హైదరాబాద్ సనత్‌నగర్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ పూర్ణిమ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పెళ్లైన 12 రోజులకే అత్తవారింట్లో పూర్ణిమ శవమై కనిపించడం సంచలనంగా మారింది. సూసైడ్ చేసుకుందని భర్త చెప్తుంటే.. కాదు చంపేశారని ఆమె తండ్రి ఆరోపిస్తున్నారు. ఇప్పుడీ కేసులో పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ బయటకు వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అలాగే డైరీలోదొరికిన లెటర్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి.. అది పూర్ణిమ […]

కొండెక్కిన ఉల్లి ధరలు ఓ వైపు వినియోగదారులకు కంటతడి పెట్టిస్తుంటే.. మరోవైపు అన్నదాతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్ర మార్కెట్లో ఈ ఏడాది క్వింటాల్‌కి రికార్డు స్థాయిలో 7నుంచి 8 వేల వరకు ధర పలికింది. ఎన్నడూ లేని విధంగా ఉల్లి పంటకు ధర రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమకు కాసుల పంట పండిందని తెలిపారు.

డాక్టర్‌ దిశ హత్యకేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో వీలైనంత త్వరగా నిందితులకు శిక్షలు అమలు చేయడంతోపాటు బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటైంది. హైకోర్టు సూచనలతో మహబూబ్‌నగర్‌ ఫస్ట్‌ అడిషనల్‌ సెషన్స్‌ జిల్లా కోర్టును ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దిశ కేసులో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో మహబూబ్‌నగర్‌ జిల్లా కోర్టుకు స్పెషల్ […]

విధులను నిర్వర్తించేందుకు ప్రతి ఒక్కరు మానసికంగా దృఢ చిత్తంతో సిద్ధంగా ఉండాలన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళి సై.. రాజ్‌భవన్‌లోని భారత స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర అసోసియేషన్‌ స్టేట్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. బెస్ట్‌ పర్ఫార్మెన్స్ కోసం స్కౌట్‌ విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పెద్ద పెద్ద సంస్థల్లో స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌లో విద్యార్థులను చేర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని సూచించారు. వివిధ జిల్లాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆమె […]

దిశ ఘటనతో హైదరాబాద్ మెట్రో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది..ఇకపై మహిళలు మెట్రోలో ప్రయాణించేటప్పుడు…రక్షణ కోసం తమ వెంట పెప్పర్ స్ప్రేను తీసుకెళోచ్చని ఆదేశాలు జారీచేసింది. ఇప్పటి వరకూ మెట్రోలో పెప్పర్ స్ప్రేలను అనుమతించేవారు కాదు. వీటికి త్వరగా నిప్పంటుకునే స్వభావం ఉండటంతో నిషేధం విధించారు. ఇప్పుడు పెప్పర్ స్ప్రేలను అనుమతించాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని మెట్రో రైలు ఎండీ NVS రెడ్డి తెలిపారు… ఇటీవల మహిళలపై దాడులు […]

దిశ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. కేసు విచారణను వేగవంతం చేసేందుకు ఫాస్ట్‌ కోర్టు ఏర్పాటు అయ్యింది.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబర్‌నగర్‌లో ఈ ఫాస్ట్‌ ట్రాక్‌కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మహబూబ్‌నగర్‌లోని 1వ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌‌, సెషన్స్‌ జడ్జికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు విధివిధానాలు నిర్ణయించిన తదుపరి […]

హైదరాబాద్‌ గోల్కొండ పరిధిలో వాహనదారులను భయబ్రాంతులకు గురి చేస్తూ.. వారి నుంచి నగదు, సెల్‌ఫోన్లు దోచుకుంటున్న ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రెండు వేల నగదు రికవరీ చేశారు. నిందితులపై పీడీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి కోర్టుకు రిఫర్ చేశారు. ఈనెల 2న నలుగురు యువకులు మద్యం సేవించి.. అర్థరాత్రి ఒంటరిగా వెళ్తున్న వాహన దారుడిపై దాడి చేశారు. ఆదే […]

నల్గొండ జిల్లా ధర్మాపురానికి చెందిన చింతరెడ్డి సాయిచరిత్ రెడ్డి బాంబే ఐఐటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల జరిగిన క్యాంపస్ సెలక్షన్లో అతడు మైక్రోసాప్ట్ కంపెనీకి మంచి ప్యాకేజీతో ఎంపిక అయ్యాడు. అతడికి ఏడాదికి కోటిన్నర జీతం ఇచ్చేందుకు కంపెనీ ముందుకొచ్చింది. తనతో పాటు మరో ముగ్గురు ఎంపిక కాగా చరిత్ తెలుగు వాడు కావడం మనకు గర్వకారణం.

డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్ చాలా అనువైన ప్రాంతమన్నారు మంత్రి KTR. కానీ కేంద్రం నాగ్‌పూర్‌, గుజరాత్, చెన్నైలను మాత్రమే పట్టించుకుంటోందని ఆరోపించారు. హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుపై కేంద్రంతో మాట్లాడినా.. అది చెన్నైకి వెళ్లిపోయిందన్నారు. హైదరాబాద్‌లో CII ఆధ్వర్యంలో నిర్వహించిన కాంక్లేవ్‌లో మాట్లాడిన KTR.. కేంద్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిస్తుండడం మంచి పరిణామం కాదన్నారు. ఈ ఐదేళ్లలో నలుగురు […]

  ఓవైపు దిశ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నా.. కొందరు కామాంధుల ఆగడాలు మితిమీరుతూనే ఉన్నాయి. స్నానం చేస్తున్న ఓ మహిళను వీడియో తీసేందుకు ప్రయత్నించిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 10లో ఉండే 19 ఏళ్ల ఫరూక్‌ ఇంటి పక్కన కొందరు యువతులు నివసిస్తున్నారు. వారిలో ఓ యువతి బాత్‌రూమ్‌లో స్నానానికి వెళ్లగా కిటికీలోంచి వీడియో తీసేందుకు ప్రయత్నించాడు ఫరూక్‌. ఈ విషయాన్ని గమనించిన […]