ఎంత పనిచేసినా జీతం ఎక్కువ ఇవ్వట్లేదని బాధపడే వాళ్లను చూస్తాం. వేతన సవరణ కోసం ఉద్యమాలు, ఆందోళనలు సర్వసాధారణం. కంపెనీ ఏదైనా ఉద్యోగుల్లో నిరంతరం అసంతృప్తి కలిగించేది ఏదైనా ఉందంటే జీతమే. ఏటేటా ఇంక్రిమెంట్ ఉన్నా.. ఏదో వెలితి ఉంటుంది. కానీ తాను చేస్తున్న పనికి ఇప్పటికే ఎక్కువ జీతం వస్తోంది అదనంగా ఇంక అవసరం లేదు అనే వాళ్లను చూశారా? గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ అదే పని […]

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ను నిట్టనిలువునా ముంచిన ఆర్థిక నేరస్తుడు నీరవ్‌ మోదీకి బ్రిటన్‌ కోర్టు జూన్‌ 27 వరకు రిమాండ్‌ పొడిగించింది. అలాగే నీరవ్‌ మోదీని భారత్‌కు అప్పగిస్తే ఏ జైలులో ఉంచుతారు.. ఆయనకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో 14 రోజుల్లోగా వెల్లడించాలని భారత అధికార వర్గాలు తెలియజేయాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి రిమాండ్‌ విచారణను వచ్చే నెల 27న వీడియోలింక్‌ ద్వారా చేపట్టనున్నట్లు మెజిస్ట్రేట్‌ తెలిపారు. […]

అమెరికాను టోర్నడోలు వణికిస్తున్నాయి. ఒక్లహోమాలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి . టోర్నడో ధాటికి వందలాది ఇళ్లు నేలకూలాయి. ఇద్దరు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హాస్పిటల్స్‌ తరలించి చికిత్స అందిస్తున్నారు. టోర్నడో ధాటికి ఓక్లహోమాలో వరదలు పోటెత్తాయి . సహాయక చర్యలను అధికారులుముమ్మరం చేశారు. విద్యుత్తు సరఫరాకు ఆటంకం ఏర్పడడంతో లక్షలాది మంది ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు. కూలిన భవనాలను మరమ్మతులు చేసే పనిలో అధికారులు, […]

ఓ బిడ్డకు జన్మనివ్వడం అంటే ‘ఆమె’కు మరో జన్మ ఎత్తినంత.. అయినా అపురూపంగా 9 నెలలు మోసి.. పండంటి బిడ్డను కని.. తను పడ్డ బాధనంతా మరిచి.. పుట్టిన బిడ్డను పొత్తిళ్లలో పొదువుకుంటుంది. తన రక్తాన్ని చనుబాల రూపంలో బిడ్డ నోటికి అందిస్తుంది. అందులోనే ఆనందాన్ని వెతుక్కుంటుంది. అలాంటి ఆనందాన్ని అనుభవించకుండానే ఆమె ఆశలను నీరుగారుస్తూ కడుపులో పెరుగుతున్న బిడ్డ 14 వారాలకే చనిపోతే.. ఆ తల్లి బాధ వర్ణానాతీతం. […]

ప్రపంచ ధనవంతుల జాబితా లిస్ట్‌లో టాప్‌5లో ఉండే వారెన్ బఫెట్ ఒక రోజు సంపాదన రూ. 240 కోట్లు. ఇది చాలా గొప్ప విషయమే కావచ్చు. కానీ అంతకంటే గొప్ప విషయం ఆయన సంపాదనలో 99 శాతం స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తుంటారు. ఒక మనిషి గొప్పతనం అతని సంపాదనలో కాదు.. ఔదార్యంలో ఉంటుంది అని బఫెట్ చెప్పకనే చెబుతారు. అందుకే ఆయన్ను ప్రపంచంలోని గొప్ప గొప్ప వ్యక్తులంతా స్ఫూర్తిగా […]

పాకిస్థాన్‌కు మరోసారి మోదీ షాక్‌ ఇచ్చారు. ఇప్పటికే నిబంధనలను పలుమార్లు ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్‌కు.. తనదైన శైలిలో సమాధానం చెప్పేందుకు సిద్ధమంటూ మోదీ సంకేతాలు ఇచ్చారు. ఈ నెల 30న రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బిమ్‌స్టెక్ దేశాధినేతలకు భారతదేశం ఆహ్వానం పంపింది. BIMSTEC అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటీవ్ ఫర్ మల్టీ-సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కార్పొరేషన్. బంగాళాఖాతం తీరంగా […]

కాఫీ డేల్లోనే కథలు తయారవుతాయి. ఆ డిస్కషన్ ఓ మంచి సినిమాగా రూపు దిద్దుకుంటుంది. లంచ్ మీటింగ్స్ ఓ స్టార్టప్ కంపెనీకి ప్రేరణ అవుతుంది. మరి పట్టిందల్లా బంగారమే అయి ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన వారెన్ బఫెట్‌తో లంచ్ చేసే అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. ఆయన ఓ మంచి బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు. మనసున్న మంచి మనిషి కూడా. అందుకే తన సంపాదనలో 99 […]

ఇంగ్లాండులోని కుంబ్రియా ప్రాంతానికి చెందిన కెపాపర్ క్రూజ్ అనే 13 ఏళ్ల బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి ఈడెన్ నది దగ్గరకు వెళ్లాడు. నది మద్యలో నడుస్తూ పట్టుతప్పి నీటిలో పడిపోయాడు. అక్కడున్న వారంతా అప్రమత్తమైనా ఆ బాలుడు త్వరగా చిక్కలేదు. చివరికి 25 నిమిషాల అనంతరం వారి ప్రయత్నం ఫలించి ఆ బాలుడు దొరికాడు. అసలే చలికి గడ్డకట్టుకు పోయి ఉంది నది. ఇక అందులో ఇంతసేపు ఉన్న […]