ఖమ్మంలో ఆర్టీసీ కండక్టర్‌ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. శ్రీనివాస్‌ రెడ్డి అనే కండక్టర్‌ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో ఆయన శరీరం 90 శాతం కాలిపోయింది. సమ్మెపై ప్రభుత్వ వైఖరితో మనస్తాపం చెంది శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కార్మికులు ఆరోపిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బస్‌భవన్‌ ముందు నిరనస చేపట్టిన బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు స్వల్ప గాయమైంది. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న లక్ష్మణ్‌తో పాటు ఆర్టీసీ జేఏసీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అందరినీ బలవంతంగా జీపుల్లోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తుండగా.. లక్ష్మణ్‌ కంటికి గాయమైంది. నియంతృత్వ కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తాము పోరాడుతామని హెచ్చరించారు. ఈ సమ్మెకు ప్రజలు, అన్ని వర్గాలు మద్దతు తెలపాలని లక్ష్మణ్‌ […]

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజురోజుకూ ఉధృతరూపం దాల్చుతోంది. ఇప్పటికే విపక్షాల మద్దతు కూడగట్టుకున్న ఆర్టీసీ జేఏసీ రేపటి నుంచి ఈనెల 19 వరకు రోజుకో విధంగా నిరసన తెలపాలని నిర్ణయించింది. ఈ నెల 19న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. మరోవైపు.. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కూడా సీరియస్‌గానే స్పందిస్తోంది. ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించిన కేసీఆర్‌.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం 50 […]

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనంపై మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదన్నారు. ప్రజలపై సమ్మెను రుద్దడం సరికాదన్న మంత్రి.. పండగ వేళ ప్రజల్ని గమ్యస్థానాలకు చేర్చడంలో సఫలీకృతం అయ్యామన్నారు. సంప్రదింపుల నుంచి వైదొలగింది కార్మిక సంఘాలేనని ఆరోపించారు. సమ్మె చట్టవిరుద్ధమని ఇప్పటికీ చెబుతున్నాట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌ 5 నాటికి విధుల్లో ఉన్నవారే ఆర్టీసీ ఉద్యోగులని పునరుద్ఘాటించారు. ఆర్టీసీ […]

హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో పాము కలకలం సృష్టించింది. సడెన్‌గా పాము కనిపించడంతో పోలీసులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌ పామును చాకచక్యంగా పట్టుకుని క్యాన్‌లో బంధించారు. ఆ తర్వాత పామును స్నేక్‌ సొసైటీ వారికి అందించారు.

హైదరాబాద్‌ డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ లక్ష్మీని అరెస్ట్‌ చేశారు ఏసీబీ అధికారులు. బ్లడ్‌ బ్యాంక్‌కు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు బంగారం రూపంలో లంచం తీసుకుంటుండగా.. లక్ష్మీని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో ఇదే బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి ఆమె 50 వేలు లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది.

నాగుపాము కాటుకు రెండు కుక్క పిల్లలు ప్రాణాలు కోల్పోయాయి. నిద్రిస్తున్న కుక్క పిల్లలను చుట్టుముట్టిన పాము.. బుసలు కొడుతూ కుక్క పిల్లలపై పంజా విసిరింది. దీంతో రెండు కుక్క పిల్లలు స్పాట్‌లోనే చనిపోయాయి. ఎల్‌బీనగర్‌లోని నాగోల్‌ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. తన పిల్లలకు అపాయం తలపెడుతుందన్న విషయం తెలుసుకున్న తల్లి కుక్క.. ఘటనా స్థలానికి చేరుకుని అరవడం మొలుపెట్టింది. గట్టిగా అరుస్తూ పామును తరిమేందుకు ప్రయత్నించింది. […]

తెలంగాణ విద్యార్థి వేదిక టీవీవీ నాయకుల అరెస్ట్‌లు కలకలం రేపుతున్నాయి. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై స్టూడెంట్ మార్చ్‌ పత్రిక ఎడిటర్‌, ప్రొఫెసర్‌ జగన్‌ను నిన్న గద్వాల పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే ఇదే కేసులో నాగరాజు అలియాస్‌ నాగన్నను అరెస్ట్‌ చేయగా.. నాగరాజును చూసేందుకు వచ్చిన వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన బలరాంను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులుగా అలజడి రేపుతున్న టీవీవీ నాయకుల అరెస్ట్‌పై […]

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రంగా సాగుతోంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. తమ సమ్మెకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు కూడగట్టే పనిలో పడింది ఆర్టీసీ జేఏసీ. కాంగ్రెస్‌, బీజేపీ, టీటీడీపీ నేతల్ని కలిసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు. సంస్థను కాపాడుకునేందుకు, తమ న్యాయమైన డిమాండ్లు […]

భాగ్యనగరంలో కుండపోత వానలు కొనసాగుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. పలు రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. అల్వాల్‌లోని టెలికాం కాలనీలో అత్యధికంగా 10.6 సెం.మీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో గత కొద్ది రోజులుగా కుండపోత వానలు కురుస్తున్నాయి. అమీర్‌పేట, బేగంపేట, […]