ఆర్టీసీపై ఎలా ముందుకెళ్లాలన్నదానిపై మరోసారి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా సోమవారం హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. సమ్మె విరమించాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీకి, గుర్తింపు పొందిన ట్రేడ్‌ యూనియన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఉస్మానియా వర్సిటీ విద్యార్థితో పాటు, మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. అవి […]

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మిక నేతలు పిలుపిచ్చిన చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల అనుమతివ్వకపోయినా.. భారీ సంఖ్యలో కార్మికులు, వివిధ సంఘాల నేతలు, విపక్ష పార్టీల నేతలు ట్యాంక్‌బండ్‌కు చేరుకునే ప్రయత్నం చేశారు. వారందరనీ పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా.. కొందరు కార్మికులు మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల నుంచి […]

మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. ఆర్టీసీ కార్మికులు పిలుపు ఇచ్చిన ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇతర బీజేపీ నేతలతో కలిసి ఆయన ట్యాంక్‌బండ్‌వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు వాగ్వాదానికి దిగారు.. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో.. జితేందర్‌ రెడ్డితో పాటు ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు, కార్మికనేతలు చలో ట్యాంక్‌బండ్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి లభించలేదు. దీంతో పోలీసులు శుక్రవారం నుంచే కార్మికులు, కార్మిక నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే కొందరు కార్మికులు మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ వద్దకు ఆందోళనకారులు చేరుకున్నారు. వందల మంది కార్మికులు అకస్మాత్తుగా వచ్చి నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. కొద్ది […]

ఆర్టీసీ సమ్మె, హైకోర్టు వ్యాఖ్యలు, కార్మిక సంఘాల చలో ట్యాంక్‌బండ్‌ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం కేసీఆర్‌ మరోమారు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటలపాటు సాగిన సమావేశంలో అనేక అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా గురు, శుక్రవారాల్లో హైకోర్టులో జరిగిన విచారణ వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. 5100 ప్రైవేటు బస్సులకు పర్మిట్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు స్టే విధించడంతో […]

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు బ్రేకులు పడడం లేదు. ప్రభుత్వం పట్టు వీడకపోవడం.. కార్మికులు మెట్టు దిగకపోవడంతో సమ్మె తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలతో కార్మికులు హోరెత్తిస్తున్నారు. సమ్మెను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఆర్టీసీ సంఘాలు చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపిచ్చింది. మిలియన్ మార్చ్‌ తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జేఏసీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు పార్టీల నేతలు కూడా చలో ట్యాంక్‌ బండ్‌కు మద్దతు తెలిపారు. దీంతో జిల్లాల నుంచి […]

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భారీగా పాత కరెన్సీ పట్టుబడడం కలకలం రేపింది. నోట్లు మార్చేందుకు హైదరాబాద్ నుంచి కోదాడకు తరలించినట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం రూ.9 లక్షల 95వేల నగదును సీజ్ చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి ద్విచక్ర వాహనం, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందుతులు సామ్యేల్, కపిల్, ఇంతియాజ్‌లలో ఒకరు బ్యాంకు ఉద్యోగిగా ఉన్నట్టు భావిస్తున్నారు.

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో సురేష్ భార్య లత.. సంచలన అంశాలు వెల్లడించింది. చనిపోవడానికి ముందు ఆస్పత్రిలో.. భార్యతో మాట్లాడిన సురేష్ పలు కీలక అంశాలు చెప్పినట్టు తెలుస్తోంది. తన భర్త తహసీల్దార్‌పై దాడి చేయాలనే ఉద్దేశంతో వెళ్లలేదని.. ఆత్మహత్యాయ్నం చేసి భయపెట్టాలనుకున్నాడని తెలిపింది. అయినా.. విజయారెడ్డి వినకపోవడంతో ఆమెనూ చంపాలనుకున్నాడని వెల్లడించింది. తన భర్త లాంటి చావు మరే రైతుకు రాకూడదని ఆవేదన వ్యక్తం చేసింది. భూముల వ్యవహారంలో […]

శనివారం ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. మిలియన్ మార్చ్‌ తరహాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తోంది జేఏసీ. పలు పార్టీల నేతలు కూడా మద్దతు తెలిపారు. దీంతో జిల్లాల నుంచి ఇప్పటికే పెద్ద ఎత్తున కార్మికులును హైదరాబాద్ తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడిక్కడ నిర్భందాలు చేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు.. పలు పార్టీల నాయకుల్ని కూడా అదుపులోకి […]

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు విచారణ జరిపింది. ప్రైవేటీకరణను ఆపాలంటూ ప్రొఫెసర్‌ PL విశ్వేశ్వర్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈనెల 11 వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది. 5 వేల ఒక వంద రూట్లలో ప్రైవేటీకరణ నిలిపివేసేలా చూడాలని పిటిషనర్‌ కోరారు. అటు.. కేబినెట్ ప్రొసీడింగ్స్ సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. ఆర్టీసీ కార్పొరేషన్ కూడా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి […]