మాజీ సీఎం కుమారస్వామి మెడకు మరో కేసు

కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి చెక్ పెట్టే పనిలో ఉంది బీజేపీ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీబీఐ ఎంక్వైరీకి అప్పగించింది. మొన్నటి వరకు జేడీఎస్ మిత్రపక్షంగా కాంగ్రెస్ కూడా యడియూరప్ప నిర్ణయాన్ని స్వాగతించాయి. దీంతో కర్ణాటక పొలిటికల్ లీగ్ లో మరో గేమ్ ప్రారంభం కాబోతోంది. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి థ్రిల్లర్ పాలిటిక్స్ కు వేదికగా నిలుస్తోంది కర్ణాటక. బీజేపీ, కాంగ్రెస్ నెంబర్ గేమ్ లో జాక్ పాట్ కొట్టేసి సీఎం కుర్చి తన్నుకుపోయింది జేడీఎస్. కానీ, ఆ సంబురం ఎక్కువ కాలం నిలబడలేదు. బీజేపీ గేమ్ ప్లాన్ ముందు కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలింది. యడియూరప్ప మళ్లీ సీఎం కుర్చిఎక్కారు. అయితే..ఇంకా కేబినెట్ విస్తరణ కూడా కాకముందు కర్ణాటక రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి.

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆయన అనుచర గణానికి చెందిన ఫోన్లను ట్యాపింగ్ చేశారని కుమారస్వామి ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. మొన్నటి రాజకీయ సంక్షోభ సమయంలో అనర్హత వేటుకు గురైన జేడీఎస్ నేత విశ్వనాథం..కుమారస్వామిపై ఈ ట్యాపింగ్ బాంబు పేల్చాడు. ఆపరేషన్ కమల సమయంలో నేతలు, అధికారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు ఆరోపించారు. అటు సీఎల్‌పీ నేత సిద్ధరామయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు కూడా ఫోన్ ట్యాపింగ్ సంగతేంటో తేల్చాలని డిమాండ్ చేశారు.

అందివచ్చిన అవకాశాన్ని సీఎం యడియూరప్ప సక్సెస్ ఫుల్ గా వాడుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహరాన్ని సీబీఐ చేతికి అప్పగించారాయన. రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ చర్చకు దారి తీస్తున్న ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరిపిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం ఎటు వెళ్లి ఎటూ చేరుతుందోనని కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. సీఎం సీటు చేజారిన కొద్దిరోజులకే సీబీఐ ఎంక్వైరీని ఎదుర్కొవాల్సిన పరిస్థితులు కుమారస్వామికి ఎదురవబోతున్నాయి.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్లతో చర్చించనున్న సీఎం కేసీఆర్

Mon Aug 19 , 2019
తెలంగాణలో కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పన దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రగతి భవన్‌లో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరు కానున్నారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాలని నిర్ణయించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో భూపరిపాలనలో ప్రత్యక్ష సంబంధం కలిగిన కలెక్టర్ల అభిప్రాయాలు […]