తెలంగాణ

తెలంగాణ

మున్సిపల్ మంత్రిగా ఈ ఎన్నికలు నాకు సవాల్: కేటీఆర్

కాంగ్రెస్‌ పరిపాలనలో చెత్త మున్సిపాలిటీలు.. TRS పాలనలో కొత్త మున్సిపాలిటీలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చడంలో గత ప్రభుత్వాలు విఫలయ్యాయన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారని మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్‌ అన్నారు. ఆచరణ సాధ్యంకాని అంశాలను మేనిఫెస్టోలో పెట్టి తెలివి తక్కువతనం ప్రదర్శనిస్తున్నారని వ్యాఖ్యానించారు. పచ్చదనం-పారిశుధ్యం తమ ప్రధాన అంశమన్నారు. […]

కమిషన్ల కోసమే కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు: కిషన్ రెడ్డి

  దేశం బాగుండాలంటే ఎర్రకోటపై .. రామగుండం బాగుండాలంటే కార్పొరేషన్‌పై కాషాయం జెండా ఎగరాలన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్‌ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు గుప్పించారు. కమిషన్ల కోసమే సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. రామగుండం అభివృధ్ధికి కేంద్రం వంద కోట్ల నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. కేసీఆర్‌ మాటలు […]

ఏపీ, తెలంగాణ సీఎస్‌ల భేటీ.. విభజన సమస్యలపై చర్చ

గురువారం ఏపీ, తెలంగాణ సీఎస్‌లు భేటీ కానున్నారు. షెడ్యూల్‌ 9, 10లోని సంస్థల ఆస్తుల విభజనపై ఈ సమావేశంలో ముఖ్యంగా చర్చించనున్నారు. తెలంగాణ, ఏపీ సీఎంల భేటీకి కొనసాగింపుగా సీఎస్‌ల సమావేశం కానున్నారు. ఆస్తుల విభజన విషయంలో సీఎంల సమావేశంలో చర్చించిన అంశాలపై.. సీఎస్‌ల భేటీలో మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది. వెలగపూడి సచివాలయంలో జరిగే ఈ భేటీకి.. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు […]

ఏటీఎంని వెయ్యి అడిగితే.. పదివేలు ఇచ్చింది. జోక్ కాదు.. పూర్తిగా చదువు నీకే తెలుస్తుంది

దేవుడు వరం ఇచ్చాడేమో అన్నట్టుగా ATMలో ఎంటర్‌ చేసిన అమౌంట్‌కన్నా ఎక్కువగా డబ్బులొస్తే… ఎవరికైనా ఇంకేం కావాలి. ఇలాంటి ఘటన వరంగల్ జిల్లా కమలాపూర్‌లో జరిగింది. బస్టాండ్ సమీపంలోని ఇండియన్ వన్‌ ATM మిషన్‌ నుంచి వెయ్యి తీసుకుందామనుకునే వాళ్లకు 6 నుంచి 10 వేలు వచ్చిపడ్డాయి. మేటర్‌ మౌత్ పబ్లిసిటీ కావడంతో.. అందరూ ఎగబడి ATM ఖాళీ చేశారు. వ్యవహారం పోలీసుల […]

ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై.. పొంగల్‌ వేడుకల్ని సొంత రాష్ట్రం తమిళనాడులో ఘనంగా జరుపుకున్నారు. చెన్నైలో బంధు, మిత్రుల మధ్య ఉల్లాసంగా గడిపారు. తెలుగు ప్రజలతోపాటు.. తమిళనాడు వాసులకు తమిళిసై పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండేందుకు కృషి చేస్తానని తెలిపారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించారు తమిళిసై.  

భోగి వేడుకల్లో విదేశీయుల సందడి

వరంగల్‌ జిల్లాలో భోగి, సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. కాజీపేటలోని బాల వికాసలో వివిధ దేశాలకు చెందిన 18 మంది ప్రతినిధులు ముగ్గులు వేసి, గొబ్బెమ్మలు పెట్టి నృత్యాలు చేశారు. గంగిరెద్దు విన్యాసాలు తిలకించి పులకించిపోయారు. పంటలు ఇంటికి వచ్చిన వేళ సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఒక మంచి సంప్రదాయమని.. వేడుకల్లో పాల్గొనడం తమకు ఆనందంగా ఉందని విదేశీయులు మురిసిపోయారు.  

నల్గొండ జిల్లాలో ఉచ్చులో పడ్డ చిరుత

నల్గొండ జిల్లాలో ఓ చిరుత ఉచ్చులో పడింది. మర్రిగూడ మండలం అజలాపురం సమీపంలో ఉన్న పొలాల్లో వేరుశనగను కాపాడుకునేందుకు కొందరు ఉచ్చులు వేశారు. ఈ క్రమంలో ఓ చిరుత ఉచ్చులో పడింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం ఇచ్చారు.  

హైదరాబాద్‌కు తాకిన అమరావతి రాజధాని సెగ

అమరావతి రాజధానిగా సెగ హైదరాబాద్‌కు తాకింది. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధానిని కొనసాగించాలని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో భోగి మంటలు వేశారు. జీఎస్ రావు ,బొస్టన్ కమిటీ నివేదికలను భోగి మంటల్లో వేస్తూ సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేశారు. గ్రీన్ క్యాపిటల్‌గా రూపుదిద్దుకుంటున్న అమరావతిని కాపాడాలంటూ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అంటూ నినాదాలు […]

కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కైట్‌ అండ్‌ స్వీట్‌ ఫెస్టివల్‌ను మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. ఈ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. 25 రాష్ట్రాలు, 20 దేశాల నుంచి కైట్‌ ప్లేయర్స్‌ తరలివచ్చారు. కైట్‌ ఫెస్టివల్‌తో పాటు వెయ్యికి పైగా మిఠాయిలు కొలువుదీరాయి. అన్ని రాష్ట్రాల మిఠాయిలు, స్నాక్స్‌తో స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ఒక మినీ […]

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ.. కీలక నిర్ణయాలివే..

విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అయ్యారు. ఏపీ సీఎం జగన్‌ వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ వచ్చారు. కేసీఆర్ ఆయనకు ఘనస్వాగతం పలికారు. జగన్ ప్రతినిధి బృందంతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు దాదాపు 6 […]