కలిచివేస్తోంది. నాకు నా తండ్రి కావాలంటూ, కన్నీరుపెడుతూ ఘటనా స్థలం వద్దే భోరున విలపిస్తున్న బాలికను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని చెర్లపల్లిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కామినేని ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న సమయంలో వారిని డీసీఎం డీకొట్టింది. తలపైనుంచి టైర్‌ ఎక్కేయడంతో.. […]