పెళ్లికి వెళ్తే ఏదో ఒక గిఫ్ట్‌ పట్టుకెళ్తాం. కొత్త జంట కాపురానికి అవసరమయ్యే వాటిల్లో మనకు నచ్చింది కానుకగా చదివిస్తాం. కానీ విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఓ పెళ్లిలో ఓ వ్యక్తి డబ్బాడు ఇసుకను గిఫ్ట్ ఇచ్చాడు. దాన్ని నీట్‌గా ప్యాకింగ్ మీద ప్యాకింగ్ చేసి మరీ తెచ్చాడు. తీరా దీన్ని ఓపెన్ చేశాక.. అవాక్కవడం, ఆపై నవ్వుకోవడం పెళ్లికొడుకు, పెళ్లికూతురు వంతయ్యింది. ఇసుకకు ప్రస్తుతం ఎంత కొరత […]

దేశంలోనే తొలిసారిగా ఎలిఫెంట్ మెమోరియల్ ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. ఆగ్రా-మధుర జాతీయ రహదారి పక్కన దీనిని నెలకొల్పారు. ఇందులో ప్రపంచంలో ఉండే అన్ని జాతులకు చెందిన ఎనుగులను ప్రదర్శనకు ఉంచారు. అలాగే వాటికి సంబంధించిన సమస్త సమాచారాన్ని అందుబాటులో ఉంచారు. దేశంలోనే ఈ తరమా మెమోరియల్ మొదటిదని యూపీ ప్రభుత్వం తెలిపింది. విద్యార్ధులను, పరిశోధకులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు.

రైలు పట్టాలమీద నడుస్తున్నారా..? అయితే జాగ్రత్త.. మిమ్మల్ని యమధర్మరాజు ఎత్తుకుపోతాడు.. యమధర్మరాజేంటి..? ఎత్తుకుపోవడమేంటి..? అని పరేషాన్‌ అవుతున్నారా.. అవును, ముంబైలో రైలు పట్టాలపై నడిచేవారికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. పట్టాలపై మనిషి కనిపించడం ఆలస్యం హఠాత్తుగా ప్రత్యక్షమై ఎత్తుకుని వెళ్లిపోతున్నాడు. అయితే, ఆయన నిజమైన యముడు కాదు.. ముంబై పశ్చిమ రైల్వే అధికారుల ఐడియా ఇలా వర్కవుట్‌ అవుతోంది. రైల్వే ప్రొటక్షన్‌ ఫోర్స్‌కు చెందిన కొందరు సిబ్బందికి యముడి వేషం […]

అమ్మానాన్న ఎక్కడికి వెళ్లారో.. హాల్లో వాడిని ఒక్కడినే వదిలేశారు. కనీసం ఆయమ్మ కూడా దగ్గర లేనట్టుంది. ఎవరు లేరురా బుజ్జిగా.. నిన్ను చూసుకునే డ్యూటీ నాదే అన్నట్లు పిల్లి వాడి కదలికల్ని గమనిస్తోంది. పాలు తాగే ఆ పసివాడు పాకుతూ మెట్ల అంచు దగ్గరకు వెళ్లి పోయాడు. అది గమనించిన పిల్లి వెంటనే దూకి వచ్చి అచ్చంగా మనుషులు అడ్డుకున్నట్లే ఆ చిన్నారిని మెట్ల మీద నుంచి పడిపోకుండా రక్షించింది. […]

నక్కను పట్టుకోవడానికి ఉచ్చు పన్నితే పులి వచ్చి ఇరుక్కుంది. అసోంలోని దిబ్రూఘర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. బలాయ్ థాన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోళ్లఫామ్ నిర్వహిస్తున్నాడు. ఐతే, ఆ కోళ్లఫామ్‌లోని కోళ్లను రాత్రిపూట ఏదో జంతువు వచ్చి తినేస్తోంది. అడవి నుంచి నక్క వచ్చికోళ్లను తినేస్తోందని భావించిన ఫామ్‌ యజమాని, నక్కను బంధిం చడానికి ఉచ్చుపన్నాడు. ఆ ఉచ్చులో జంతువు పడగానే ఇంట్లో అలారం మోగేలా ఏర్పాటు […]

