సెల్‌ఫోన్ల కంటైనర్‌ చోరీ కేసును చేధించిన పోలీసులు

నెల్లూరులో సెల్‌ఫోన్ల కంటైనర్‌ చోరీ కేసును పోలీసులు చేధించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ భారీ చోరీ జరిగింది. అప్పటి నుంచి పలు కోణాల్లో.. దర్యాప్తు చేపట్టిన నెల్లూరు పోలీసులు.. చోరీ చేసిన ముఠాను గుర్తించారు. చోరీకి పాల్పడ్డ ఆరుగురు జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. సుమారు రూ. 4 కోట్ల 80 లక్షల విలువైన సెల్‌ఫోన్ల కంటైనర్‌ను ఈ ముఠా చోరీ చేసింది.

ఆరు నెలల పాటు స్మగ్లర్ల కోసం గాలించిన పోలీసులు.. ఎట్టకేలకు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఆ కంటైనర్ ను బంగ్లాదేశ్ కు తరలించినట్టు గుర్తించారు. వారి దగ్గర నుంచి 70 లక్షల నదగు, ఓ లారీ, కారు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

చంద్రబాబు భద్రతపై హైకోర్టు కీలక తీర్పు

Wed Aug 14 , 2019
టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. చంద్రబాబుకు మొత్తం 97 మంది భద్రతాసిబ్బందిని కొనసాగించాలని ఆదేశించింది. సీఎస్ఓను ప్రభుత్వం నియమించవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఆయన కాన్వాయ్ లో జామర్ ఇవ్వాలనీ ఆదేశాలు జారీ చేసింది. క్లోజ్డ్ ప్రొటెక్షన్ టీమ్ విధులు ఎవరు నిర్వహించాలనే విషయంలో ఎన్ఎస్జీ, ఐఎస్ డబ్లూ కలిసి చర్చించుకోవాలని, మూడు నెలల్లోగా ఓ నిర్ణయం తీసుకుని చంద్రబాబుకు 5 ప్లస్‌ 2 […]