ఆన్ లైన్ లో గ్రేడ్స్.. పది పరీక్షా ఫలితాలు

కరోనా వైరస్ కారణంగా పదవతరగతి విద్యార్థుల పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్ధులందరినీ ఉత్తీర్ణులను చేశారు. ఇంటర్నల్ అసెస్ మెంట్ మార్కుల ప్రాతిపదికన గ్రేడ్ లను నిర్ణయించింది విద్యాశాఖ. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం సాయింత్రం 3 గంటల నుంచి... Read more »

ఓ ప్రముఖ దర్శకుడు ఇంత నీచానికి దిగజారుతాడనుకోలేదు: అమృత

ప్రేమించిన వ్యక్తినిపెళ్లి చేసుకోవడమే కూతురు చేసిన నేరమని భావించి నా తండ్రి అత్యంత కిరాతకంగా నా భర్తను చంపించాడు. తరువాతి పరిణామాల అనంతరం నాన్న కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. బిడ్డ అన్యాయమైపోతాడని భావించి వాడిని చూసుకుంటూ జీవచ్చవంలా బ్రతుకుతున్నాను. ఇప్పడు నా కథతో సినిమా... Read more »

కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం కేసీఆర్.. నాయకులు, కార్యకర్తలు రావద్దని ఆదేశాలు

గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్నిసోమవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరామర్శించనున్నారు. సూర్యాపేటలోని కర్నల్‌ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శిస్తారు. సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని సీఎం కేసీఆర్‌ స్వయంగా... Read more »

తెలంగాణలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 730 పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో కరోనా కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. పదుల నుంచి వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 730 పాజిటివ్ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 7వేల 802కు చేరింది. కరోనాతో మరో... Read more »

కల్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

కల్నల్ సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. సంతోష్‌ తండ్రి ఉపేందర్‌తో మాట్లాడారు. దేశం కోసం ప్రాణాన్నే త్యాగం చేసిన ధన్యజీవి సంతోష్‌ అని కొనియాడారు. అమర వీరుడి ఆత్మత్యాగం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. ఆయన లేని... Read more »

మిగతా రాష్ట్రాల కంటే ముందుగానే అప్రమత్తమయ్యాం: ఈటెల రాజేందర్

కరోనా విషయంలో రాష్ట్రప్రభుత్వంపై బీజేపీ విమర్శలు చేయడం సరికాదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. వర్చువల్ ర్యాలీలో బీజేపీ జాతీయ అధ్యక్షడులు జేపీ నడ్డా ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని.. అయితే, పరస్పర ఆరోపణకు ఇది సమయకాదని అన్నారు. జాతీయస్థాయి నయకులు ఇలా మాట్లాడటం... Read more »

సూర్యగ్రహణంతో తెలుగురాష్ట్రాల్లో మూతపడ్డ ఆలయాలు

ఆదివారం రాహుగ్రస్త సూర్యగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాన్ని మూతపడ్డాయి. ఉదయం 10 గంటల 26 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటా 49 నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది. దీంతో చాలావరకు ఆలయాల్లో దర్శనాలను శనివారం సాయంత్రం నుంచి నిలిపివేశారు. పూజల తర్వాత... Read more »

తెలంగాణలో కరోనా పరీక్షలు వేగవంతం

తెలంగాణలో కోవిద్-19 విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కొత్తగా మరో 546 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7072కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు... Read more »

సీఎం కేసీఆర్ సొంత గ్రామం దేశానికే ఆదర్శంగా ఉండాలి: హరీష్ రావు

సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడక దేశానికే ఆదర్శంగా ఉండాలన్నారు మంత్రి హరీష్ రావు. చింతమడక, దమ్ము చెరువు, అంకంపేట గ్రామ పునర్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరో మూడు నెలల్లో మూడు గ్రామాల ప్రజలకు... Read more »

తెలంగాణలో ఒక్కరోజే 546 పాజిటివ్‌ కేసులు నమోదు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 546 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్‌ కేసులు సంఖ్య 7072 కు చేరింది. హైదరాబాద్‌లోనే ఒక్కరోజే 458 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే ఐదుగురు మృతి చెందారు.... Read more »

ఉపాసన భావోద్వేగపు పోస్ట్.. జీవితానికి కావలసిన అతి ముఖ్యమైన పాఠం..

గత కొన్ని రోజులుగా అన్నీ విషాద వార్తలే.. మనసుని కలవర పరుస్తున్నాయి. మా కుటుంబంలోని ముగ్గురు పెద్దవాళ్లు కన్నుమూశారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త విన్నాం. కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశాన్ని కాపాడేందుకు జవాన్లు తమ ప్రాణాల్ని త్యాగం చేశారు.... Read more »

కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ కొత్త గైడ్ లైన్స్

కొత్త గైడ్ లైన్స్ పాటిస్తే కొంత వరకైనా కరోనాని కంట్రోల్ చేయగలుగుతామేమోనని తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు డ్యూటీ చార్ట్ విడుదల చేసింది. సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం కొత్త... Read more »

కృష్ణా, మూసీ నదుల సంగమంలో కల్నల్‌ సంతోష్‌ అస్తికలు నిమజ్జనం

దేశ సరిహద్దుల్లో చైనా సైన్యంతో ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు అస్తికలను ఆయన కుటుంబ సభ్యులు ఈరోజు నిమజ్జనం చేశారు. నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణా, మూసీ నదుల సంగమంలో జరిగిన ఈ కార్యక్రమంలో తండ్రి ఉపేందర్‌, భార్య సంతోషి, కుటుంబ... Read more »

తెలంగాణలో రోజురోజుకూ ఊహించని స్థాయిలో విజృంభిస్తోన్న కరోనా

తెలంగాణపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకూ ఊహించని స్థాయిలో విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 499 కేసులు మోదయ్యాయి. ఒక్క GHMC పరిధిలోనే 329 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో 129 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం... Read more »

శుక్రవారం 2,477 మందికి కరోనా పరీక్షలు చేస్తే 1,978 మందికి నెగిటివ్‌

తెలంగాణలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 499 కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 329 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో 129 కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,526కి చేరింది. మరో... Read more »

కార్గో సేవల్లోకి అడుగుపెట్టిన టీఎస్ఆర్టీసీ

ప్రజారవాణా విషయంలో ప్రత్యేక గుర్తింపు పొందిన టీఎస్ఆర్టీసీ…. కార్గో సేవలు సైతం ప్రారంభించింది. శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్శిల్ సేవల కోసం కార్గో సర్వీసులను ప్రారంభించారు. ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్ట్‌ భవన్‌ నుంచి బస్సులను ప్రారంభించారు. పార్శిల్‌ కొరియర్‌ సేవల వివరాలు సంస్థలో... Read more »