ప్రేమించిన ప్రియురాలికి వెరైటీగా పెళ్లికి ప్రపోజ్ చేయాలనుకున్నాడు. నీళ్లలో దిగి ప్రపోజ్ చేశాడు. ఆమె ఓకే చెప్పింది. కానీ అంతలోని అతడికి ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద సంఘటన తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాలో జరిగింది. ప్రేమ జంట స్టీవెన్, కెనసాలు.. రెండ్రోజులు ఎంజాయ్ చేద్దామని నీటిపై తేలియాడే హోటల్‌కి వెళ్లారు. కెనసాను రూమ్‌లో ఉండమని చెప్పి స్టీవెన్ నీటిలో దిగాడు. నీకో సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పి […]

ఎనర్జీ సిటీ హ్యూస్టన్‌కే డబుల్ డోస్‌ ఎనర్జీ నింపారు మోదీ-ట్రంప్‌. ఇద్దరు నేతల పరస్పర ప్రశంసలతో స్టేడియం మార్మోగిపోయింది. ఎన్ఆర్జీ స్టేడియం‌ ఊగిపోయింది. మునుపెన్నడూ ఏ దేశాధినేతను పొగడని రేంజ్‌ లో మోదీ…ట్రంప్‌ పాలనను కీర్తించారు. ట్రంప్‌ కూడా మోదీ రేంజ్‌ కు తగ్గకుండా అతని సామర్థ్యాన్ని ప్రశంసించారు. మోదీ నినాదాలతో మార్మోగిపోయిన స్టేడియంలో గుడ్‌ మార్నింగ్‌ హ్యూస్టన్‌ అంటూ ప్రసంగం ప్రారంభించిన మోదీ..ఆ తర్వాత అంతా ట్రంప్‌ పై […]

పంచ్‌ డైలాగులు, భవిష్యత్‌ లక్ష్యాలు, గత ఐదేళ్లలో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ప్రధాని మోదీ తనదైన స్టైల్‌ ఎన్‌ఆర్జీ స్టేడియంలో తమ ప్రభుత్వ సత్తాను చాటిచెప్పారు. మోదీ ప్రసంగిస్తున్నంత సేపు ఎన్‌ఆర్జీ స్టేడియం గ్యాలరీలు నమో మంత్రంతో మార్మోగిపోయాయి. భిన్న సంస్కృతులు, విభిన్న భాషలు ఉన్నా భారతీయత స్పూర్తి అందర్ని ఏకం చేస్తుందని మన దేశ విశిష్టతను చాటిచెప్పారు. అనేక సంస్కృతులు…ఒకే దేశం మా విధానం అన్నారు మోదీ బీజేపీ […]

హ్యూస్టన్ హోరెత్తిపోయింది.. మోదీ నామస్మరణతో మార్మోగిపోయింది.. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన హౌడీ-మోదీ మీటింగ్‌కు ప్రజలు పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన ప్రవాస భారతీయులతో NRG ఫుట్‌బాల్‌ స్టేడియం జనసంద్రంగా కనిపించింది. NRIలు, మోదీ అభిమానులు త్రివర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. 50 వేలకు పైగా తరలివచ్చిన జన సందోహాన్ని మరింత ఉత్తేజితులను చేస్తూ అమెరికన్‌ సెనెటర్లు ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు అతి దగ్గరి […]

ప్రధాని మోదీ మరోసారి తన సింప్లిసిటీతో ఆకట్టుకున్నారు. కిందపడిపోయిన పువ్వును స్వయంగా తీసి ఆశ్చర్యపరిచారు. నేను ప్రధానిని, పువ్వు కిందపడిపోతే నేను తీయాలా అనే శషభిషలు పెట్టుకోకుండా పువ్వును తీసి పక్కనే ఉన్న అధికారికి అందించారు. అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీ హ్యూస్టన్ ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం లభించింది. ఈ సమయంలో ఓ ఆఫీసర్ మోదీకి వెల్కమ్ చెబుతూ పుష్పగుచ్చం అందించారు. అందులో నుంచి ఒక పువ్వు కిందపడింది. అది గమనించిన […]

హౌడీ మోదీ కార్యక్రమంలో ఓ వ్యక్తి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. అతని పేరు స్పర్శ్ షా. 16 ఏళ్ల స్పర్శ్, హౌడీ మోదీ మీటింగ్‌లో జాతీయ గీతాన్ని ఆలపించనున్నాడు. ఓ యువకుడు జాతీయ గీతాన్ని ఆలపించడం పెద్ద విశేషమేమీ కాదు కానీ, స్పర్శ్ మాత్రం అందుకు మినహాయింపు. ఇతను వికలాంగుడు. అరుదైన వ్యాధి కారణంగా స్పర్శ్ నడవలేడు. ఈ వైకల్యాన్ని నిర్వాహకులు పట్టించుకోలేదు. అతని ప‌్రతిభకే పెద్ద పీట వేశారు. […]

వారం రోజుల పాటు అమెరికాలో పర్యటనలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ కోసం అక్కడ ప్రత్యేక మెనూ రెడీ అయింది. హోస్టన్‌ కు చెందిన ప్రముఖ చెఫ్‌ కిరణ్‌ వర్మ ప్రధాని కోసం ప్రత్యేకంగా తయారుచేసిన నమో తాలి సేవ్రి, నమో తాలి మిఠాయి పసందైన వంటకాలను వడ్డించనున్నారు. మోదీ కోసం ఈ వంటకాలన్నీ స్వచ్ఛమైన దేశీ నెయ్యితో తయారు చేస్తున్నారు. ప్రధాని మెనూలో పలు రకాల పచ్చళ‍్లను […]

అమెరికా-భారత్ మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడమే… హోడీ -మోదీ కార్యక్రమం ఉద్దేశం. వర్తక-వాణిజ్య పరంగా ఇటీవలి కాలంలో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు కొద్దిగా దెబ్బతిన్నాయి. గత ఏడాది భారత్ నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్‌ ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచింది. జీఎస్‌పీ హోదాను రద్దు చేసి కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్‌ ప్రయోజనాన్ని నిలిపేసింది. ప్రతిగా భారత ప్రభుత్వం అమెరికన్ వస్తువులపై టాక్స్‌లు పెంచింది. అమెరికా నుంచి […]

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్‌ డీసీలోని ఓ వీధిలో ఆగంతకుడు జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కాల్పుల ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. కాల్పుల్లో ఉగ్రవాద కోణంపై ఆరా తీస్తున్నారు. సమీప వీధులను ఖాళీ చేయించి దుండగుడి […]

చంద్రునిపై పరిశోధనల కోసం వెళ్లిన విక్రమ్ ల్యాండర్‌పై ఆశలు సన్నగిల్లుతున్నాయి. పది రోజులు గడిచిపోయినప్పటికీ ల్యాండర్ నుంచి కమ్యూనికేషన్ దొరకడం లేదు. భూకేంద్రంతో విక్రమ్‌ను కాంటాక్ట్ చేయడానికి ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలితాన్నివ్వడం లేదు. నాసా సహకారంతోనూ ప్రయోజనం కనిపించలేదు. విక్రమ్‌ పరిస్థితిని తెలుసుకోవడానికి నాసా శాస్త్రవేత్తలు లూనార్ రికానసెన్స్ ఆర్బిటార్‌ను పంపించారు. చంద్రుడి ఉపరితలానికి సమీపంలో పరిభ్రమిస్తున్న లూనార్, ఈ నెల 17న విక్రమ్ సమీపంలోకి వస్తుందని నాసా […]