మోదీ నాయకత్వం వల్లే అది సాధ్యమైంది : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం ప్రజలను కలుసుకున్నారు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని సనత్ నగర్ లో ఆయన పర్యటించారు. విక్టోరియా గంజ్ ప్రాంతంలోని ప్రజలతో ముచ్చటించారు. బస్తిలో ప్రజాసమస్యలను అడిగితెల్సుకున్నారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి తమ ప్రాంతంలో తొలిసారిగా పర్యటిస్తుండటంతో పార్టీ కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున తరలొచ్చారు.

కేంద్రంలో కాంగ్రెసేతర పార్టీ వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఇది రెండోసారని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మోదీ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని అన్నారాయన.

TV5 News

Leave a Reply

Your email address will not be published.

Next Post

పాతబస్తీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రెచ్చిపోయిన మైనర్లు

Sat Jun 15 , 2019
హైదరాబాద్ పాతబస్తీలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ మైనర్లు రెచ్చిపోయారు. సంతోష్ నగర్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు రోడ్లపై డేంజర్ స్టంట్స్ చేశారు. మైనర్ల ర్యాష్ డ్రైవింగ్, డేంజర్ స్టంట్స్ ఇతర వాహనదారులు హడలెత్తిపోయారు. అడ్డుకునే వాళ్లే లేకపోవటంతో చంద్రాయణ గుట్ట వరకు ప్రమాదకరంగా బైక్ నడుపుతూ అందర్ని భయపెట్టారు. ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ఈ పోకిరి బ్యాచ్ ర్యాష్ డ్రైవింగ్ తో చెలరేగిపోవటం అలవాటుగా మారిపోయింది. పట్టించుకోవాల్సిన పోలీసులు ఫైన్లతో […]