టర్కీ మద్దతుగల ప్రతిపక్ష ఫైటర్స్ నియంత్రణలో ఉన్న ఉత్తర సిరియా పట్టణంలో శనివారం కార్ బాంబు పేలింది, దీంతో 12 మంది మృతి చెందారు.. అలాగే అనేక మంది గాయపడ్డారు అని సిరియా ప్రతిపక్ష కార్యకర్తలు, టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఉత్తర సిరియా అనేక పేలుళ్లతో దెబ్బతింది.. గత నెలలో అనేక మంది ప్రజలు మరణించడం కాకుండా చాలా మంది గాయపడ్డారు. ఉత్తర సిరియా నుండి […]

అనుకున్నదే జరిగింది. బంగ్లాదేశ్ తో టెస్ట్ మ్యాచ్ ను కేవలం మూడు రోజుల్లోనే ముగించేసింది కోహ్లీసేన. భారత బౌలర్లు విజృంభణతో తొలి ఇన్నింగ్స్ లో 130 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 130 పరుగులకే కుప్పకూలిన.. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. బంగ్లా ఆటగాళ్లలో ముష్పీకర్ రహీమ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అయితే 64 పరుగుల వ్యక్తిగత స్కోర్ […]

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. మొలుక్క సముద్ర తీరంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. టెర్నేట్ పట్టణానికి 139 కిలోమీటర్ల దూరంలో, 45 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు ప్రకటించారు. భూకంప తీవ్రత అధికంగా ఉండడంతో సునామీ హెచ్చరికలను జారీ చేసింది ఇండోనేషియా ప్రభుత్వం. తీర ప్రాంతంలో నివసిస్తున్న వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ముందుజాగ్రత్త చర్యగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. […]

భారత్-అమెరికా త్రివిధ దళాల పరస్పర సహకార శిక్షణ కార్యక్రమానికి తూర్పు నావికాదళం వేదికైంది. విశాఖ-కాకినాడ సముద్ర జలాల్లో ఈనెల 21న సంయుక్త విన్యాసాలు జరపనున్నారు. టైగర్ ట్రంప్‌ 2019 పేరుతో వాటిని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా INS జలాశ్వపై మార్చ్‌ జరిగింది. భారత్-అమెరికా మధ్య స్నేహబంధం బలోపేతం అవుతున్నట్టు అమెరికా దౌత్యవేత్త కెన్నత్ జస్టర్‌ అన్నారు. రెండు దేశాల మధ్య మిలటరీ సహకారానికి సంయుక్త విన్యాసాలు దోహదం చేస్తాయని తెలిపారు. […]

కొద్దిరోజులక్రితం ఐసిస్ ఉగ్ర సంస్థ అధినేతను మట్టుపెట్టిన అమెరికా … మరోసారి ఇస్లామిక్ ఉగ్రసంస్థ కార్యకలాపాలపై దృష్టిసారించింది. ఐసిస్ అధినేత అల్ బాగ్దాదీ స్థానంలో నియమితుడైన అబూ ఇబ్రహీం అల్ షష్మీ అల్ ఖురేషీ ను హతమారుస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అతన్ని లక్ష్యంగా చేసుకొని చర్యలుచేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. అతను ఎక్కడ ఉన్నాడో అందరికి తెలుసు అన్నాడు. ఎకనామిక్స్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్ లో మాట్లాడుతూ […]

  బ్రెజిల్‌లో 11వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. భారత్‌-చైనా సంబంధాలు మరింత బలోపేతం దిశగా ఇరువురి మధ్య చర్చలు జరిగినట్లు ప్రధాని మోదీ తెలిపారు. చెన్నైలో జరిగిన సమావేశం తర్వాత మరోసారి కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధానికి కొత్త దిశను, శక్తిని […]

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అభిశంసన ప్రక్రియ ప్రారంభమైంది. అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేసినందుకు ఆయనను అభిశంసించాలంటూ డెమొక్రాట్లు ఇప్పటికే తీర్మానాన్ని ఆమోదించారు. ట్రంప్ అభిశంసనపై జరిగుతున్న విచారణ అంతా తొలిసారిగా లైవ్ లో ప్రసారం చేశాయి. బుధవారం జరిగిన తొలి రోజు విచారణను హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ తన టెలివైజ్డ్ ద్వారా చేపట్టింది. వచ్చే ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ నేత, […]

ఏం తల్లీ.. ఇంట్లో వాళ్లు సరిపోలేదా.. వీధిలో ఉన్న కుక్కల్నీ, పిల్లుల్లీ వెంటేసుకు వస్తున్నావ్.. అని అమ్మ అరిస్తే వాటిని పెంచుకోవాలని ప్రేమ ఉన్నా ప్రేమగా తెచ్చుకున్న ఆ బుజ్జి కుక్క పిల్లనో, పిల్లి పిల్లనో వీధిలోనే వదిలేసి రావాల్సిన పరిస్థితి. మరి అతడు పెంచుకునేది పిల్లినో.. కుక్కనో కాదు.. పైథాన్‌ని. ఎక్కడో అడవుల్లో తిరిగే 8 ఇంచుల కొండచిలువను తీసుకు వచ్చి ప్రేమగా పెంచుకుంటున్నాడు ఇంగ్లాండ్‌కి చెందిన మార్కస్ […]

కేరళలో రెండు హత్యలు చేసి.. తప్పించుకుంటున్న ఇద్దరు నిందితులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. లబులు, జ్యువెల్ అనే బంగ్లాదేశీయులైన క్రిమినల్స్.. కేరళలోని వెన్మని పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరిని హత్యచేసి వారి నుంచి బారీగా బంగారం, నగదు దోచుకున్నారు. విశాఖ మీదుగా కోల్ కతా వెళ్లి.. అక్కడి నుంచి తమ దేశానికి పారిపోవాలని ప్రయత్నించారు. కేరళ పోలీసులు ఇచ్చిన సమాచారంతో విశాఖ పోలీసులు నిఘా పెట్టి.. హంతకులను రైల్వేస్టేషన్ […]

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ బ్రెజిల్ వెళ్లారు. ఎకనామిక్ గ్రోత్ ఫర్ యాన్ ఇన్నోవేటివ్ ఫ్యూచర్ అనే అంశంపై 11వ బ్రిక్స్ సదస్సు జరగనుంది. బుధవారం, గురువారం రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో భాగంగా డిజిటల్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి కావాల్సిన సహాయ సహకారాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. అంతేకాకుండా ప్రపంచంలోని ఐదు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన బ్రెజిల్, […]