సమాజంలో రోజు రోజుకి మానవ మృగాల ఆరాచకాలను అంతుపోంతు లేకుండా పోతుంది. వావి వరసలు, చిన్న పెడ్డా అనే తేడా లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు మృగాళ్లు. పదుల వయసు నిండిన పోరగాళ్ల నుంచి పండు ముసలోళ్ల వరకు అన్యం, పుణ్యం ఎరుగని అమాయకపు చిన్నారులపై తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా కేంద్రంలో పురాణిపేటలో కన్నుమిన్ను అనకుండా 15 ఏళ్ల మనువరాలిని చెడబట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ […]

హైదరాబాద్‌లో ఇద్దరు దొంగలు ఏటీఎంకి కన్నం వేద్దామనుకున్నారు. దాన్ని బద్దలుకొట్టేసి, డబ్బులు ఎత్తుకుపోయేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఐనా కుదర్లేదు. చివరికి నిరాశగా బయటకు వచ్చేశారు. ఎలాగూ దొంగతనం చేయాల్సిందేనని గట్టిగా ఫిక్సై వచ్చారు కాబట్టి ATMలో డబ్బు దొరక్కపోతేయేం అనుకున్నారు. అక్కడే పార్క్ చేసిన ఓ బైక్‌ చోరీ చేసి పరారయ్యారు. బాగానే తప్పించుకున్నామని రిలాక్స్ అయ్యారు. కట్ చేస్తే.. ప్రస్తుతం ఆ ఇద్దరూ జైల్లో ఊచలు లెక్కపెడుతున్నారు. మీర్‌చౌక్‌ […]

రాష్ట్ర ప్ర‌భుత్వం ఆరోగ్య శ్రీ ప‌థ‌కం అమ‌లు చేయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిష‌న్ రెడ్డి విమ‌ర్శించారు. సికింద్రాబాద్‌ బ‌న్సీలాల్ పేట డివిజ‌న్ బండ‌మైస‌మ్మ బ‌స్తీలో ఏర్పాటు చేసిన కృత‌జ్ఞ‌త స‌భ‌లో ఆయ‌న పాల్గొన్నారు. పేద‌ల‌కు డ‌బ‌ల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇవ్వ‌లేక పోయార‌ని దీంతో ఇల్లులేని పేద ప్ర‌జ‌లు అవస్త‌లు ప‌డుతున్నార‌న్నారు. బ‌న్సీలాల్ పేట‌లోని 450 కుటుంబాల‌కు డ‌బ‌ుల్ బెడ్రూం ఇళ్లు క‌ట్టివాల‌ని […]

అతను మద్యానికి తీవ్రంగా బానిసయ్యాడు. భార్యతో తరుచుగా గొడవలు పడేవాడు. చివరికి ఆ మద్యం మత్తులోనే ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అందరూ చూస్తుండగానే పైనుంచి దూకాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా చేర్యాల మండలం కడవేరుగు గ్రామంలో జరిగింది. వాటర్‌ ట్యాంక్‌పై నుంచి దూకిన వ్యక్తి పేరు యాదగిరి. తన కుటుంబంతో హైదరాబాద్‌లో నివసిస్తూ ఉంటాడు. వనభోజనాల కోసం సొంతూరికి వచ్చాడు. అప్పటికే పీకలదాకా తాగిన […]

తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌. రాష్ట్రాన్ని సీఎం అవినీతిమయంగా మార్చారని.. రాబందుల్లా దోచుకుంటున్నారని విమర్శించారు. కరీంనగర్‌లో గ్రానైట్‌, ఇసుక మాఫియా సహజ సంపదను దోచేస్తోందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. కల్వకుంట్ల కుటుంబం పాలైందన్నారు. పేదల సంక్షేమ స్కీంలన్నింటిలో స్కాంలే ఉన్నాయన్ని ఆరోపించారు. 15వందల కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించలేక వైద్యసేవలు నిలిపివేశారన్నారు.

టీఆర్‌ఎస్ మహిళా నేత నార్సింగి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అన్నపూర్ణను శంషాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను విజిలెన్స్‌ అధికారినంటూ.. కాటేదాన్‌లో ఓ పారిశ్రామిక వేత్తను బెదిరించినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. పారిశ్రామికవేత్త ఫిర్యాదుతో అన్నపూర్ణను విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత RGIA పోలీసులకు అప్పగించారు. అన్నపూర్ణను పోలీసులు విచారిస్తున్నారు.

జనగామలో బార్‌షాప్‌ యజమానులు రెచ్చిపోయారు. భోజనంలో రాళ్లు వచ్చాయని అడిగిన పాపానికి యువకులను చితకబాదారు. భువన్‌ బార్‌ యాజమానులు చేసిన దాడిలో చిటకోడూరు గ్రామానికి చెందిన మనోజ్, నితిన్‌, కనకరాజ్‌, శేఖర్ అనే యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అటు బాధితులకు న్యాయం చేయకపోగా బార్‌ యాజమానులకు పోలీసులు వస్తాదు పలికారు. దీంతో బార్‌ ముందు చిటకోడూరు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బార్‌ షాప్‌ యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ […]

ఆహా.. ఏం తెలివి.. పైసా ఖర్చులేకుండా ఎక్కడో ఉన్న రూంకి ఎంచక్కా వెళ్లిపోవచ్చు. అప్పటిదాకా ఇనార్బిట్ మాల్‌లో షాపింగ్ చేశాడు హైదరాబాద్‌కు చెదిన ఒబేష్ కొమిరిశెట్టి. బయటకొచ్చి చూస్తే టైమ్ చూస్తే రాత్రి 11.50 అయింది. క్యాబ్ బుక్ చేద్దామనుకుంటే అర్ధరాత్రి కావడంతో రేటు ఎక్కువ చూపిస్తుంది. అప్పుడే ఓ మెరుపులాంటి ఆలోచన అతడి బుర్రకు తట్టింది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఆకలి దంచేస్తుంది. జొమాటో యాప్ ఓపెన్ చేసి […]

తెలంగాణలో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాడ్డాయి. అదే సమయంలో కొత్త మున్సిపల్ చట్టం తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. అయితే..మున్సిపల్ ఎన్నికలను ఏ చట్టం ప్రకారం నిర్వహిస్తారు.? వార్డుల విభజన, రిజర్వేషన్లపై అభ్యంతరాలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారు? ఇదే అంశాలపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది హైకోర్టు. మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన పిటీషన్లపై విచారణ జరిపింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో నిబంధనలు అతిక్రమించి హడావుడిగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం […]

తెలంగాణకే తలమాణికంగా నిలిచేలా యాదాద్రి నవనిర్మాణం మహాయజ్ఞంలా కొనసాగుతోంది. ఆలయాన్ని ఆధ్యాత్మిక దివ్యరాజధానిగా చేయడానికి జరుగుతున్న పనులను పరిశీలించి దిశా నిర్ధేశం చేసేందుకు ఇవాళ సిఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. 2వేల కోట్ల రూపాయల ప్రాధమిక అంచనా వ్యయంతో ప్రారంభించిన నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 800 కోట్ల వరకు వెచ్చించి విస్తరణ పునర్నిర్మాణ పనులలో శిల్పి పనులు 95 శాతం పూర్తి చేశారు. పనుల్లో […]