రియాలిటీ షోలన్నింటిలోనూ ‘బిగ్ బాస్’ షో ప్రత్యేకం. ‘బిగ్ బాస్’ స్టార్ట్ అయింది అంటే ఆ షో కు ఉండే క్రేజే వేరు. ఇక టైటిల్ విషయంలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే టాలీవుడ్‌లో రెండు సీజన్లు ముగిశాయి. తాజాగా మూడో సీజన్‌కు కూడా శుభం కార్డు పడింది. 100 రోజులకు పైగా అభిమానులను అలరించిన ఈ షోలో రాహుల్, శ్రీముఖి మధ్య చివరి నిమిషం వరకు హోరా హోరి పోటీ […]

స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్‌లోని ఓ రైల్వేస్టేషన్‌లో ప్రమాదం తప్పింది. స్మార్ట్ ఫోన్‌లో తలమునకలైపోయిన ఓ యవతి పట్టాలపై పడిపోయింది. ట్రైన్ ఇంకా ప్లాట్‌ఫాంపైకి రాకముందే ఫోన్ చూస్తూ వేగంగా ముందుకు వెళ్లిపోయి పట్టాలపై పడింది. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన రైల్వే అధికారులు.. ఆ ప్రయాణికురాలు స్వల్ప గాయాలతో బయటపడినట్లు వెల్లడించారు.  📱Distracted by her phone, woman walks straight onto Madrid tracks | https://t.co/N7J6EnvleV […]

చీకటిని తిడుతూ కూర్చోకు చిరు దీపాన్ని వెలిగించు అని పెద్దలు చెప్పినట్లు.. సమస్య వచ్చినప్పుడు పరిష్కారం గురించి ఆలోచిస్తేనే ఐడియాలు వస్తాయి. సో.. మీ ఆలోచన మరో పదిమందికి ఏంటి.. వేల మందికి కూడా నచ్చేస్తుంది. ఆలోచనకు సృజనాత్మకతను జోడిస్తే అదే వైరల్ అవుతుంది. భారతీయుల సృజనాత్మకతకు సంబంధించి తనను ఆకట్టుకున్న కొన్ని ఫోటోలను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇవి పోస్ట్ […]

  ఇంట్లో మనుషులతో సమానంగా శునకాల్ని చాలా మంది పెంచుతారు. నిజానికి, ఈ మధ్యకాలంలో శునకాలనే.. మషుషుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అవి మనల్ని కాపాడుతాయనో… దొంగలు వస్తే అరుస్తాయనో.. మనల్ని అంటిపెట్టుకొని ఉంటాయనో వాటిని ముద్దు చేస్తాం. కానీ, అదే మన ఇంటికి నిప్పంటిస్తుందని తెలిస్తే ఎవరైనా పెంచుతారా? ఒక శునకం తన యజమాని ఇంటికి నిప్పంటించి మొత్తం నాశనం చేసింది. ఎక్కడ ఏ వస్తువు కనిపించినా.. దాని […]

సోషల్‌ మీడియా పిచ్చిలో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ.. దాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌, వాట్సప్, టిక్‌టాక్‌ వంటి యాప్‌ల్లో పెట్టేందుకు అత్యుత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదాలకు గురై.. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. కొంత మంది ఫ్రెండ్స్‌ గ్రూప్ ఒకచోట చేరి బైక్‌తో రోడ్డుపక్కన స్టంట్స్ చేస్తున్నారు.. ఓ వ్యక్తి బైక్‌ను రౌండ్‌గా తిప్పుతూ స్టంట్స్ […]