అనుమానం పెనుభూతమైంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తిని అంతమొందించాడు.. దీంతో అతనికి యావజ్జీవ శిక్ష విధించింది లండన్ కోర్టు.. హైదరాబాద్ కు చెందిన నదీమ్‌ ఉద్దీన్‌ హమీద్‌ మొహమ్మద్‌ (26) కొన్నేళ్లుగా లండన్ లో ఉంటున్నాడు. అతనికి ఏడాది కిందటే వివాహం జరిగింది. అయితే అతను పనిచేస్తున్న కంపెనీలో సహోద్యోగి పెర్విజ్‌ (27)తో పరిచయం ఏర్పడింది. పెర్విజ్‌ పాకిస్థాన్ కు […]

డొరియన్ హరికెన్ బహమాస్ ద్వీపాన్ని అతలాకుతలం చేసింది. ఈ తుఫాన్ దేశంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని ప్రధానమంత్రి హుబర్ట్ మిన్ని అన్నారు. దీని ప్రభావంతో 50మంది మరణించారని, 2వేల 5వందల మంది కనిపించకుండా పోయినట్లు ఆయన తెలిపారు. మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన అన్నారు. రికార్డు స్థాయిలో ప్రజలను ఇళ్లను ఖాళీ చేయించి శిబిరాలకు తరలించినట్లు ప్రధాని వివరించారు. ఇప్పటికీ వేలాదిమంది శిబిరాల్లో తలదాచుకుంటున్నారని, […]

వియత్నాంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు చెవిలో తరచు దురద వస్తుండేది. అయితే ఆ మహిళ మొదట్లో అంతగా పట్టించుకోలేదు. దురద భరించలేనంతంగా రావడంతో డాక్టర్ల దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్లింది. చెవి ఇన్ఫెక్షన్ వల్ల దురద పెడుతోందని వైద్యులు భావించారు. ఎందుకైనా మంచిదని ఎండోస్కోపీ విధానంలో వైద్యులు ఆమె చెవిలోకి కెమేరాను పంపి చూశారు. ఆమె చెవిలో పదుల సంఖ్యలో చిన్న చిన్న పుట్టగొడుగులు కనిపించడంతో.. డాక్టర్లు […]

2001, సెప్టెంబ‌ర్ 11.. సరిగ్గా 18 ఏళ్ల క్రితం.. యావత్తూ అమెరికా దద్దరిల్లింది. శత్రు దుర్బేధ్యం అంటూ మురిసిపోయే అగ్రరాజ్యం అభిజాత్యంపై భయంకరమైన దెబ్బ పడింది. అమెరికా పాలకులు, ప్రజలకు వెన్నులో వణుకుపుట్టించేలా ఉగ్రవాదులు పంజా విసిరారు. కనీవినీ ఎరుగని రీతిలో విమానాలతో స్వైర విహారం చేశారు. WTC జంట భవనాలతో పాటు ఏకంగా పెంటగాన్ రక్షణ కార్యాలయంపైనే దాడి చేసి దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆ మారణహోమానికి సంబంధించి […]

విక్రమ్‌ ల్యాండర్‌తో కాంటాక్ట్ కోసం ఇస్రో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజులుగా ట్రై చేస్తు న్నప్పటికీ కమ్యూనికేషన్ కుదరడం లేదు. ల్యాండర్‌ తో సంబంధాలు పునరుద్దరించడానికి ఇస్రోకు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉంది. సెప్టెంబర్ 21 తర్వాత ల్యాండర్‌తో కమ్యూనికేషన్ చేయడం కుదరదు. ఎందుకంటే, చంద్రునిపై ఒక లూనార్ డే టైమ్ మాత్రమే పని చేసేలా ల్యాండర్‌ను రూపొందించారు. ఒక లూనార్ డే అంటే 14 రోజులు. […]

దొంగతనం చేసిన ఓ దొంగ దొరక్కుండా ఉండేందుకు అతితెలివి ప్రదర్శించాడు. దొంగతనం చేసి యువతి పక్కన నగ్నంగా నిద్రపోయాడు. చివరకు జైలుపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలోని క్యాలిఫోర్నియాలో జరిగింది. క్యాలిఫోర్నియాలో చికో స్టేట్‌ యూనివర్సీటీలో చదివే 21 ఏళ్ల విద్యార్థిని నార్త్‌ క్యాలిఫోర్నియాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. ఈ నెల 9వ తేదీన ఆమె ఉంటున్న ఇంటికి సమీపంలోని ఇంట్లో ఓ దొంగ చొరబడ్డాడు. ఆ ఇంట్లో ఉన్న […]

కశ్మీర్‌పై రాద్దాంతం చేస్తున్న చైనాకు గట్టి షాక్ తగిలింది. కశ్మీర్‌తో కలవరం పుట్టించాలని చైనా వేసిన ఎత్తుగడను భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడర్‌కు మోదీ సర్కారు ఎసరుపెట్టింది. అసలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో మీకు పనేంటని చైనాను గట్టిగా నిలదీసింది. పీఓకేలో నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది. రోడ్డు మార్గాలు ఎందుకు వేస్తున్నారని మండిపడింది. చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడర్‌ను అంగీకరించే ప్రసక్తే […]

కశ్మీర్‌పై నానాయాగి చేస్తున్న పాకిస్థాన్, అంతర్జాతీయ వేదికపై తడపడింది. స్వయంగా పాక్ విదేశాంగమంత్రి షా మహమూద్ ఖురేషీ, ఆ దేశం పరువు తీసేశారు. కశ్మీర్ తమదే అంటూ పాకిస్థాన్ చేస్తున్న వాదనలో డొల్లతనాన్ని పాక్ మంత్రి బట్టబయలు చేశారు. ఇంటర్నేషనల్ స్టేజ్‌లపై భారతదేశాన్ని ఇరికించే క్రమంలో మనసులో మాటను బయటపెట్టారు. కశ్మీర్ భారత్‌దేశానిదే అని ఖురేషీ అంగీకరించారు. జమ్మూకశ్మీర్‌ను ఇండియన్ స్టేట్ ఆఫ్ కశ్మీర్ అని ఖురేషీ స్పష్టంగా పేర్కొన్నారు. […]

ఆస్తుల ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2020లో జరిగే దేశాధ్యక్ష ఎన్నికలకు ముందు తన ఫైనాన్షియల్ రిపోర్టును వెల్లడిస్తానని చెప్పారు. ఎలక్షన్స్‌కు ముందు ఆస్తుల వివరాలు బయటపెడతానన్నారు. పూర్తిస్థాయి రిపోర్టు ఇస్తానని, సగం.. సగం విషయాలు చెప్పబోనన్నారు. ఆ వివరాలు మీడియాను, ప్రజలను షాక్‌కు గురి చేస్తాయని చెప్పారు. ఏటా ఎంత పన్ను కడుతున్నారనే అంశంపై ట్రంప్ ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పైగా, ట్రంప్ […]

ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ బరితెగించింది. టెర్రరిస్టులపై చర్యలు తీసుకోకపోతే నిషేధం తప్పదని FATF చేసిన హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంది. తాజాగా పాకిస్థాన్ గూఢచారి సంస్థ-ISI, ఉగ్రవాద సంస్థలతో సమావేశమైంది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఖలిస్థానీ జిందాబాద్ నేతలతో ISI ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఇస్లామాబాద్‌లోని సైనికాధికారికి చెందిన ఓ రహస్య ప్రదేశంలో ఈ మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఆర్టికల్-370 రద్దు తర్వాతి పరిణామాలు, కశ్మీర్ పరిస్థితులపై […]