ప్రభుత్వం, కార్మిక సంఘాల పంతాలతో ఆర్టీసీ సమ్మె నెల రోజులు దాటింది. తాత్కాలిక సిబ్బందితో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా అవి ప్రయాణికుల అవసరాలను తీర్చలేకపోతున్నాయి. ఇదే అదనుగా ప్రైవేటు ట్రావెల్స్ జనాలను దారిదోపిడి చేసేస్తున్నారు. దీంతో సమ్మె క్లైమాక్స్ కోసం 48 వేల కార్మిక కుటుంబాలతో పాటు..ఇటు ప్రజలు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో గురువారం జరగనున్న విచారణపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ సమ్మెపై […]

కేబినెట్ మాటంటే మాటే. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక తిరుగుండదు అంటూ ఆర్టీసీ ప్రైవేటీకరణపై తమ వైఖరి కుండబద్ధలు కొట్టారు సీఎం కేసీఆర్. మంగళవారం అర్ధరాత్రిలోగా రిపోర్ట్ చేయకుంటే కార్మికులను విధుల్లోకి తీసుకోబోమని డెడ్ లైన్ తో డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. కానీ, సీఎం హెచ్చరికలకు కార్మికుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. రాష్ట్రంలో 400 మంది వరకు కార్మికులు తిరిగి విధుల్లో చేరారు. దీంతో డెడ్ లైన్ దిక్కరించిన కార్మికులపై […]

పలు కారణాలతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశంలో బాధిత కుటుంబాలకు బరోసా ఇచ్చారు. ఏ అవసరం వచ్చినా పార్టీ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. వారితో కలిసి భోజనం చేశారు మంత్రి కేటీఆర్. అంతకుముందు మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను మంత్రి కేటీఆర్ అందజేశారు. మొత్తం 80 మందికి సాయం అందించారు. ఒక్కొక్కరికి […]

అయ్యప్ప మాల వేసుకొని దీక్ష చేపట్టే పోలీసులు సెలవుపై వెళ్లాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీస్తున్నాయి. విధులకు హాజరయ్యే వారు తప్పకుండా యూనిఫాం ధరించాల్సిందేనని ఆయన పోలీసులను ఆదేశించారు. యూనిఫాం, షూ లేకుండా పోలీసులు విధులు నిర్వహించడం కుదరదని స్పష్టం చేశారు. క్రమశిక్షణ కలిగిన పోలీస్‌ శాఖలో ప్రత్యేక అనుమతులు ఇవ్వడం కుదరదని ఆయన పోలీసులకు సూచించారు. గడ్డాలు, మీసాలు పెంచి పోలీసులు […]

ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సుధీర్ఘంగా 9 గంటల పాటు రివ్యూ చేశారు. ఈ సమావేశం అనంతరం.. ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. అటు ఆర్టీసీ సమ్మె కేసులోనూ హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు అధికారులు. ఆర్టీసీ ఎండీ ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ నివేదిక ఇచ్చారు. రవాణాశాఖ మంత్రికి సెప్టెంబర్‌ 11నే ఆర్థిక అంశాలు వివరించామని తెలిపారు ఆర్టీసీ ఎండీ. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన […]

ఆర్టీసీ సమ్మె, సంస్థ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. సమ్మెను విరమించే ప్రసక్తేలేదని స్పష్టం చేశాయి కార్మిక సంఘాలు. ఆందోళనలు మరింత ఉద్ధృతం చేసేలా..రాజకీయ పార్టీలను కలిసి ప్రణాళికలు రూపొందిస్తోంది జేఏసీ. అటు ప్రభుత్వం తరపున హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు అధికారులు. గురువారం హైకోర్టు ఏం చెప్పబోతుంది అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆర్టీసీ సమ్మెపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టనుండటంతో…అధికారులు అఫిడవిట్లు సమర్పించారు. […]

మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ భారీ కసరత్తు చేస్తోంది. ఆప‌రేష‌న్ ఆకర్ష్‌కు తెరతీశారు. గ‌తంలో కీల‌కంగా ఉండి తటస్థంగా మారిన వారిని.. ఇత‌ర పార్టీల్లో అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బీజేపీ ముఖ్య నేత‌లు.. కొత్త‌వారితో క‌లిసి ప‌నిచేస్తే మున్సిపాలిటీలు కైవ‌సం చేసుకోవ‌చ్చ‌ని నేతల ఆలోచన. పట్టణాల్లో మౌలిక వ‌స‌తుల కొర‌త‌, ఇళ్ల ‌నిర్మాణంలో ప్ర‌భుత్వ అల‌స‌త్వంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి.. తమవైపు తిప్పుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌తి పౌరుడిని క‌దిలించేలా ప్రణాళికలు […]

కార్యకర్తల కుటుంబాలకు టీఆర్‌ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీకి 60లక్షల మంది సభ్యత్వం ఉండడం గర్వకారణమని, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం లేదన్నారు. మృతి చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలకు మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్‌లో భీమా చెక్కులు అందజేశారు. మిగతా వారికి త్వరలోనే ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి చెక్కులు అందజేస్తారని తెలిపారు. కార్యకర్తల కుటుంబాలతో […]

ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ పతనానికి నాంది పలుకుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. సీఎం కేసీఆర్ పట్టింపులకు పోకపోతే సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేదన్నారు. ప్రభుత్వానికి ఆర్టీసీ ఆస్తులపై ఉన్న ప్రేమ.. ఉద్యోగులపై లేదని విమర్శించారు. బీజేపీ నేతలపై దాడులు పెరగడంపైనా లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని.. త్వరలోనే పార్టీ తరపున కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఆర్టీసీ జేఏసీ నేతలు లక్ష్మణ్‌ను కలిసి.. […]

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య అనంతరం తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే మల్‌రెడ్డి రంగారెడ్డి బ్రదర్స్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హత్యకేసు నిందితుడి సురేశ్‌ కుటుంబ సభ్యుల నుంచి.. మల్‌రెడ్డి కుటుంబ సభ్యులు భూమి కొన్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి ఆరోపించారు. అన్ని రకాల ఆధారాలతో మీడియా ముందుకు వచ్చానన్నారు. సదరు 412 ఎకరాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే […]