ఇచ్చిన మాట నిలబెట్టుకునే వరకు ఏపీ సీఎం జగన్‌ నిద్రపోరన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లాలో వైఎస్సాఆర్‌ మత్స్యకార భరోసా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని దాదాపు 2600 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పాదయాత్రలో చెప్పిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు మంత్రి బొత్స.

ఆర్టీసీ అంశంలో జోక్యం చేసుకోవాలని తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి నేతృత్వంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసిన బీజేపీ ఎంపీలు.. ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై తెలంగాణ సీఎంతో మాట్లాడతామని నితిన్‌ గడ్కరీ చెప్పినట్లు ఎంపీలు తెలిపారు. త్వరలోనే తెలంగాణ రవాణా మంత్రి, అధికారులను ఢిల్లీ పిలిపించి సమావేశం నిర్వహిస్తామని […]

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు.. ఆ జంటను చూసి విధికి అప్పుడే కన్నుకుట్టిందో ఏమో.. అతడిని దూరం చేసింది.. ఆమెను ఒంటరిని చేసింది. చెన్నై అమింజికరై తిరువీధి అమ్మన్ ఆలయం వీధికి చెందిన అరవింద్, ప్రీతిలకు గత వారం వివాహం జరిగింది. అనంతరం కొత్త జంట హనీమూన్ కోసమని హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తమని తాము మరిచిపోయారు. డోబీ ప్రాంతలోని అందాలను […]

థియేటర్‌కి వచ్చి సినిమా చూసేవాళ్లు తగ్గిపోతున్నారు. నచ్చిన సినిమా రిలీజైన నెలరోజుల్లోపే ఇంట్లో కూర్చుని ఇంటిల్లపాదీ హ్యాపీగా చూసేస్తున్నారు. ఈ పొల్యూషన్‌లో, ఈ ట్రాఫిక్‌లో థియేటర్‌కి వెళ్లి చూడ్డం అంత అవసరమా అనే మాట అందరి నోటా వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. దాంతో థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ సింగిల్ స్క్రీన్ థియేటర్ యజమానిగా అనేక […]

కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ మృతిచెందాడు. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ  చంద్రశేఖర్‌ మరణించాడు. ఈనెల 11న కాచిగూడ రైల్వేస్టేషన్‌ సమీపంలో హంద్రీ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఎంఎంటీఎస్‌ ఢీకొట్టింది.. ప్రమాదంలో ఎంఎంటీఎస్‌ లోకో పైలట్‌ చంద్రశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. క్యాబిన్‌లో ఇరుక్కుపోవడంతో ఆయన్ను బయటకు తీసేందుకు సహాయక బృందాలు 8 గంటలపాటు శ్రమించాయి. చివరకు సురక్షితంగా బయటకు తీసి […]

  అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుపతి ప్యాసింజర్ రైల్లో ప్రయాణిస్తున్న సుధాకర్‌ అనే ప్రయాణికుడిపై కొందరు దాడి చేశారు. కాలసముద్రం రైల్వేస్టేషన్‌ సమీపంలో వ్యక్తులు దాడిచేశాక.. స్లోగా వెళుతున్న రైల్లోంచి సుధాకర్‌ దూకాడు. అయినా వెంబడించి కత్తితో గొంతు కోశారు దుండగులు. స్థానికులు గమనించడంతో… దాడిచేసినవాళ్లు పారిపోయారు. సుధాకర్‌ను స్థానికులు ఆసుపత్రిలో చేర్చారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ మండలం పాలంవాండ్లపల్లికి చెందిన […]

తొలి సినిమానే చిరంజీవితో.. ఆ చిత్రంలో చేస్తుండగానే చిరంజీవికి మరో సినిమాలో అవకాశం.. ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్‌గా మెగాస్టార్‌గా ఎదిగిపోయారు. కానీ ఆయనకు హీరోగా అవకాశం ఇచ్చిన దర్శకుడు మాత్రం ఈ రోజు మంచాన పడి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్థిక బాధలతో సతమతమవుతున్నారు. దయగల మారాజులు ఎవరైనా దయ చూపుతారేమోనని హాస్పిటల్ బెడ్‌పై ఉండి దీనంగా అర్థిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తొలిచిత్రం […]

విజయవాడలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి వాహనాలపై దూసుకెళ్లింది. లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. లారీ ఒక్కసారిగా దూసుకురావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన విజయవాడ నగరంలోని గుణదలలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్‌.. బ్రేక్‌ తొక్కబోయి ఎక్సలేటర్‌పై కాలు వేశాడు. దీంతో లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఓ స్కూల్‌ వ్యాన్‌ సహా […]

ఇంగ్లీష్‌ మీడియంపై వెనక్కి తగ్గేది లేదన్నారు ఏపీ సీఎం జగన్‌. పేద పిల్లల భవిష్యత్‌ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఇంటర్మీడియట్‌పైన చదివే విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌తోపాటు ఏడాదికి రూ.20 వేలు చెల్లిస్తామని ప్రకటించారు. ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు సీఎం జగన్‌. చరిత్రను మార్చే తొలి అడుగు వేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒంగోలులో […]

సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని పొన్నాల గ్రామ శివారులో బీజేపీ కార్యాలయానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ భూమి పూజ చేశారు. త్వరలో 8 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలకు భూమిపూజ చేస్తామన్నారు. ఇప్పటికే దేశంలో చాలాచోట్ల బీజేపీ అధికారంలోకి వచ్చిందని.. సిద్ధిపేటలోనూ బీజేపీ బలపడుతోందని అన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన అభివృద్ధి పనులకు, నిర్ణయాలకు ప్రజల మద్దతు లభిస్తోంది అన్నారు. దేశంలో అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించింది […]