సూటు బూటు వేసుకుని పెళ్లికి వెళ్లారు. వారిచ్చిన గ్రాండ్ డిన్నర్‌ని శుభ్రంగా తిన్నారు. పోతూ పోతూ వారు చేసిన పని వాళ్లెంత చీపో తెలియజేసింది. ప్లేట్‌లో వారు వదిలేసిన ఐటెంని పక్కన కూర్చున్న వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. అది చూసిన నెటిజన్స్ సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణీ అవుతూ ఇలా ప్రవర్తించడం సిగ్గుమాలిన చర్య అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. […]

పిల్లల కోసం 57 ఏళ్ల పాటు ఎదురుచూసిన ఓ మహిళ నిరీక్షణ ఫలించింది. 74 ఏళ్ల మంగాయమ్మ పండంటి ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. గుంటూరులోని అహల్య ఆసుపత్రిలో సిజేరియన్‌ ద్వారా ఆమెకు కవలలు జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా నెల పర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962 మార్చి 22న పెళ్లయింది. ఎన్నేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచినా వారి ఆశలు నెరవేరలేదు. అలా […]

అమ్మతనం ఓ వరం. ప్రతి మహిళా తల్లయ్యాక తన జన్మధన్యమైనట్టే భావిస్తుంది. అలాంటిది పిల్లల కోసం 57 ఏళ్ల పాటు ఎదురుచూసిన ఓ మహిళ నిరీక్షణ ఫలించనుంది. 74 ఏళ్ల బామ్మ తల్లికాబోతోంది. సిజేరియన్‌ ద్వారా కవలలకు జన్మనివ్వబోతుండటం విశేషం. గుంటూరులో ఈ అరుదైన ఘటన జరగనుంది. తూర్పుగోదావరి జిల్లా నెల పర్తిపాడుకు చెందిన ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులకు 1962 మార్చి 22న పెళ్లయింది. ఎన్నేళ్లయినా పిల్లలు పుట్టకపోవడంతో […]

లోకంలో అత్యంత విశ్వాసమైన జంతువు ఏదైనా ఉందంటే అది శునకం మాత్రమే.. అలాంటిది ఎంతో ప్రేమతో పెంచుకుంటున్న శునకం మరణిస్తే.. దానిని పెంచుకుంటున్న వారి బాధ వర్ణనాతీతం. ఆ బాధను దిగమింగుతూ మరణించిన శునకానికి ఎంతో ఘనంగా వీడ్కోలు పలికారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన ఉదయగిరి రమేష్ దంపతులు అంత్యక్రియలు చేశారు . 9 సంవత్సరాలుగా పెంచుకుంటున్న రోట్వేల్లర్‌కు చెందిన శునకంపై వీది కుక్కలు దాడి చేశాయి. […]

పానీ పూరీ.. ఆహా.. ఈ పేరు వింటుంటే.. పానీ పూరీ బండి దగ్గరకు పరిగెట్టాలనిపిస్తోంది కదూ..! అక్కడి వెళ్లి గుటుక్కున నోట్లో వేసుకోవాలని పిస్తుంది కదా..! ఇక సాయంత్రమైతే చాలు.. చాలామంది పానీపూరీ బండి ముందు క్యూ కడతారు. పడిగాపులు కాసి మరీ పానీపూరీ రుచిని ఆస్వాదిస్తారు. నీళ్లలో ముంచితీసే పూరీ కోసం ప్లేట్లు పట్టుకుని బండి చుట్టూ చేరతారు. అయితే, చాలామంది పానీపూరీ వ్యాపారులు పానీ తయారీలో నాణ్యత, […]

ప్రముఖ పారిశ్రామిక వేత్త.. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఇంట వినాయకచవితి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కూతురు, కొడుకు పెళ్లిళ్లు ఒకే సంవత్సరంలో జరగడంతో ఇరు జంటలకు ఇదే మొదటి వినాయకచవితి. దాంతో ఈ సంబరాలను అత్యంత ఆనందంగా జరుపుకోవాలని భావించారు అంబానీ దంపతులు. ఇందుకోసం వేడుకల్లో పాలు పంచుకునేందుకు రమ్మంటూ ఆహ్వాన పత్రికలను సైతం ప్రింట్ చేయించారు. పండుగకు వారం రోజుల ముందు నుంచే అంబానీ ఇంట హడావిడి […]

ట్రాఫిక్ పోలీసంటే వాహనాల్ని నియంత్రించడం.. చలాన్లు రాయడమే కాదు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నాంటూ అండగా నిలబడడం కూడా అని నిరూపించారు ఓ పోలీస్. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సాక్షిగా నిలిచారు. భారీ వర్షంతో భాగ్యనగర రోడ్లు నదుల్ని తలపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మామూలుగానే రోడ్డు దాటడం కష్టంగా ఉంటుంది. ఇక ఓ పేషెంట్ పరిస్థితి మరీ కష్టం. ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడు తండ్రిని హాస్పిటల్‌నుంచి తీసుకువస్తూ […]

వారి ప్రేమ సమాజంలోని సరిహద్ధులను చెరిపేసింది. కొందరు మనుషులు గీసిన అడ్డుగీతను మాయం చేసింది. మతం అడ్డును తొలగించింది. వివాహ బంధంలో ఉన్న మూస ఆచారానికి తెర దించింది. ఇలాంటి అసమానతలను దాటుకుని ఆ జంట ఒక్కటైంది. అయితే వారు పెద్దలను ఎదిరించి ఒక్కటైన అమ్మాయి, అబ్బాయి అనుకుంటే మాత్రం పొరపాటే. కేవలం అమ్మాయి, అబ్బాయిల మధ్యనే ప్రేమ పుట్టదు. అమ్మాయిలు కూడా ప్రేమించుకోవచ్చు వారు వివాహ బంధంతో ఒక్కటవచ్చని […]

ఎమోషన్స్ మనుషులకే కాదు నోరు లేని మూగ జీవాలకు కూడా ఉంటాయి. కష్టాల్లో ఉన్న తోటివారిని రక్షించాలనే తాపత్రయం వాటికీ ఉంటాయి. ఇలాంటి ప్రయత్నాన్ని మనం ఎక్కువగా శునకాల్లో చూశాం. అయితే తాజాగా రెండు ఎలుగుబంట్లు చెత్త డంప్‌లో చిక్కుకుపోయిన మరో ఎలుగు బంటిని కాపాడడం కోసం చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంటుంది. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంతకీ వీడియోలో ఏముందంటే.. డంప్‌స్టర్‌లో చిక్కుకున్న […]

బలాబలాల విషయంలో మహిళలు.. పురుషులకు ఏం మాత్రం తీసిపోరు అనేందుకు.. నాగాలాండ్‌ ఎమ్మెల్యే తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోనే చక్కటి ఉదహరణ. గుంతలో చిక్కుకున్న మహింద్ర బొలెరో వాహనాన్ని నాగా మహిళా బెటాలియన్‌కు చెందిన సిబ్బంది చాకచక్యంగా బయటకు తీశారు. నాగాలాండ్‌ ఎమ్మెల్యే మహోన్‌లునో కికన్‌ మంగళవారం తన ట్విట్టర్‌లో ఈ వీడియోని పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. ‘రోడ్డు పక్కన […]