సైన్యానికి, శునకాలతో ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఎక్కువ. భద్రతలో డాగ్స్ పాత్ర చాలా కీలకం. శత్రువుల ఆచూకీ కనిపెట్టడం, ల్యాండ్‌మైన్స్‌ను గుర్తించడం, మారణాయుధాల గుట్టు రట్టు చేయడంలో శునకాలు వాటికవే సాటి. అందుకే డాగ్స్‌కు ఆర్మీ చాలా విలువ ఇస్తుంది. ఆ విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. భారత సైన్యంలో చాలాకాలం సేవలందించిన డచ్ అనే డాగ్ ఇటీవల చనిపోయింది. డచ్ మృతిపై ఆర్మీ తీవ్రంగా స్పందించింది. దేశానికి సేవ చేసిన […]

పవన్ అభిమానులు, జనసేన పార్టీ మద్దతుదారులకు సంబంధించిన ఖాతాల్ని బ్లాక్ చేసింది ట్విట్టర్‌ సంస్థ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి, భారీ ఫాలోయింగ్ ఉన్న ట్రెండ్ PSPK, పవనిజం నెట్ వర్క్, వరల్డ్ PSPK ఫ్యాన్స్, దాస్ PSPK సహా పలుపేర్లతో ఉన్న దాదాపు 300 ట్విట్టర్ ఖాతాలు సస్సెండ్ అయ్యాయి. జనసేనకు మద్దతుగా పని చేసే శతఘ్ని టీంకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాలు ఇవి. జనసేన శ్రేణులు […]

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఓ లారీ డ్రైవర్‌‌కి దిమ్మదిరిగిపోయే రీతిలో ఫైన్ వేశారు ఒడిశా రవాణా శాఖ అధికారులు. మొత్తం ఏడు నియమాల ఉల్లంఘనలకు గానూ దిలీప్‌ కర్తా అనే డ్రైవర్‌కు సంబల్‌పూర్‌ ఆర్టీఏ అధికారులు చలానా జారీ చేశారు. ఆ చలానా చూసి షాక్ అయ్యాడు దిలీప్.  ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నాగాలాండ్‌కు చెందిన ఆ లారీకి పత్రాలు సరిగాలేవు. గత ఐదేళ్లుగా రోడ్డు ట్యాక్స్‌ […]

ఫేస్‌బుక్‌లో పరిచయం ఎంత బావుంది. చాటింగ్‌తో మొదలై.. ఛాయ్ తాగే వరకు వెళ్లింది. మరో అడుగు ముందుకు వేద్దామంటే అభిమానం అడ్డొచ్చింది.  పెద్దలు చీవాట్లు పెడతారేమోనని భయపడ్డారు. దొంగ చాటుగా ప్రేమ వ్యవహారాన్ని నడిపించారు. ప్రియురాలు ఒంటరిగా ఉందని తెలిసి డైరక్ట్‌గా ఆమె ఇంటికే వెళ్లి.. అడ్డంగా బుక్కయ్యాడు ప్రియుడు. బాలేశ్వర్ జిల్లా మణిపూర్ సోరోలోని గులునియా గ్రామానికి చెందిన సురేంద్ర బెహెరా కుమార్తెకు, కుబబపాట్న గ్రామానికి చెందిన బై […]

ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు రెచ్చిపోయారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ ఓ యువకునిపై అమానుషంగా దాడి చేశారు. రోడ్డుపైకి ఈడ్చి చిత్రహింసలు పెట్టారు. కిందపడేసి కాళ్లతో తన్నారు. నేనేం తప్పు చేశానో చెప్పండి అంటూ ఆ యువకుడు వేడుకున్నా ఆ పోలీసులు కనికరించలేదు. పైగా మరింత రెచ్చిపోయి యువకున్ని దారుణంగా వేధించారు. సిద్ధార్థనగర్ జిల్లాలోని నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో ఓ యువకుడు బైక్‌పై వెళ్తూ ఇద్దరు పోలీసుల కంటపడ్డాడు. ట్రాఫిక్‌ నిబంధనలను […]

ఓ చెరకు తోటలో కూలీలు పనులు చేసుకుంటున్నారు. అంతలో 2 కొండ చిలువలు అక్కడికి చేరుకున్నాయి. పొదల మాటున చుట్టుకుని ఉన్న కొండచిలువల్ని చూసిన కూలీలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో జరిగింది. పాముల్ని చూసి ముందుగా భయపడ్డా.. వెంటనే కోలుకుని కర్రతో ఓ కొండచిలువను కొట్టి చంపారు. మరోకటి పొదల్లోకి పారిపోయింది. చుట్టూ కొండ ప్రాంతం కావడంతో చెరుకు […]

ఈ రోజుల్లో చిన్నస్థాయి హోటల్‌కు వెళ్లినా జేబులు ఖాళీ అవుతున్నాయి. ప్లేట్ ఇడ్లీ.. తక్కువలో తక్కువ 20 రూపాయలు ఉంటుంది. కానీ ఈ 80 ఏళ్ల బామ్మ మాత్రం రూపాయికే ఇడ్లీ ఇస్తున్నారు. అది కూడా కట్టెల పొయ్యి మీద వండి వడ్డిస్తున్నారు. 10 రూపాయలతో 10 ఇడ్లీలు తిని కడుపునింపుకోవచ్చు. ఈ బామ్మ నిస్వార్ధ సేవపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఇడ్లీ […]

వియత్నాంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు చెవిలో తరచు దురద వస్తుండేది. అయితే ఆ మహిళ మొదట్లో అంతగా పట్టించుకోలేదు. దురద భరించలేనంతంగా రావడంతో డాక్టర్ల దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్లింది. చెవి ఇన్ఫెక్షన్ వల్ల దురద పెడుతోందని వైద్యులు భావించారు. ఎందుకైనా మంచిదని ఎండోస్కోపీ విధానంలో వైద్యులు ఆమె చెవిలోకి కెమేరాను పంపి చూశారు. ఆమె చెవిలో పదుల సంఖ్యలో చిన్న చిన్న పుట్టగొడుగులు కనిపించడంతో.. డాక్టర్లు […]

ఈ సువిశాల ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. బ్రహ్మగారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా అనేక చోట్ల వింతలు జరుగుతునే ఉన్నాయి. తాజాగా అర్జెంటీనాలో ఓ వింత జీవి జన్మించింది. విల్లా అనే గ్రామంలో ఆవు మనిషి ముఖం కలిగిన దూడకు జన్మనిచ్చింది. పుట్టిన దూడ ముఖం మనిషిలాగే ఉండటంతో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పుట్టిన ఈ ఆవుదూడకి మనిషిని పోలినట్టుగా చిన్న ముక్కు , […]

జీవితంలో ఏదైనా మోతాదుకు మించితే ముప్పు తప్పదు.. మనం చేసే ప్రతి పని లిమిట్‌లోనే ఉండాలి.. కాదని అతి ఉత్సాహంతో చేస్తే మాత్రం అనర్ధమే. అందుకు తాజాగా జరిగిన ఓ సంఘటనే ఉదాహరణగా నిలిచింది.  పగల్బడి నవ్వి చైనాకు చెందిన ఓ మహిళ చిక్కుల్లో పడింది. ఏదైనా హాస్యభరిత సన్నివేశం చూసినప్పుడు కానీ, చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైనా జోక్ వేసినప్పుడు ముసిముసిగా లేదా పగల్బడి నవ్వడం సహజం. కానీ […]