ఆడపడుచుల కడుపు మంట చల్లారింది.. డప్పులు వాయిస్తూ విజయవాడ కాలేజీ అమ్మాయిలు సంబరాలు చేసుకున్నారు. దిశ హత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటినుంచి అమ్మాయిల రక్తం ఉడికి పోయింది. కనిపిస్తే కనికరం చూపకుండా కాల్చిపడేయాలన్న కసితో ఉన్నారు. ఎట్టకేలకు ఎన్‌కౌంటర్ జరిగి నలుగురు నిందితులు హతమయ్యారు. ఈ ఘటనతో మరో మృగాడు ఆ ఆలోచన చేయడానికి కూడా వణికి పోతాడని సంతోషిస్తున్నారు. అయితే దిశ ఘటన జరిగిన తరువాత పదుల సంఖ్యలో […]

దిశ ఘటనతో దేశవ్యాప్తంగా జనం రగిలిపోయారు. ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఊరూవాడా ఆందోళనలకు దిగారు. మీ వల్ల కాకపోతే మాకు అప్పగించండి… వాళ్లను చంపేస్తామంటూ నినాదాలు చేశారు. దిశను దారుణంగా హత్యచేసిన వారిని నిల్చోబెట్టి కాల్చేయాలన్న కసి జనంలో కనిపించింది. వాళ్లను నిర్దాక్షిణ్యంగా ఉరివేయాలని ప్రతి భారతీయుడు కోరుకున్నాడు. దిశ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా వాళ్లు […]

పోలీసులు తమకు అన్యాయం చేశారన్నారు దిశ నిందితుడు చెన్నకేశవులు భార్య. నేరం చేసిన ఎంతోమందిని ఏళ్ల తరబడి జైళ్లలో పెట్టి పెంచుతున్నారని,కానీ తన భర్తను ఇలా చంపేశారని ఆమె అన్నారు. Also watch:

ఇంత త్వరగా తమ బిడ్డకు న్యాయం జరుగుతుందని అనుకోలేదన్నారు దిశ తల్లి. తప్పుచేసేముందు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేదికాదన్నారు. తన కూతురు కొవ్వొత్తిలా కరిగిపోయి దేశాన్ని కదిలించిందన్నారు. మరొకరు ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా పోలీసులు సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ పోలీసులను దిల్లీ పోలీసులు ఆదర్శంగా తీసుకొని నిర్భయ నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు విజ్ఞప్తిచేశారు.

ఏడేళ్ళైనా నిర్భయకు న్యాయం జరగలేదు.. ఏడు రోజుల్లోనే దిశకు న్యాయం జరిగింది.. తెలంగాణ పోలీసులను చూసి నేర్చుకోండి.. పార్లమెంటు దాకా పాకిన దిశ కేసు గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్లింది. మనసున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. దుర్మార్గులకు శిక్ష పడాల్సిందే అని గొంతు చించుకుని అరిచింది. బీఎస్పీ అధినేత్రి మాయావతి హత్యాచార నిందితులకు సరైన శిక్ష వేసిన హైదరాబాద్ పోలీసులను కొనియాడుతున్నారు. తెలంగాణ పోలీసులు దేశ పోలీసు వ్యవస్థకు […]

మీరు నిజంగా గ్రేట్.. ఇక ముందు కూడా ఇలాగే పని చేయాలి.. మృగాలన్నీ చచ్చిపోవాలి.. మంచి సమాజం రావాలి.. ఆడపిల్లని ఆబగా చూసే ఆ కళ్లను పీకెయ్యాలి. రెక్కలు విరిచి కుళ్లబొడవాలి.. మీ డ్యూటీ మీరు చేయండి సర్.. గుమ్మం దాటి బయటకు వెళ్తుంటే దిశ గుర్తుకు వస్తోంది. ఈ ఏడు రోజులు నిద్రలేని రాత్రులు గడిపాం.. ఈ రోజు ప్రశాంతంగా నిద్రపోతాం. పోలీసులు మనకోసం మేల్కొనే ఉంటారని సంతోషిస్తాం.. […]

దిశ హత్య కేసులో నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడంపై మహిళా లోకం హర్షిస్తోంది. నల్గొండ జిల్లాలో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలపై ఆకృత్యాలకు పాల్పడాలంటే భయపడేలా చేశారని అభిప్రాయ పడుతున్నారు. కామాంధుల ఎన్‌కౌంటర్‌తో ఇకనైనా మహిళలపై అత్యాచారాలు, హత్యలకు బ్రేక్‌ పడుతుందని ఆశిస్తున్నామని అన్నారు. తెలంగాణ పోలీసులు.. దిశకు నిజమైన ఘన నివాళిని ఇచ్చారని మహిళలోకం అభిప్రాయపడుతుంది. స్పాట్‌కు వెళ్లిన పోలీసులపై స్థానికులు పూలవర్షం కురిపించారు.

మంచి పని చేశారు.. మృగాళ్లకు సరైన శిక్ష విధించారు. ఇన్ని రోజులుగా దిశ ఆత్మ ఎంతగా క్షోభించి ఉంటుందో.. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతుంది. మరే ఆడపిల్లకు ఇలాంటి దుస్థితి రాకూడదని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు దిశ తల్లిదండ్రులు. దిశ హత్యాచార ఉదంతం దేశం మొత్తాన్ని కదిలించింది. ప్రతి ఒక్కరూ నిందితులను ఉరి తీయాలని కోరుకున్నారు. మరొకడు ఇలాంటి చేయడానికే భయపడే రోజు రావాలంటే వెంటనే శిక్ష అమలు చేయాలని […]

హైదరాబాద్‌ శివార్లలో నవంబర్‌ 27వ తేదీన దిశను హత్యాచారం చేశారు నలుగురు నిందితులు. ఆ స్కూటీకి పంచర్‌ ఏపిస్తామంటూ నమ్మించి.. నరరూప రాక్షసుల్లా ప్రవర్తించారు. ఆమె ఫోన్‌ కాల్‌ ఆధారంగా పోలీసులు విచారణ సాగించారు. కొన్ని గంటల్లో నిందితులను గుర్తించారు. 28వ తేదీన ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్.. నలుగురినీ పట్టుకున్నారు. ఆ తర్వాతి రోజు.. షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో వారిని విచారణ చేశారు. ఆ టైమ్‌లో పోలీస్‌స్టేషన్ బయట టెన్షన్‌ […]

ఆ రాక్షసుల పాపం పండింది. దిశను తగులబెట్టిన చోటే.. ఆ నలుగురూ హతమయ్యారు. దిశపై అతి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి.. ఆధారాలు దొరకకూడదనే ఉద్దేశంతో.. ఆమెను ఏకంగా హత్య చేసిన దుర్మార్గులు.. అదే స్పాట్‌ దగ్గర హతమయ్యారు. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర దిశను తగులబెట్టిన స్పాట్‌కు.. జస్ట్ అర కిలోమీటర్ దూరంలో వారి ఎన్‌కౌంటర్‌ జరిగింది. హైద్రాబాద్‌ శివార్లలోని తొండుపల్లి టోల్‌గేట్‌ దగ్గర.. నవంబర్‌ 27న అత్యంత […]