తెలంగాణ

తెలంగాణ

శాంతిభద్రతల విషయంలో తెలంగాణ నెంబర్ వన్: మహమూద్‌ అలీ

శాంతిభద్రతల విషయంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌గా ఉందన్నారు హోంమంత్రి మహమూద్‌ అలీ. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన ఖైదీల స్టాల్‌ను ఆయన ప్రారంభించారు. అన్ని జైళ్లను అభివృద్ధి చేయడమే కాకుండా.. ఖైదీలకు శిక్షణ, విద్య అందిస్తున్నామన్నారు. ఒకసారి జైలుకు వచ్చిన ఖైదీ మంచి మార్పుతో బయటికి వస్తున్నారన్నారు. ఇది అధికారుల సరైన శిక్షణ వల్లనే సాధ్యమని పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయవద్దని హైకోర్టు ఆదేశాలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.. తదుపరి విచారణ జరిగే వరకు విడుదల చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

బొజ్జల ఇంటికి సీఎం కేసీఆర్‌.. స్నేహితుడికి పరామర్శ

సీనియర్‌ రాజకీయ నాయకుడైన బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. దాంతో తన స్నేహితుడైన బొజ్జల ని సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. ఆదివారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని బొజ్జల ఇంటికి కేసీఆర్‌ వెళ్లి ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా బొజ్జల కుటుంబసభ్యులను కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు. అనంతరం సీఎం కేసీఆర్ ను బొజ్జల శాలువాతో సన్మానించారు. అందరూ కలిసి గ్రూపు […]

ఈ నెల 7న మున్సిపాలిటీ ఎన్నికలకు నోటిఫికేషన్..

మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. మొత్తం రిజర్వేషన్ లలో 50 శాతం మించకుండా ఆయా సామాజికవర్గాలకు కేటాయింపులు చేసినట్లు మున్సిపల్ డైరెక్టర్ శ్రీదేవి స్పష్టం చేశారు. 128 మున్సిపాలిటీలు ఉండగా జడ్చర్ల, నకిరేకల్ పాలకవర్గానికి ఇంకా సమయం ఉంది. పాల్వంచ, మందమర్రి, మణుగూరుకు పలు కారణాలతో రిజర్వేషన్ ప్రకటించ లేదు. అలాగే మిగతా వాటికి ఇప్పుడు ప్రకటించిన రిజర్వేషన్లే తరువాత ఎన్నికల్లో […]

ESI స్కామ్‌ దర్యాప్తులో తాజాగా అప్ డేట్..

ESI స్కామ్‌లో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. లెజెండ్ షెల్‌ కంపెనీకి కృపాసాగర్‌ను ఓమ్ని చైర్మన్‌ శ్రీహరిబాబు అలియాస్‌ బాబ్జి బినామీగా చేర్చినట్టు అధికారుల విచారణలో తేలింది. క్యూ వైట్‌ అనే వైట్‌ బ్లడ్‌ శాంపిల్స్‌ గోల్‌మాల్‌లో 2017-18 సంవత్సరంలో 23 కోట్ల విలువగల 6 వేల 291 యూనిట్లను పంపినట్టు డాక్యుమెంట్స్‌ లభించాయి. అసలు ధర కంటే 2 వందల శాతం ఎక్కువ […]

తెలంగాణలోని కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్ల ఖరారు

తెలంగాణలోని కార్పొరేషన్‌ మేయర్లు, మున్సిపల్‌ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 13 కార్పొరేషన్లలో ఎస్సీలకు 1, ఎస్టీలకు 1, బీసీలకు 4, జనరల్‌కు 7 స్థానాలు కేటాయించారు. 123 మున్సిపల్‌ చైర్మన్‌లో ఎస్టీలకు 4, ఎస్సీలకు 17, బీసీలకు 40, జనరల్‌కు 62 స్థానాలు కేటాయించారు. రిజర్వేషన్లను సంబంధించిన వివరాలను పురపాలక శాఖ డైరక్టర్‌ శ్రీదేవి తెలిపారు. ఎస్టీ రిజర్వేషన్ మొత్తం జనాభా పై […]

తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ ముఖ్య నేతల మధ్య కుమ్ములాట

తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ ముఖ్య నేతల మధ్య కుమ్ములాటలకు మున్సిపల్ ఎన్నికలు వేదిక అవుతున్నాయి. మంచి ఫలితాలు రాబట్టాలని పార్టీ హైకమాండ్ రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేసిన కొంత మంది సీనియర్లు దాన్ని పెడచెవిన పెడుతున్నారు. ఎన్నికల్లో మెజారిటీ మున్సిపాలిటీ, కార్పొరేషన్లు గెలుచుకో లేకపోయినా కనీసం గౌరవప్రదమైన సంఖ్యను సాధించి పార్టీ కేడర్లో ధైర్యం నింపాలి అన్నది పీసీసీ ఆలోచన. దానికోసం […]

ఒక్క మునిసిపాలిటి ఓడినా.. మంత్రి పదవులు పోతాయి: కేసీఆర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ సీనియర్లకు కేసీఆర్. దిశా నిర్దేశం చేశారు. మూడు గంటల పాటు సాగిన సమావేశంలో అనేక సూచనలు, హెచ్చరికలు చేశారు. పురపోరులో పార్టీ ఏకపక్షంగా గెలవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలనే ప్రచార అస్త్రాలుగా వాడుకోవాలన్నారు. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు మనమే గెలుస్తున్నామని, సర్వేలు అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. బీజేపీ పోటీ అనే అపోహలు […]

తెలంగాణలో మున్సిపల్‌ రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తి

తెలంగాణలో మున్సిపల్‌ రిజర్వేషన్ల మొదటి దశ ప్రక్రియ పూర్తయింది.. వార్డుల వారీగా రిజర్వేషన్లను అధికారులు పూర్తిచేశారు.. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. 50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లు వర్తింప జేస్తూ నిర్ణయం తీసుకుంది.. రిజర్వేషన్ల వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపారు అధికారులు.. ఇక రేపు వార్డుల వారీ […]

టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. కేసీఆర్ అధ్యక్షతన భేటీ

మున్సిపల్ ఎన్నికలపై టిఆర్ఎస్ దూకుడు పెంచింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పలువురు నేతలను పార్టీ సమావేశాలకు ఆహ్వానించింది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రాథమికగా మున్సిపోల్స్ పై చర్చించారు. సమావేశంలో సుమారు నాలుగైదు గంటల పాటు […]