కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతాలు పెరిగాయ్..

మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డీఏను 5 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఉద్యోగుల డీఏ 12 నుంచి 17 శాతానికి పెరిగింది. దాంతో పాటు ట్రాన్స్‌పోర్ట్ (టీఏ) కూడా పెంచింది. ఈ రెండు పెంచిన కారణంగా ఉద్యోగుల జీతం రూ.810 నుంచి రూ.4,320 వరకు పెరగనుంది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు అర్బన్ సిటీస్‌లో పనిచేసే ఉద్యోగులకు టీఏ కనిష్టంగా రూ.1350 ఉండగా.. గరిష్టంగా రూ.7200 ఉంది. అలాగే చిన్న పట్టణాల్లో పనిచేసే ఉద్యోగులకు టీఏ రూ.900 నుంచి రూ.3600 మధ్యలో ఉంది.

TV5 News

Next Post

హైదరాబాద్‌ డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ లక్ష్మీ అరెస్ట్‌

Sat Oct 12 , 2019
హైదరాబాద్‌ డ్రగ్‌ ఇన్స్‌పెక్టర్‌ లక్ష్మీని అరెస్ట్‌ చేశారు ఏసీబీ అధికారులు. బ్లడ్‌ బ్యాంక్‌కు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు బంగారం రూపంలో లంచం తీసుకుంటుండగా.. లక్ష్మీని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గతంలో ఇదే బ్లడ్‌ బ్యాంక్‌ నుంచి ఆమె 50 వేలు లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది.