విశాఖ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుకు కృషి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

kishanreddy

విశాఖ జీవీఎంసీ కార్పొరేషన్‌ పనితీరు ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి. విశాఖలో పర్యటిస్తున్న ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై పలు విభాగాల అధికారులతో సమీక్ష చేశారు.

విశాఖ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు కింద కేంద్రం నుంచి రావాల్సిన 100 కోట్ల నిధులు త్వరగా విడుదల అయ్యేలా కృషి చేస్తాను అన్నారు కిషన్ రెడ్డి. హౌసింగ్‌ కోసం 1500 ఎకరాల భూమి అవసరమని ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఇసుక సమస్య తాత్కాలికమైనదే అని కిషన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

TV5 News

Next Post

ఆర్టీసీ చట్టం కేంద్ర చట్టంలో భాగమే : హైకోర్టు

Wed Nov 13 , 2019
ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది హైకోర్టు. అటు రూట్ల ప్రైవేటీకరణపై మాత్రం గురువారం మరోసారి వాదనలు విననుంది. సమ్మె వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టు సూచించిన.. ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీ ప్రతిపాదనకు విముఖత వ్యక్తం చేసింది. పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీ ప్రస్తావన లేదని పేర్కొంది. హైకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్నందు వల్లే లేబర్‌కోర్టుకు వెళ్లలేదని న్యాయస్థానానికి నివేదించింది […]