తెలంగాణ

తెలంగాణ

మున్సిపల్ ఎన్నికలు : అభ్యర్థుల లిస్ట్‌ను ఇంకా ఫైనలైజ్‌ చేయ‌ని బీజేపీ

పుర పోరులో బీజేపీ స‌త్తా చాటాల‌ని చూస్తోంది. గ‌త నాలుగు నెల‌లుగా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ నేతలు పార్టీని బ‌లోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నేత‌ల నుంచి మండ‌ల, గ్రామ స్థాయి వ‌ర‌కు అంతా గ‌త నాలుగైదు నెల‌ల నుండి విస్తృతంగా పర్య‌ట‌న‌లు చేప‌ట్టారు. ఈ నేపథ్యంలో ప్ర‌జ‌ల్లో బీజేపీపై అంచనాలు పెరిగాయ‌ని నేతలు భావిస్తున్నారు. దీంతో మున్సిపల్స్‌లో‌ క‌చ్చితంగా […]

పాలమూరు జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికలను సవాల్‌గా తీసుకున్న మంత్రులు

మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటకుంటే.. సాగనంపుడేనన్న గులాబీ బాస్‌ వార్నింగ్‌ను ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మంత్రులు నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ సవాల్‌గా తీసుకున్నారు. జిల్లాలోని 17 మున్సిపాల్టీల గెలుపు బాధ్యతను తమ భుజస్కందాలపై వేసుకున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు.. ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలకు టికెట్ల బాధ్యత అప్పగించిన కేసీఆర్.. గెలుపే ధ్యేయంగా అందర్నీ కలుపుకుపోవాలని మంత్రులకు […]

కలిసివచ్చే వారిని కలుపుకుపోతాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

టీఆర్ఎస్ పార్టీలో ఎన్నో గ్రూపులు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీ మాత్రం కార్యకర్తల మీదనే ఆధారపడిందన్నారు భువనగిరి ఎంపి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయలేమని స్వయాన కేటీఆర్ అన్నారని ఆయన గుర్తుచేశారు. నార్కట్ పల్లిలో చిట్యాల మున్సిపల్ ఎన్నికల ముఖ్యకార్యర్తల సమావేశంలో పాల్గొన్నఎంపి, పోటీ చేసే అభ్యర్ధుల వివరాలపై ఆరా తీశారు. తమతో కలిసివచ్చే పార్టీలతో పొత్తుకు […]

కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. CAA ను వ్యతిరేకిస్తున్న వారిని బ్రేకుల్లేని బస్సుల్లో పాకిస్తాన్‌కు పంపిస్తామని అన్నారు. ఆందోళనలు చేసే వారికి గట్టిబుద్ధి చెబుతామన్నారు. వారు కర్రలు పడితే తాము కత్తులు పడతామని… వారు రాళ్లు విసిరితే తాము బాంబులు విసురుతామన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ఈ దేశం విచ్ఛిన్నం కావాలనే కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు చూస్తున్నారని విమర్శించారు. […]

మిషన్‌ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై మంత్రి ఆగ్రహం

సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో సొంతగ్రామమైన ఐనపర్వతగిరి మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే ఆరురి రమేష్‌తోపాటు మంత్రి పర్యటించారు. గ్రామంలోని వీధులు తిరుగుతూ పారిశుద్ధ పనులను పరిశీలించారు. డ్రైనేజీ పనులు, ఇంకుడు గుంత నిర్మాణం, డంపింగ్ యార్డ్‌, స్మశానవాటిక పనుల పురోగతిపై ఆరాతీశారు. […]

శంషాబాద్‌లో బీటెక్‌ సెకండియర్ స్టూడెంట్‌ మిస్సింగ్‌

హైదరాబాద్‌ శివార్లలోని శంషాబాద్‌లో భరత్‌ అనే బిటెక్‌ విద్యార్థి అదృశ్యం మిస్టరీగా మారింది. ఎగ్జామ్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడని తండ్రి మందలించడంతో అతను హాస్టల్‌ నుంచి అదృశ్యమయ్యాడు. భరత్‌ హాస్టల్‌ నుంచి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యాయి. కొడుకు ఆచూకీ తెలియకపోవడంతో విద్యార్థి తండ్రి RGIA పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం పద్మారం గ్రామానికి […]

120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే షెడ్యూల్ ప్రకటించారంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం యథాతథంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహిస్తామని […]

మరోసారి భేటీ కానున్న తెలంగాణ,ఏపీ ముఖ్యమంత్రులు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు మరోసారి సమావేశం కానున్నారు. అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 13 న ఏపీ సీఎం జగన్‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సీఎంల మధ్య పలు అంశాలు చర్చకు రావచ్చని తెలుస్తోంది. ఏపీ రాజధాని మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌, జగన్‌ […]

అయ్యో రామ.. బట్టతలతో బతకలేనంటూ ఓ యువకుడు..

జుట్టు ఊడిపోతోంది.. ఏం చేద్దాం.. అందరిదీ అదే సమస్య. దాన్ని కొందరు లైట్‌గా తీసుకుంటే మరికొందరు సీరియస్‌గా తీసుకుంటున్నారు. డాక్టర్ల దగ్గరకు పరిగెట్టడం మందులెన్నో వాడడం. తీసుకునే ఆహారం, పొల్యూషన్, వేళకు నిద్ర ఇవన్నీ జుట్టు ఊడిపోవడానికి కారణాలవుతాయంటూ డాక్టర్లు వివరిస్తుంటారు. అయినా అదే ఆలోచన అతడిని నిద్ర పట్టనివ్వకుండా చేసింది. చివరకు దాన్ని ఓ పెద్ద సమస్యగా భావించి ప్రాణాలు తీసుకున్నాడు. […]

70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రజల్ని పీడించింది: ఎర్రబెల్లి

కేసీఆర్‌ వల్లనే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో జరిగిన పల్లె ప్రగతిలో ఆయన పాల్గొన్నారు. 24 గంటల కరెంట్‌ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. 70 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ప్రజల్ని పీడించిందన్నారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు.