మనసున్న ‘మల్లన్న’ సారు.. గుండెనొప్పిని భరిస్తూ బ్యాంకు దగ్గర ఉచితంగా..

రిటైర్మెంట్ వయసు దగ్గరపడుతూనే కాళ్ల నొప్పులు పలకరిస్తాయి. అనారోగ్య సమస్యలు ఏం చేయాలన్నా అడ్డంకిగా మారుతుంటాయి. గుండెకి ఓ సారి రిపేరు చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. సాయింత్రం అయితే దగ్గర్లో ఉన్న పార్కుకి వెళ్లి తన వయసు ఉన్న వారితో కాలక్షేపం. ఇంట్లో మనవడు,... Read more »

పొలంబాట పట్టిన కలెక్టర్‌ దంపతులు

ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్ రైతు సమస్యలు తెలుసుకునేందుకు పొలంబాట పట్టారు. జిల్లా అధికారిగా ఆయన వెళ్లడంలో ఎలాంటి ప్రత్యేకత లేదు.. కానీ ఆయన సతీమణి ప్రియాంక సైతం కూడా ఆయనతో పాటు.. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లడం విశేషం. అయితే ఆమె కూడా... Read more »

యువకుడిని తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి అతి దారుణంగా..

ఓ దొంగను చెట్టుకు కట్టేసి అతి దారుణంగా హింసించిన ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వెలుగుచూసింది. మెుబైల్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని స్ధానికులు తాడుతో చేట్టుకు వేలాడదీసి చితకబాదారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పోలీసులు... Read more »

తెలంగాణ సచివాలయ తరలింపు ప్రక్రియ వేగవంతం

విపక్షాలు విమర్శలు చేస్తున్నా.. కోర్టులో కేసులు నడుస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం మాటంటే మాటే అంటోంది.. కొత్త సచివాలయ నిర్మాణం దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది.. ఇందులో భాగంగా కీలకమైన సచివాలయ తరలింపు ప్రక్రియపై ప్రత్యేక దృష్టిపెట్టింది ప్రభుత్వం. పాలనలో ఎలాంటి ఇబ్బందులు... Read more »

ప్రవీణ్‌లాగే…ఆ దోషులకు త్వరగా శిక్ష పడాలంటే..

వరంగల్‌లో 9 నెలల చిన్నారిని అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ దారుణం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఆ దుర్మార్గుడు కనిపిస్తే చంపేయాలన్న కసితో రగిలిపోయారు. పసిమొగ్గను చిదిమేసినవాడిని ఉరి తీయాల్సిందేనంటూ నినదించారు. సరిగ్గా... Read more »

ఆందోళనలో పాల్గొన్న హీరో రాజశేఖర్

NMC బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్‌ డాక్టర్లు చేస్తున్న ఆందోళనకు.. టాలీవుడ్‌ హీరో.. డాక్టర్‌ రాజశేఖర్‌ మద్దతు పలికారు. కుటుంబ సమేతంగా ఇందిరా పార్క్‌కు వచ్చిన ఆయన… డాక్టర్లకు సంఘీభావం ప్రకటించారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో తాను మెడిసిన్‌ పూర్తి చేశానని… వైద్య విద్యార్థుల వాదనతో... Read more »

రూల్స్ పాటిస్తున్నారా.. అయితే మీకు సినిమా..

రూల్స్ పాటించండి బాబు.. మాకు సినిమా చూపించకండి.. కావాలంటే మీకే మేము సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తాం అంటున్నారు హైదరాబాద్ నగర పోలీసులు. హెల్మెట్ పెట్టుకోండి.. స్పీడుగా వెళ్లకండి.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి.. సిగ్నల్స్ క్రాస్ చేయకండి.. లైసెన్స్ లేకుండా బండి నడపకండి..... Read more »

తొమ్మిది నెలల చిన్నారిని చిదిమేసిన రాక్షసుడికి మరణ శిక్ష

అభం శుభం తెలియని పసి మొగ్గని నెలల ప్రాయంలోనే తుంచేసిన కిరాతకుడికి.. మరణశాసనం రాసింది న్యాయస్థానం.. తొమ్మిది నెలల చిన్నారిని చిదిమేసిన నరరూప రాక్షసుడికి అందరూ కోరుకున్న శిక్ష పడింది. కళ్లు తెరిచి లోకాన్ని కూడా చూడలేని వయసు.. బాధ, సంతోషం ఏమీ తెలియని... Read more »

క్రికెట్ బెట్టింగ్ మాఫియా వేధింపులకు డిగ్రీ విద్యార్థి బలి

క్రికెట్ బెట్టింగ్ మాఫియా వేధింపులకు డిగ్రీ విద్యార్థి బలైపోయాడు. వాళ్లకు డబ్బులు చెల్లించలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూసైడ్ నోట్‌లో రాజశేఖర్ అనే వ్యక్తి పేరు రాసినట్టు గుర్తించిన పోలీసులు..... Read more »

జోరు వానలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి పోటెత్తుతున్న వరద

భారీ వర్షాలకు తెలంగాణలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి వరద పోటెత్తుతోంది. మేడిగడ్డ బ్యారేజీ 40 గేట్లను ఎత్తి 2లక్షల 91 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. అటు అన్నారం బ్యారేజీ పూర్తి నీటి సామర్థ్యం 10.8 టీఎంసీలు కాగా... Read more »

వరద ఉధృతి.. నీటిలో కొట్టుకుపోయిన యువకుడు

ములుగు జిల్లా ధర్మారం చెరుకూరులో అదృష్టవశాత్తూ ఓ యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు నీటిలో చిక్కుకుపోయిన యువకుడ్ని స్థానికులు ప్రాణాలకు తెగించి కాపాడారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. వాజేడు మండలం ధర్మారం గ్రామం దగ్గర ఉన్న వంతెనపై నీరు ప్రవహిస్తోంది.... Read more »

మద్యం మత్తులో ఎస్‌ఐ హల్‌చల్‌

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో మహారాష్ట్ర ఎస్‌ఐ మద్యం మత్తులో హల్‌చల్‌ చేశాడు. వాంకిడి మండలంలోని గణేష్‌పుర్‌ గ్రామంలోని పశువుల సంతలో వ్యాపారులను బెదిరించే ప్రయత్నం చేశాడు. తనదగ్గర ఉన్న రివాల్వర్‌తో లారీ డ్రైవర్లను ఆపి.. పశువులను ఎక్కడికి తరలిస్తున్నారని.. తన పర్మిషన్‌ తీసుకోకుండా ఎలా... Read more »

భారీ వర్షాలు.. కోటి రూపాయలకు పైగా వేతనాలను కోల్పోయిన కార్మికులు

భారీ వర్షాలకు తెలంగాణలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోకి వరద పోటెత్తుతోంది. మేడిగడ్డ బ్యారేజీ 40 గేట్లను ఎత్తి 2లక్షల 91 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. అటు అన్నారం బ్యారేజీ పూర్తి నీటి... Read more »

టీవీ నటుడు మధు ప్రకాశ్‌ అరెస్ట్

టీవీ నటుడు మధు ప్రకాశ్‌ భార్య భారతి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. భారతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మధు ప్రకాశ్‌ను అరెస్టు చేశారు. భారతిని మధుప్రకాశే హత్య చేశాడని.. వారు ఆరోపిస్తున్నారు. రెండేళ్ల నుంచి తమ కూతురిని వేధిస్తున్నారని వారు... Read more »

ఓవర్ లోడ్ నావల్ల కాదు.. బస్సు దిగిన డ్రైవర్

బస్సులు తక్కువ ప్రయాణీకులు ఎక్కువ. వచ్చిన ఒక్క బస్సు కూడా వెళ్లిపోతే ఎలా. సీటు దొరక్కపోయినా పర్లేదు. బస్సు వస్తే చాలు. వచ్చిన ఆ బస్సుని వదలకుండా ఎక్కేశారు ప్రయాణీకులంతా. దాంతో ఓవర్ లోడ్ అయిపోయింది బస్సు. నా వల్ల కాదు ఇంత మందిని... Read more »

గోదావరి ప్రవాహాన్ని చూసి పులకించిన కేసీఆర్‌

రాష్ట్రంలో కోటీ 20 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమని కేసీఆర్‌ పేర్కొన్నారు.. అడ్డంకులను అధిగమించి అద్భుతాన్ని ఆవిష్కరించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి.. హెలికాప్టర్‌ ద్వారా ఏరియల్‌ సర్వే... Read more »