తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం భారీగా పెరిగింది. గత ఏడేళ్లలో 126 శాతం పెరిగినట్లు ఆర్ధిక సర్వే వెల్లడించింది. 2011-12లో 91వేల 121 రూపాయలు ఉన్న తలసరి ఆదాయం.. 2018-19 నాటికి 2 లక్షల 5 వేలకు పెరిగినట్లు సర్వే తెలిపింది. ఇదే సమయంలో…. భారత దేశ సగటు తలసరి ఆదాయం లక్షా 26 వేలు మాత్రమే ఉందని తేలింది. తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం జాతీయస్థాయి సగటు కంటే […]

భాగ్యనగరాన్ని భయపెడుతున్న డెంగ్యూని 15 రోజుల్లో నియంత్రిస్తామన్నారు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. సోమవారం అధికారులతో రివ్యూ చేశారు. మంగళవారం నుంచి అధికారులను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే అధికారులు ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశించారు. తాను కూడా ఇందులో భాగమవుతానన్నారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అన్నీ జ్వరాలు డెంగ్యూ కాదని.. హాస్పిటల్ […]

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. దేశప్రజలంతా కమలం వైపు చూస్తున్నారని.. తెలంగాణలోను అంతేనని అన్నారాయన. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, ఇంఛార్జ్‌ ఖుంతియా వల్లే కాంగ్రెస్‌ బలహీనపడిందని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. అసలు.. కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో నాయకత్వం సరిగాలేదని.. అలాంటప్పుడు పీసీసీ చీఫ్‌గా ఎవరుండి ఏం లాభమని అన్నారాయన. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో […]

కన్న తల్లి ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. బిడ్డ కోసం ఎంతో తాపత్రయపడుతుంది. బిడ్డకు ఏదైనా జరిగితే, తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది. అది మనుషులైనా, జంతువులైనా ఒకటే. కళ్ల ముందే కారు ఢీ కొని లేగ దూడ చనిపోవడంతో, ఓ తల్లి ఆవు కన్నీళ్లు పెట్టుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. జమ్మికుంట గాంధీ చౌరస్తాలో వేగంగా వెళ్తున్న కారు.. లేగ దూడను ఢీకొట్టింది. దీంతో దూడ […]

మాజీ హోం మంత్రి, టీఆర్‌ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహారెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇస్తానని చెప్పి మాట తప్పారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పానని, అయితే కౌన్సిల్‌లో ఉండు.. మంత్రి పదవి ఇస్తా అని కేసీఆరే అన్నారని నాయిని గుర్తుచేశారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని చెప్పారు. తనకు ఆర్టీసీ […]

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,496.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు.. బడ్జెట్‌ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లుగా సీఎం కేసీఆర్‌ చూపించారు. ఆర్థిక లోటు రూ.24,081 కోట్లు ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రతిపాదనలు రూ.1,82,017 కోట్లు […]

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో…. రాజకీయ చిత్రాలు చెక్కడం తీవ్ర దుమారం రేపింది. దేవాలయంలో వ్యక్తులు, పార్టీ గుర్తులు పెట్టడమేంటంటూ విమర్శలు వెల్లువెత్తాయి. యాదాద్రిలో ఆందోళనకు దిగాయి విపక్షాలు. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ భారీ ఆందోళనలు చేశాయి. రాజకీయ పార్టీల నిరసనలు, ఆందోళనలతో ఈ ప్రాంతమంతా హోరెత్తింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు మొహరించారు. బీజేపీ నేతలు ఈ వివాదంపై సీరియస్‌గా ఉన్నారు. ప్రభుత్వ […]

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఆర్థిక మాంద్యం ప్రభావంతోపాటు, స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు పతనమవడం, కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా తగ్గుతుండటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ బడ్జెట్‌ను రూపొందించారు ముఖ్యమంత్రి కేసీఆర్. భారీ అంచనాలను తగ్గించి వాస్తవ లెక్కల ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఎదురయ్యే సానుకూల, ప్రతికూల ఆర్థిక పరిస్థితులను […]

ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షత… తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరిగింది. మంత్రివర్గ విస్తరణ అనంతరం తొలిసారిగా కేబినెట్‌ సమావేశమైంది. పాత, కొత్తమంత్రులు మొత్తం 18 మంది పాల్గొన్న ఈ సమావేశం దాదాపు రెండున్నర గంటలపాటు సాగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌ పద్దులపై సుదీర్ఘంగా చర్చించారు. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా బడ్జెట్‌పైనా సుధీర్ఘంగా చర్చ జరిగింది. అసెంబ్లీలో […]

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగగా.. పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడ్డాక తొలిసారి క్యాబినెట్ భేటీ జరిగింది.. ఈ సమావేశంలో ప్రధానంగా సోమవారం నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలపై క్యాబినెట్ లో చర్చించారు. అలాగే ఇతర నిర్ణయాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.