తెలంగాణ శాసన మండలిలో ప్రాజెక్టులపై వాడివేడి చర్చజరిగింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా దక్కని పాపం కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు మంత్రి హరీష్ రావు. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి, ప్రాణహిత చేవెళ్లను ఎందుకు విస్మరించారని నిలదీశారు. ప్రాజెక్టులపై తప్పుడుకేసులు పెట్టిన ఘనత కాంగ్రెస్‌దే అంటూ మండిపడ్డారు. Also watch :

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై వాడీవేడీ చర్చ జరిగింది. సీఎం కేసీఆర్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉండగా.. ఇప్పుడు ఆరేళ్లకే దివాలా తీసిన ప్రభుత్వంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని ఆరోపించారు భట్టి. భట్టి వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు సభను తప్పుదోవ పట్టించడం మంచిది కాదని హితవు పలికారు. చాలా మంది ఆర్థిక […]

ఏం.. కొమ్ములొచ్చాయా.. చెప్పిన మాట వినట్లేదు.. అందో ఏమో వాళ్ల అమ్మ చిన్నప్పుడు.. పాపం నిజంగానే తల మీద కొమ్ములు కాదు కానీ.. కొమ్ము వచ్చి ఇబ్బంది పడుతున్నాడు మధ్యప్రదేశ్ రాహి గ్రామానికి చెందిన శ్యామ్‌లాల్. కొన్నాళ్ల క్రితం తలకు దెబ్బతగిలిందని ఆసుపత్రికి వెళ్లాడు శ్యామ్‌లాల్. వైద్యులు చికిత్స అందించడంతో నొప్పి తగ్గింది కానీ విచిత్రంగా కొమ్ములాంటి ఆకారం ఒకటి తలపై పెరుగుతూ వచ్చింది. మళ్లీ ఆసుపత్రికి ఏం వెళతాంలే […]

వేరే మహిళతో సహజీవనం చేస్తున్న భర్తకు బడితె పూజ చేసింది భార్య. రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుని పతిని చితకబాదింది. తన భర్త వేరే మహిళతో ఓ ఇంట్లో సహజీవనం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న భార్య.. కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి చేరుకుంది. భర్తను చితకబాది నిలదీసింది. అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సుభాష్‌ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

ద్విచక్ర వాహనదారులకు పోలీసు ఉన్నతాధికారులు బంపర్ ఆఫర్ ఇచ్చారు. హెల్మెట్ ధరించి బైక్ నడిపితే ఇతర పత్రాల కోసం వారిని తనిఖి చేయవద్దని ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. హెల్మెట్ ఖచ్చితంగా వాడాలన్న ఉద్దేశ్యం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. బైక్ యాక్సిడెంట్ లో మేజర్ మరణాలు హెడ్ ఇంజ్యూరీ వలెనే జరుగుతున్నాయని.. అడ్డుగా భావించి కొందరు హెల్మెంట్ ధరించడంలేదు.. దాంతో […]

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమన్నాయి. పెట్రోల్ పై 9 పైసలు, డీజిల్ పై 10 పైసలు పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.76.51కు చేరగా.. డీజిల్ ధర రూ.71.26కు పెరిగింది. అమరావతిలో పెట్రోల్ రూ.76.25 , డీజిల్‌ ధర రూ.70.66కు ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.26 శాతం తగ్గి.. 60.22 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ […]

నవమాసాలు మోసి కన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచి పెద్ద చేశారు. వారిని ప్రయోజకులను చేశారు. వృద్ధాప్యంలో…కన్నపేగు తమకు తోడునీడగా ఉంటుందని కలలు కన్నారు దంపతులు. కానీ వారి కలలన్నీ కల్లలు చేశారు కసాయి కొడుకులు. కన్న కొడుకులే కాదు పొమ్మన్నారు. సంపాదించిన ఆస్తిని సొంతం చేసుకుని ఇప్పుడు నిలువు నీడ లేకుండా చేశారు. బుక్కెడు అన్నం పెట్టకుండా తల్లిదండ్రులను రోడ్డున పడేశారు. హృదయ విదారకర ఘటన మంచిర్యాల […]

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి, మాజీ ఐఏఎస్‌ అధికారి బీఎన్‌ యుగంధర్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శుక్రవారం మృతి చెందారు. 1962 బ్యాచ్‌కు చెందిన యుగంధర్‌.. సుధీర్ఘ కాలం సేవలు అందించారు. పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పీఎంవో కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం సభ్యుడిగా పలు కీలక హోదాల్లో పని చేశారు. అలాగే గ్రామీణాభివృద్ధి శాఖలో కీలక […]

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశ్రమలు, ఐటీరంగంలో అనేక కంపెనీలు ప్రభుత్వంతో చర్చిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా పుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, ఎలక్ర్టానిక్స్, లాజిస్టిక్స్, ఐటి రంగాల్లో రానున్న కొన్ని నెలల్లోనే భారీ పెట్టుబడులు రానున్నాయని మంత్రి చెప్పారు. పరిశ్రమలు, ఐటీ శాఖ విభాగాధిపతులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.. రాష్ట్రవ్యాప్తంగా టీఎస్‌ ఐఐసీ చేపట్టిన ఫార్మాసిటీ, జహీరాబాద్‌ […]

సింగరేణిలో టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం TBGKS కు గట్టి షాక్‌ తగిలింది. వ్యవస్థాపక అధ్యక్షుడు కేంగర్ల మల్లయ్యతో పాటు 11 డివిజన్లలోని కేంద్ర ఉపాధ్యక్షులు, డివిజన్‌ ఇంఛార్జులు.. ఇతర నాయకులు రాజీనామా చేశారు. తమ రాజీనామాలను మెయిల్‌ ద్వారా TBGKS గౌరవ అధ్యక్షురాలు కవితకు పంపించినట్లు తెలిపారు. సింగరేణిలో TBGKS పురుడు పోసుకున్నప్పటి నుంచి సంఘం బలోపేతానికి కృషి చేశానని మల్లయ్య వెల్లడించారు. చీమల పుట్టలో పాములు చేరినట్టు […]